6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

చదువు లేకున్నా.. సోలార్‌ ఇంజినీర్లయ్యారు! 1 Y 95 days ago

 కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు అంటూ ఓ సినీ కవి రాసిన పాట తమకు సరిగ్గా సరిపోతుందని నిరూపించారు ఆ గిరిజన మహిళలు. చీకటిని తిడుతూ కూర్చోకుండా తమ గ్రామాల్లో చిరుదీపాలను వెలిగించాలని సంకల్పించారు. అక్షరజ్ఞానం కూడా లేని గిరి మహిళలు తమకు ఏమాత్రం పరిచయం లేని ఓ రంగాన్ని ఎంచుకుని అందులో నిపుణులుగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. చదువు లేని గ్రామీణ ప్రాంత మహిళలకు వృత్తిపరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తోంది రాజస్థాన్‌లోని తిలోనియా కేంద్రంగా పనిచేస్తోంది బేర్‌ఫుట్‌ అనే అంతర్జాతీయ సంస్థ. దీని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖ మన్యానికి చెందిన పది మంది గిరి మహిళలకు సోలార్‌ పరికరాల మరమ్మతులు, తయారీపై ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చి, వారిని సోలార్‌ ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు చింతపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో సోలార్‌ రంగంలో నిపుణులుగా శిక్షణ పొందిన వీరు ఇటీవలే తిరిగి వచ్చారు.

చికిత్స పొందుతూ విద్యార్థి నాగార్జునరెడ్డి మృతి1 Y 95 days ago

 హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన నాగార్జునరెడ్డి అనే విద్యార్థి సోమవారం మృతి చెందాడు. మూడు రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమై కృష్ణాజిల్లా చిల్లకల్లు వద్ద కాలిన గాయాలతో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జునరెడ్డి పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూ.500 దొంగిలించాడని తోటి విద్యార్థులు అవమానించడంతో తాను ఆత్మహత్యకు యత్నించినట్లు నాగార్జురెడ్డి లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే

సీఆర్‌పీఎఫ్‌లో 197 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్1 Y 96 days ago

 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) చాంద్రాయణగుట్ట కేశవగిరి గ్రూప్ సెంటర్‌లో 197 కానిస్టేబుల్ పోస్ట్‌లకు నియామకాలు చేపట్టనున్నట్లు సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుధీర్ దివాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో కానిస్టేబుల్(టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్) పోస్ట్‌లకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 10వ తేదీ వరకు అర్హులైనవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఆర్‌పీఎఫ్‌ఇండియా.కామ్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్‌పీఎఫ్.ఎన్‌ఐసీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ఉద్యోగావకాశాలకు సంబంధించిన నోటీస్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్‌పీఎఫ్.ఎన్‌ఐసీ.ఇన్‌లో కూడా ఉంచినట్లు తెలిపారు.

‘ఆరోగ్యలక్ష్మి’కి రూ.800 కోట్లు1 Y 96 days ago

రాష్ట్రంలో సోదరీమణుల అవసరాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, ఇందుకోసం రూ.800 కోట్లు మంజూరు చేశారని పంచాయతీరాజ్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందని అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కుర్తిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పంట రుణాలు మాఫీ చేశామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.17 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. వచ్చే వేసవి నుంచి వ్యవసాయూనికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.

