6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

బెదిరింపు కాలర్స్ కు కౌంటర్ ఇచ్చిన వర్మ1 Y 93 days ago

నేను మీ ఏరియాకి వస్తున్నా, దమ్ముంటే రండి నేను వచ్చే ఫ్లైట్ నంబర్,నేనుండే హోటల్ మీకు చెబుతున్న. అదే దమ్ము మీకుంటే నేనుండే ఏరియాకు రండి. వింటుంటే ఇదేదో సినిమా డైలాగులా వుంది కదు. కాని ఇవి డైలాగులు కావు. రాంగోపాల్ వర్మ వంగవీటి రంగ సినిమా విషయంలో ఆయనకు వస్తున్న బెదిరింపు కాల్స్ కి కౌంటర్ గా ఇచ్చిన డైలాగులివి. రాంగోపాల్ వర్మ 26న విజయవాడ వెళుతున్నాడు.ఈ విషయమై తనకు వార్నింగ్ లు ఇచ్చిన వారికి కౌంటర్ వేసాడు.తను వచ్చే ఫ్లైట్ నంబర్,తను స్టే చేసే హోటల్ పేరు టైమింగ్స్ తో సహా తన షెడ్యూల్ ని ట్వీట్ చేసి దమ్ముంటే రండని సవాల్ విసిరాడు.నేను విజయవాడ వస్తున్నాను మీకు దమ్ముంటే ముంబై రండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వర్మ తనకు వార్నింగ్ ఇచ్చినవారినిఆకురౌడీలుగాచెప్పుకొచ్చాడు.రౌడీలనుకునే ఆకురౌడీలు గుర్తుంచుకోవాల్సింది ఆనాడు రౌడీలుగా వున్న అసలు సిసలైన రౌడీలతో నేను తిరిగాను. నేను అసలు సిసలైన రౌడీనే అని చెప్పుకొచ్చాడు.ఆకు రౌడీలకు బయపడేది లేదని తేల్చిచెప్పాడు.

ఆసీస్ దేశవాళీలో భారత సంతతి క్రికెటర్1 Y 93 days ago

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో భారత సంతతి క్రికెటర్ ఆడబోతున్నాడు. కాన్‌బెర్రాలో భారతీయ దంపతుల కుమారుడు 17 ఏండ్ల ఆఫ్‌స్పిన్నర్ అర్జున్ నాయర్.. న్యూసౌత్‌వేల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో మొదలయ్యే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌత్‌వేల్స్ తరుఫున అర్జున్ బరిలోకి దిగుతున్నాడు

ముస్తాఫిజుర్‌పై మీ వ్యూహాలు చెల్లవ్1 Y 93 days ago

ఎలాంటి బ్యాట్స్‌మన్ అయినా తమ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌తో బలాదూరేనని అంటున్నాడు బంగ్లా కెప్టెన్ మోర్తజా. ఆసియా కప్‌లో పర్యాటక బ్యాట్స్‌మెన్ ఎంత హోంవర్క్ చేసి వచ్చినా, ముస్తాఫిజుర్‌కు తలొగ్గక తప్పదని హెచ్చరిస్తున్నాడు. ప్రపంచంలోనే భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టమైనదని, అయితే ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వారికి నిరాశ తప్పదన్నాడు. ముస్తాఫిజుర్ స్లో బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. బంతిని ఎక్కడ వేయాలన్నదానిపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటా డు. అతను ప్రత్యర్థిని పట్టించుకోడు. తన బలంపైనే పూర్తి శ్రద్ధ పెడతాడు అని మోర్తజా అన్నాడు.

రాజ్యసభను కుదిపేసిన రోహిత్ ఆత్మహత్య1 Y 93 days ago

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. ఈరోజు రాజ్యసభ ప్రారంభం కాగానే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ అంశాన్ని లేవనెత్తారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని ఆమె అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థులను అణచివేస్తున్నారని మాయావతి ఆరోపించారు. సెంట్రల్ వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. దళిత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం సమాధానం చెప్పాలని ఆమె పట్టుబట్టారు. దీనిపై కొంతసేపు సభలో గందరగోళం జరిగింది. తర్వాత అధికార పక్షం కూడా చర్చకు తాము తక్షణం సిద్ధమని చెప్పడంతో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చర్చకు అనుమతించారు. కానీ, మాయావతి మాత్రం చర్చ విషయాన్ని పట్టించుకోకుండా.. ప్రభుత్వం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వదని అడిగారు. చర్చ జరిగితే.. ఆ తర్వాత ప్రభుత్వం దానికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందేనని కురియన్ చెప్పినా.. మాయావతి, ఆమె పార్టీ సభ్యులు వినిపించుకోలేదు. 

