6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

నగర ట్రాఫిక్‌ పోలీసులకు ఎక్స్‌ప్రెస్‌ టెక్నాలజీ అవార్డు 1 Y 94 days ago

కేరళ రాష్ట్రం కొచ్చిలో ఈనెల 18 నుంచి 21 వరకు ఇండియన ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన ‘‘ఎక్స్‌ప్రెస్‌ టెక్నాలజీ సభ’’ అవార్డును నగర ట్రాఫిక్‌ పోలీసులకు అందజేశారు. ప్రభుత్వ విభాగాల్లో అత్యంత వినూత్నంగా, దేశంలో ప్రథమంగా ట్రాఫిక్‌ విభాగంలోని అధికారులకు బాడీవోర్నొ కెమరాలు అందించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కెమరాలు ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావారణాన్ని తీసుకొచ్చిందని గుర్తించారు. ఈ అవార్డును నగర ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌, ఇనస్పెక్టర్‌ ప్రతాప్‌కు అందించారు.

అంధుల అభివృద్ధికి నూతన టెక్నాలజీ దోహదం 1 Y 94 days ago

 అంధవిద్యార్థుల అభివృద్ధికి నూతన టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ రాష్ట్ర కో-ఫౌండర్‌, చీఫ్‌ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రతీక్‌గద్దె అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్సిటీ సీవీరామన్‌ ఆడిటోరియంలో అంధుల కోసం నూతన టెక్నాలజీ అనే అంశంపై ఎంపవర్డ్‌ కమిటీ ఫర్‌ డిఫ్‌రెంట్లీ అబ్‌లీడ్‌పర్సన్స్‌ (ఈసీడీఎపీ) కమిటీ ఆధ్వర్యంలో వర్క్‌షాపు జరిగింది. కార్యక్రమానికి డాక్టర్‌ రాజగోపాల్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ ప్రతీక్‌ మాట్లాడుతూ అంధుల అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నా మన్నారు. వర్క్‌షాపులో డీఎస్‌డబ్ల్యూ ప్రకాష్‌బాబు, ఫ్యాకల్టీ సభ్యులు అన్నవరం, ఆంజనేయులు, సాయిప్రసాద్‌, డా.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

కడప పెద్ద దర్గాను దర్శించుకున్న ఏఆర్‌ రెహమాన్‌1 Y 94 days ago

కడపలోని పెద్ద దర్గాను సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్గాలో ఏఆర్ రహమాన్ ప్రార్థనలు చేశారు. రహమాన్ ను చూసేందుకు జనం  ఎగబడ్డారు. 

రేపటి నుంచే ఆసియా కప్‌...27న ఇండో-పాక్‌ మ్యాచ్‌1 Y 94 days ago

 క్రికెటాభిమానులను అలరించేందుకు ఆసియాకప్‌ ముస్తాబైంది. టీ-20 వరల్డ్‌కప్ నకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దానికి సన్నాహకం అన్నట్టుగా ధనాధన్‌ షాట్లతో ఉర్రూతలూగించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. 1984లో వన్డే ఫార్మాట్‌గా మొదలై రెండేళ్లకోసారి ఆసియాతోపాటు యావత ప్రపంచానికి వినోదాన్ని పంచుతున్న ఈ మెగా టోర్నీ తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో గిలిగింతలు పెట్టనుంది. బంగ్లాదేశ్‌ వేదికగా జరిగే ఈ టోర్నీ విశేషాలపై ఓ లుక్కేద్దామా..!  క్రికెట్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదు దేశాలు.. 12 రోజులపాటు.. టైటిల్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బుధవారం మొదలయ్యే ఆసి యా కప్‌లో టైటిల్‌ కోసం అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారిగా టీ-20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ ఆసియా కప్‌లో ఐదుసార్లు చాంపియన్‌ భారత మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, పాకిస్థాన్‌ గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తు న్న బంగ్లాదేశ్‌తోపాటు యుఏఈ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌, భారత జట్ల మధ్య బుధవారం జరిగే పోరుతో ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం కానుంది. అలాగే ఈ నెల 27న భారత, పాకిస్థాన్‌ మధ్య జరిగే దాయాదుల సమరం కూడా ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ కానుంది. 