ముందు తాగిస్తాడు.. తర్వాత దోచేస్తాడు1 Y 96 days ago

చూసేందుకు జెంటిల్‌మన్ వేషధారణ.. చేతిలో నగదు కట్టలు ఉన్నట్టుగా భ్రమింపజేసే ఓ బ్యాగ్.. మార్కెట్‌కు వచ్చే జ్యువెలరీ షాప్ ఉద్యోగులు.. రైతులను లక్ష్యంగా చేసుకుని చోరీలు.. ఇదీ ఆ జ్యువెలరీ దొంగ తీరు. దర్జాగా డ్రెస్ చేసుకుని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తిలా హడావుడి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానని బాధితులతో పరిచయం పెంచుకుంటాడు. వారికున్న మద్యం తాగే అలవాటును ఆసరాగా చేసుకుని పీకలదాకా తాగిస్తాడు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల సంచిని, డ బ్బుల్ని చోరీ చేసి ఉడాయిస్తాడు. ఈ రకమైన చోరీలు చేసిన నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్లాపురం చిన్నారెడ్డిని మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జంటనగరాల్లోని జ్యువెలరీ షాప్‌ల నుంచి కొనుగోలు చేసిన 2.3 కిలోల బంగారు ఆభరణాలను తీసుకొస్తున్న తన డ్రైవర్ ప్రశాంత్‌కు పీకలదాకా మద్యం తాగించి ఓ వ్యక్తి తస్కరించుకుని పోయాడని వరంగల్‌కు చెందిన నగల వ్యాపారి బొల్లామ్ సంపత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించారు.

అగ్నిమాపకశాఖలో 139 ఖాళీల భర్తీ1 Y 96 days ago

హైదరాబాద్: రాష్ట్ర అగ్నిమాపకశాఖలో 139 మంది హోంగార్డుల నియామకానికి హోంశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఫైర్ అవుట్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న హోంగార్డుల పోస్టులను భర్తీ చేయాల్సిందిగా అగ్నిమాపకశాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ)కి సూచించారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 117 మందిని హోంగార్డులుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం1 Y 96 days ago

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 12లో అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. అయితే... కారులో ఐదుగురు యువతులు ఉన్నప్పటికీ వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి

రోడ్డు ప్రమాదంలో భెల్‌ కాంట్రాక్టు కార్మికుడి మృతి 1 Y 96 days ago

 రోడ్డు ప్రమాదంలో భెల్‌ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపినగర్‌ కాలనీలో నివాసముంటున్న రవి(34), బైండ్ల బాలయ్య(36) బీహెచ్‌ఈఎల్‌(భెల్‌) పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై పటాన్‌చెరు వైపు వెళుతుండగా 65వ నంబరు జాతీయ రహదారి బీరంగూడ కమాన్‌ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. 

నల్గొండ జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు1 Y 96 days ago

 గుప్త నిధుల కోసం జిల్లాలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. జిల్లాలోని మోత్కూరు గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ తవ్వకాలు జరిపారు. ఈ సందర్బంగా దేవాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఆదివారం తెల్లవారుజామున విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలికి పెద్దసంఖ్యలో విచ్చేసి తవ్వకాలను పరిశీలించారు.

నేడు ‘ఖేడ్’ ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం1 Y 96 days ago

నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపాల్‌రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 13వతేదీన జరిగిన ఉపఎన్నికల్లో భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి 52వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

7.35 కోట్లు.. ఫ్రీడమ్‌ ఫోన్ల డిమాండ్‌ ఇది!1 Y 96 days ago

ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీడమ్‌ 251 కొనుగోలుకు జనం వెల్లువెత్తారు. అనుమానాలను, సందేహాలను పక్కనపెట్టి, ఊహలకు భిన్నంగా మూడు రోజుల్లోనే ఏకంగా 7.35 కోట్ల మంది బుక్‌ చేసుకున్నారు. శనివారం ఉదయం 11 గంటల వరకు 7.35 కోట్ల ఫోన్లకు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వచ్చాయి. బుకింగ్‌కు ఆదివారం వరకూ గడువున్నా తమ అంచనాలకు మించి ఆర్డర్లు రావడంతో శనివారం మధ్యాహ్నం నుంచే రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ ఆర్డర్లను నిలిపి వేసింది. 7.35 కోట్ల మందికిగాను ఫోన్‌ చార్జీ రూ.251తోపాటు రవాణా చార్జి చెల్లించింది 30 వేల మంది మాత్రమేనని, మిగతా వాళ్లు ఫోన్ల డెలివరీ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని రింగింగ్‌ బెల్స్‌ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత కుమార్‌ గోయల్‌ తెలిపారు. ఏప్రిల్‌ నుంచి ఈ చౌక స్మార్ట్‌ ఫోన్ల సరఫరా మొదలవుతుందని, ఈ ఏడాది చివరికల్లా మొత్తం 7.35 కోట్ల ఫోన్లను సరఫరా చేస్తామని కంపెనీ పేర్కొంది.