ఫీజులు చెల్లించలేక కన్నబిడ్డలను కడతేర్చిన కసాయి 1 Y 94 days ago

 ఓ కసాయి తండ్రి స్కూల్‌ ఫీజులు చెల్లించలేక కన్నబిడ్డలను దారుణంగా హత్య చేశాడు. బెంగళూరులోని కేపీ అగ్రహార భువనేశ్వరీనగర్‌ బెట్టమ్మ సర్కిల్‌లో నివసించే శివకుమార్‌ గత శనివారం ఇరువురు పిల్లలను చిరుతిళ్లు కొనిస్తానని తీసుకెళ్లి చాకుతో గొంతు కోసి పవన్(9), సించన(8)లను దారుణంగా హత్యచేశాడు. సంచిలో మూటగట్టి కాలువలో పడేసి అక్కడ నుంచి మలైమహదేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఇంతో భార్య వసంత అలియాస్‌ తాయమ్మ ఫోన చేసి పిల్లలు ఇంటికి రాలేదని చెప్పింది. పిల్లలతో ఆలయానికి వచ్చానని, వారు కనిపించకుండాపోవటంతో, వెతుకుతున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత రెండు రోజులకు వచ్చిన శివకుమార్‌ పిల్లలు తప్పిపోయారని కప్పిపుచ్చాడు. వసంత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెల్లడించాడు.

నార్కట్‌పల్లి ఓసీటీఎల్‌లో కార్యకలాపాలు నిలిపివేత1 Y 94 days ago

 నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివార్లలోని యూనిట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆయిల్‌ కంట్రీ ట్యూబులర్‌ (ఓసీటీఎల్‌) ప్రకటించింది. సోమవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 18న (గురువారం) కొంత మంది కార్మికులు సీనియర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (కార్యకలాపాలు) మస్తాన్‌రావుపై ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఆయన మృతి చెందారు. యూనిట్‌లో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారుల ప్రాణ రక్షణ దృష్ట్యా కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు బీఎస్‌ఈకి కంపెనీ సమాచారం పంపింది. వెంటనే కార్యకలాపాలను నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని వివరించింది. టూల్‌ యంత్రాన్ని పగలగొట్టడంతో ఒక మెషిన్‌ ఆపరేటర్‌కు 17న నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత రోజు ఆ మెషిన్‌ ఆపరేటరు, మరి కొంత మంది కార్మికులు ఉద్దేశ పూర్వకంగా ఉన్నత స్థాయి అధికారులతో వివాదానికి దిగి మస్తాన్‌రావుపై దాడి చేశారని కంపెనీ పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని, కంపెనీ ఆస్తులు, ఉన్నతాధికారుల భద్రతకు, శాంతి, భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఓసీటీఎల్‌ పేర్కొంది.

క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చిన్నారులు సురక్షితం1 Y 94 days ago

సరైన సమయంలో గుర్తిస్తే.. చిన్నారుల్లో 75-90 శాతం క్యాన్సర్‌ కేసుల్ని విజయవంతంగా నయం చేయవచ్చని ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు. అవగాహన లేకపోవడం, వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మనుగడ రేటు తగ్గిపోతోందని వివరించారు. చాలా సందర్భాల్లో లక్షణాల్ని గుర్తించడంలో విఫలమవుతుండటం వల్ల క్యాన్సర్‌ను చివరి దశల్లో గుర్తిస్తున్నట్లు ఎయిమ్స్‌ శిశువైద్య నిపుణులు డా॥రచనాసేథ్‌ పేర్కొన్నారు. క్యాన్సర్‌ చిన్న వయసులో కూడా వస్తుందనీ, ప్రారంభ దశలోనే గుర్తిస్తే తీవ్రత ముప్పును పరిహరించవచ్చనే సంగతిని అందరూ గుర్తించాలన్నారు. ఎయిమ్స్‌లో ఏటా 300 నుంచి 350 మందిదాకా చిన్నారులు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు వివరించారు. తీవ్రమైన జ్వరం, బరువు తగ్గిపోవడం, శరీరంలో ఏదైనా భాగంలో కణతి, ఒంట్లో ఏదో ఒక రకమైన నొప్పి వంటి వాటిని క్యాన్సర్‌ లక్షణాలుగా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 

ధోనికి గాయం.. కీపర్‌ పార్థీవ్‌కు పిలుపు 1 Y 94 days ago

ఆసియా కప్‌ ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సోమవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ పార్థీవ్‌ పటేల్‌ను సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. 30 ఏళ్ల పార్థీవ్‌ పటేల్‌ తాజాగా జరిగిన దేశవాళి టోర్నీల్లో శతకాలతో రాణించాడు. 2012లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పార్థీవ్‌ పటేల్‌ భారత్‌ జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే చెప్పాడు. 

24న అట్లాంటాలో భారత రాయబారితో ఎన్నారైల భేటీ1 Y 95 days ago

అమెరికాలో భారత రాయబారి అరుణ్‌కుమార్‌సింగ్‌తో 24న అట్లాంటాలో తెలుగు సంఘాల నాయకులు భేటీ అవుతున్నారు. ఉన్నతవిద్య కోసం అమెరికా వెళుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల అనేక ఇబ్బందులు పడుతున్నారని,వీటిని దృష్టిలో ఉంచుకొని అరుణ్‌ కుమార్‌ సిం గ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తానా నేతలు ఆదివారం ఫోన్‌లో తెలిపారు.

సమ్మె సైరన్ మోగించనున్న ప్రిన్స్ విలియమ్స్ సిబ్బంది1 Y 95 days ago

ప్రిన్స్ విలియమ్స్‌కు చెందిన రాజ ప్రాసాదం కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో సేవలందిస్తున్న సిబ్బంది సమ్మె చేయబోతున్నారట! వేతనాల్లో 3,000 పౌండ్ల కోత విధించడంపై నిరసన వ్యక్తం చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరికి పని గంటలను తగ్గించాలని అధికారులు నిర్ణయించడంతో వార్షికాదాయం తగ్గుతుంది. వీరు రాజ ప్రాసాదంలో ప్రదర్శించే వస్తువుల సంరక్షణ, సందర్శకులకు సాయపడటం వంటి విదులను నిర్వహిస్తూ ఉంటారు. 

కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి బస్వరాజు సారయ్య?1 Y 95 days ago

 గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్‌ ఇవ్వబోతున్నాడు బస్వరాజు సారయ్య. ఆయన నేడో, రేపో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలతో సారయ్య సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. గ్రేటర్ ఎన్నికల ముందే ఇలా జరుగుతుండటంతో కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్ష ఫీజుకు నేడు తుదిగడువు 1 Y 95 days ago

 ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షఫీజు ప్రతీ సబ్జెక్ట్‌కు రూ.50 అపరాధ రుసుంతో సోమవారంతో గడువు ముగియనుందని ధర్మసాగర్‌ ఓపెన్ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మెండు ఉమామహేశ్వర్‌, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ తుమ్మలపల్లి యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న వారు గతంలో ప్రవేశం పొంది పరీక్ష రాయని వారు, ఫెయిల్‌ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 

ప్రేమ వేధింపులకు టెన్త్ విద్యార్థిని బలి1 Y 95 days ago

 జిల్లాలోని వేములపల్లి మండలం శెట్టిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులు తాళలేక టెన్త్‌ విద్యార్థిని భార్గవి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భార్గవి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు

ప్రాణాలు కూడా కాపాడతామంటున్న ఫేస్‌బుక్1 Y 95 days ago

ఒక మనిషి ఆలోచనలను తన మాటల ద్వారా, చేతల ద్వారా తెలుసుకోవచ్చంటుంటారు. ఓ వ్యక్తి ఆనందంగా ఉన్నాడా.. బాధలో ఉన్నాడా.. తీవ్రమైన నిరాశలో ఉన్నాడా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ సూత్రాలను ఉపయోగించే వేలాది ప్రాణాలను కాపాడే పనిలో పడిందీ ఫేస్‌బుక్ యాజమాన్యం. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని పోస్టింగ్స్ ద్వారా గుర్తించి వారికి కౌన్సిలింగ్‌తోపాటు సహాయాన్ని కూడా అందించేందుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ తరహా ప్రయత్నం చేస్తున్న ఫేస్‌బుక్.. ఇప్పుడు బ్రిటన్‌లోనూ బాధాతప్త హృదయులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోస్టింగ్స్‌ను ఆధారం చేసుకుని వ్యక్తి ఆలోచనలను కనిపెట్టే టూల్‌ను ఒకదాన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేస్తారు. దీన్ని మానిటర్ చేయడానికి ప్రత్యేకమైన బృందం ఉంటుంది. బాగా డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి తారసపడినట్లయితే వెంటనే ఫేస్‌బుక్ బృందానికి మెసేజ్ వెళ్తుంది. ఈ బృందం 24గంటలపాటూ పనిచేస్తూనే ఉంటుంది. వీలునుబట్టి ఆ వ్యక్తిని నేరుగా కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 