రాజధాని నిర్మాణంలో ప్రీకాస్ట్‌ పరిజ్ఞానం ఉపయోగించాలి 1 Y 96 days ago

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ నేపథ్యంలో ప్రీకాస్ట్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని, సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ దిశగా నూతన పరిశోధనలు చేయాలని ఐఐటీ (హైదారాబాదు) ప్రొఫెసర్‌ ఎస్‌.సూర్యప్రకాశరావు అన్నారు. లాంలోని చలపతి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం ప్రీకాస్ట్‌ టెక్నాలజీపై సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఆచార్య సూర్యప్రకాశ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నిర్మాణరంగంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో డబ్బు. సమయం ఆధా అవుతుందని చెప్పారు. నూతన రాజధానిలో ఇటువంటి విధానం విస్తృత స్థాయిలోఉపయోగించాలని, ఇందుకు నేటి సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు

విమానం వీల్‌లో శవం.. బోర్డులో క్యాష్‌ 1 Y 96 days ago

 అమెరికాకు చెందిన ఆ కార్గో విమానం లాం డింగ్‌ గేర్‌లో ఓ శవం. విమానంలో 67 టన్నుల క్యాష్‌. ఆరు రోజులుగా హరారే విమానాశ్రయంలో నిర్భంధంలో ఉన్న విమానానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. దాంతో ఆ విమానం దక్షిణాఫ్రికా బాట పట్టింది. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన జింబాబ్వే పోలీసులు.. అనుమానించదగ్గ విషయాలేవీ లేకపోవడంతో ఆరు రోజుల తర్వాత విడిచి పెట్టారు. విమానం ఎక్కువ ఎత్తులో ప్రయాణించడంతో ఆక్సీజన్‌ అందక ఆ వ్యక్తి మరణించాడని గుర్తించారు.

గురుకుల టీచర్ల సమస్యలపై త్వరలో భేటీ1 Y 97 days ago

ఎస్సీ గురుకుల విద్యా సంస్థల టీచర్ల సమస్యలు, ఇతరత్రా అంశాలపై త్వరలోనే సమావేశం నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్సీ అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్టాఫ్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం సచివాలయంలో మంత్రిని వివిధ సంఘాల నాయకులు కొల్లు వెంకటరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, ఏ.వి.రంగారెడ్డి, బి.సక్రు కలసి వినతిపత్రం సమర్పించారు. గురుకుల విద్యా డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, పీఆర్సీ 2015లో వేతన సవరణ చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు (కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ ర్లు) చేయాలని, రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 2,800 ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
 

మాస్టర్ ప్లాన్పై టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం1 Y 97 days ago

 సీఆర్డీఏ రాజధాని మాస్టర్ ప్లాన్ వల్ల  రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్లాన్ రైతులను చావమన్నట్లు ఉందని మచిలీపట్నం ఎంపీ, టీడీపీ నాయకుడు కొనకళ్ల నారాయణ ఆరోపించారు.  కృష్ణాజిల్లాను అగ్రికల్చర్ జోన్గా ప్రకటించడంతో తమ పని అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కోటి రూపాయిల విలువ చేసే ఎకరా భూమి... నేడు రూ. 10 లక్షలు కూడా పలకడం లేదని నారాయణ విచారం వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి వెళ్తే రైతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికెళ్లినా... చావుకెళ్లినా రైతులు దీనిపైనే మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు.  అగ్రికల్చర్ జోన్ పేరుతో కృష్ణాజిల్లాను బలి చేశారని టీడీపీ ఎమ్మెల్సీ వై. బాబు రాజేంద్రప్రసాద్ ఆందోళన చెందారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై టీడీపీ ఎంపీ కేశినేని నానితోపాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు

ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బద్దలు1 Y 97 days ago

 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. తన చిట్టచివరి టెస్ట్ మ్చాచ్ ఆడుతోన్న కివీస్ విధ్వంసకారుడు మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డులను తిరగరాశాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో బ్రెండన్ ఈ ఘనత సాధించాడు.
మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లంచ్ విరామంకంటే ముందే న్యూజిలాండ్ స్కోరు 32/3. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన మెకల్లమ్.. కంగారూలపై వీరప్రతాపం చూపాడు. ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే 21 పరుగులు పిండుకుని షాన్ మార్ష్ కు చుక్కలుచూపాడు. మెకల్లం 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అంపైర్ లంచ్ విరామం ప్రకటించాడు. ఆట మళ్లీ మొదలయిన తర్వాత చూడాలీ.. బ్రెండన్ బాదుడే బాదుడు! సరిగ్గా 54 పరుగుల వద్ద 100 పరుగులు పూర్తిచేసుకున్న మెకల్లం.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ధీరుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.

బైక్ రేసింగ్ పోలీసుల అదుపులో యువకులు1 Y 97 days ago

మేడ్చల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఆ క్రమంలో యువకులకు.... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్థరాత్రుళ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరసనలు1 Y 97 days ago

దళితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంలో 13 జిల్లాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

.

పేరెంట్స్ కాదు... ఫ్రెండ్స్ అనిపించుకోండి1 Y 97 days ago

పిల్లలు చెడు తోవ పట్టడానికి మూలం టీనేజేనంటారు మానసిక శాస్త్రవేత్తలు. అందుకే పిల్లలు తప్పు దారి పట్టి పాడయిపోయారని బాధపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

అర్థం చేసుకోండి: ఎప్పటిలా కాకుండా మీ పిల్లలు వింతగా ప్రవర్తిస్తే, దానికి గల కారణాలపై దృష్టి పెట్టండి. వారు అలా ఉండటానికి కారణం తెలుసుకోండి. దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని జీవితంలో వారు సాధించాల్సిన విజయాలను, చేరాల్సిన గమ్యాలను గుర్తు చేయండి. తప్పొప్పులపై వారికి ఓ క్లారిటీ ఇవ్వండి.

సీరియస్‌గా తీసుకోకండి: పిల్లలు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతుంటారు. వాదనకు దిగుతుంటారు. తమ ఫ్రెండ్స్ పేరంట్స్‌లా మీరు తమని ప్రేమించట్లేదని, అడిగింది ఇవ్వడం లేదని సాధిస్తుంటారు. వారిపై సీరియస్ అవకండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

బిజినెస్ లో పోటి పడుతున్న మహేష్,పవన్1 Y 97 days ago

ఏప్రిల్ నెల మూవీస్ పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా హాట్ హాట్ గానే మారనుంది. టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల మూవీస్ ఇదే నెలలో రిలీజ్ ప్లాన్ చేసుకుంటుడగా,ఆ మూవీస్ బిజినెస్ లోను పోటీ పడుతున్నాయి. దాదాపు కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగగా, లెక్కల్లో మాంఛి కాంపిటీషనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఏప్రిల్ లో పవన్, మహేష్ లు ప్రిస్టేజియస్ గా చేస్తున్న రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ 8న రిలీజ్ అవుతున్నట్టు డేట్ డిక్లేర్ అయింది. ఇక ప్రిన్స్ మహేష్‌ బాబు చేస్తున్న బ్రహ్మోత్సవం 28న రిలీజ్ అవుతున్నట్టు టాక్. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో 11 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇక నైజాంలో 20 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. అలాగే సీడెడ్ లో 11 కోట్లు, విశాఖలో 7.2 కోట్లు, తూర్పు గోదావరిలో 5.4 కోట్ల బిజినెస్ అయినట్టు సమాచారం.


Copyrights © 2014 6tvlive.com