అసలు ఇదంతా సాధ్యమవుతుందా....1 Y 95 days ago

భూగోళం.. పో పొమ్మంటుంటే.. సాగరం రా రమ్మని పిలుస్తున్నది. అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకుందీ సముద్రం. ఆ సముద్రాన్ని జయించాలని మనిషి ఎప్పటినుంచో తపన పడుతున్నాడు. సాగరం లోతుల్లో ఆవాసాలు ఏర్పరుచుకోవాలని ఆశ పడుతున్నాడు. ఇంతకీ ఈ కల సాకారం అయ్యేనా.. పరిస్థితులు ఏం చెబుతున్నాయి.  అసలు ఇదంతా సాధ్యమవుతుందా....

డీఎస్సీ-98, 2008 క్వాలిఫైడ్‌లకు అవకాశం!1 Y 95 days ago

 డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఈ రెండు డీఎస్సీల క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు అందించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కమిషనర్ నివేదిక సమర్పించారు. సోమవారం విద్యాశాఖ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి నియామకాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖవర్గాలు వివరించాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ సమస్యను కూడా చర్చించనున్నారు.

బంగారం పెరిగితే.. అమ్మండి!1 Y 95 days ago

వరుసగా ఏడో వారమూ పసిడి కాంట్రాక్టు కళకళలాడింది. సోమవారం రూ.29,302 వద్ద ప్రారంభమైన బంగారం ఏప్రిల్‌ కాంట్రాక్టు తొలుత రూ.28,245 వరకు దిద్దుబాటుకు లోనయ్యింది. అనంతరం గణనీయంగా పుంజుకుని రూ.29,638 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. చివరకు 0.68% లాభంతో రూ.29,500 వద్ద ముగిసింది. ఈవారం కూడా కొంత ఒడుదొడుకులకు ఆస్కారం ఉంది. కాంట్రాక్టుకు ఇప్పటికే స్థాయికి మించి కొనుగోళ్ల మద్దతు లభించినందున.. పెరిగినప్పుడల్లా అమ్మే వ్యూహంతో ముందుకెళ్లడం మంచిది. వెండి మే ఫ్యూచర్‌ కాంట్రాక్టు రూ.38,001 వద్ద మొదలైంది. ఆ తర్వాత రూ.37,250- 38,213 మధ్య కదలాడింది. ఆఖరుకు 0.18% నష్టపోయి రూ.37,932 వద్ద స్థిరపడింది. ఈవారం రూ.38,761కు దిగువన పెరిగినప్పుడల్లా కాంట్రాక్టును విక్రయించొచ్చు. సాంకేతికంగా అధిక స్థాయిలను నిలబెట్టుకోవడంలో కాంట్రాక్టు విఫలమైనందున అమ్మడమే మంచిది.

మాజీ ఎమ్మెల్యే కాంతారావు ఆమరణ నిరాహారదీక్ష1 Y 95 days ago

 ఖమ్మం జిల్లా మణుగూరు మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సింగరేణి గిరిజన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఆయన దీక్షకు కూర్చున్నారు. గిరిజన నిర్వాసితులకు ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని కాంతారావు డిమాండ్‌ చేశారు.

పూరీ గర్భగుడిలో ఎనిమిది స్తంభాలకు పగుళ్లు1 Y 95 days ago

 పూరీ జగన్నాథ ఆలయంలో గర్భగుడి మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గర్భగుడిలో గోడలకు ఉన్న సున్నాన్ని తొలగించగా 8 ప్రధాన స్తంభాల్లో పగుళ్లు కనిపించాయి. దీంతో గర్భగుడి ప్రమాదంలో ఉందని ఆలయ పాలనా కమిటీ ప్రధాన అధికారి సురేష్‌ మహాపాత్రో తెలిపారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్తంభాల్లో పగుళ్లు ఏర్పడడం వల్ల గర్భగుడి పైకప్పునకు ప్రమాదం పొంచిఉందని తెలిపారు.

కస్తూర్బా గాంధీ పాఠశాలలో అగ్నిప్రమాదం1 Y 95 days ago

 ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యూ) మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వంటశాల పూర్తిగా కాలిపోవడంతో పాటు విద్యార్థులు పడుకునే చోటుకు మంటలు వ్యాపించాయి. విద్యార్థుల కేకలు వేయడంతో గ్రామస్థులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. 


Copyrights © 2014 6tvlive.com