స్పైస్‌జెట్‌ ప్రీ సమ్మర్‌ సేల్‌ ఆఫర్‌1 Y 93 days ago

 లోకాస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్‌.. 599 రూపాయల ప్రారంభ ధరతో ప్రీ సమ్మర్‌ సేల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ నెట్‌వర్క్‌లో అన్ని నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసుల్లో ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ బేస్‌ ధర 599 రూపాయలతో ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ నెల 23 నుంచి 25 వ తేదీ వరకు ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని స్పైస్‌జెట్‌ పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులు మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. స్పైస్‌జెట్‌ వెబ్‌సైట్‌ లేదా ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్స్‌, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా ఈ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా పరిమితి సంఖ్యలో సీట్లను అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఆ సీరియల్ కిల్లర్ బుక్‌ను తొలగించిన అమెజాన్1 Y 93 days ago

కెనడియన్ సీరియల్ కిల్లర్ రాసిన ఓ పుస్తకం అమ్మకాలను ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నిలిపివేసింది. అంతేకాక తన వెబ్‌సైట్ నుంచి ఆ పుస్తకాన్ని తొలగించింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన అవుట్‌స్కర్ట్స్ ప్రెస్ పుస్తకాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించాల్సిందిగా సోమవారం అమెజాన్‌ను కోరింది. అంతేకాక బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. రాబర్ట్ పిక్టన్ 2007లో ఓ సెక్స్ వర్కర్‌ను తన పిగ్‌ఫామ్‌లో హత్యచేసి శరీర భాగాలను పందులకు ఆహారంగా వేశాడు. ఈ కేసులో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జైలులో ఉన్న పిక్టన్ ‘‘పిక్టన్: ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్’’ పేరుతో 144 పేజీలున్న ఓ పుస్తకాన్ని రాశాడు. దీనిని అవుట్‌స్కర్ట్స్ ప్రెస్ ప్రచురించింది. దీనిపై సీరియల్ కిల్లర్ బుక్‌ను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టడంపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించాలంటూ ప్రచురణ సంస్థ అమెజాన్‌ను కోరింది. దీంతో సోమవారం ఆ పుస్తకం వెబ్‌సైట్ నుంచి మాయమైంది

‘భారత బేటీల’కు సూరత్ వ్యాపారి 200 కోట్ల విరాళం1 Y 93 days ago

ఆయన హృదయం భారతదేశమంత విశాలమైనది. ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ అక్షరాలతో కుట్టిన అత్యంత ఖరీదైన కోటును ప్రతిష్ఠాత్మక వేలంలో రూ. 4.31 కోట్లకు చేజిక్కించుకున్న గుజరాతలోని సూరత వజ్రాల వ్యాపారి లవ్‌జీభాయ్‌ బాద్షా మోదీ ఆశయాన్ని అమల్లోకి పెట్టేందుకు భూరివిరాళం అందించబోతున్నారు. ప్రధాని కలల ప్రాజెక్టు అయిన ‘బేటీ బచావో...బేటీ పఢావో’ కార్యక్రమానికి ఆయన రూ.200 కోట్ల విరాళం ఇవ్వబోతున్నారు. బృందావన్‌లోని వాత్సల్య గ్రామ్‌ను మంగళవారం సందర్శించిన సందర్భంగా ఆయనీ సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 10 వేలమంది బాలికలకు వారి చదువుసంధ్యలు,పెళ్లిళ్లకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఒక్కొక్కరికీ రూ. రెండు లక్షల చొప్పున వారి తల్లిదండ్రులకు ఇస్తానని బాద్షా తెలిపారు

ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో విగ్రహాల ప్రతిష్ఠాపన1 Y 93 days ago

ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో బుధవారం  స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, మురళీమోహన్‌లు పాల్గొన్నారు. 

నేపాల్‌లో విమానం అదృశ్యం1 Y 93 days ago

నేపాల్‌లో విమానం అదృశ్యం అయింది. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విషయం తెలుసుకున్న నేపాల్ పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాన్ని కనుగొనేందుకు పోలీసులు నూతన టెక్నాలజీని  ఉపయోగిస్తున్నారు.

‘భగీరథ’, ‘కాకతీయ’కు రూ.450 కోట్ల కేంద్ర నిధులు1 Y 93 days ago

తెలంగాణ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక అభివృద్ధికి కేంద్రం రూ.450కోట్లు విడుదల చేసింది. ఇటీవల రాష్ట్రానికి అభివృద్ధి ప్రత్యేక నిధులు రూ.31వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందులో వెనుకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, ఖమ్మం, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులను ప్రత్యేకంగా ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో రూ.700కోట్లను అందచేయడానికి నిర్ణయించిన కేంద్రం రూ.450కోట్లను విడుదల చేసింది.

1124 డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీ! 1 Y 93 days ago

డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణలో 130 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా వాటిలో 2008 తర్వాత ఏర్పాటైనవే 60 వరకు ఉన్నాయి. వాటిల్లో గరిష్ఠ సంఖ్యలో ఒప్పంద అధ్యాపకులే పనిచేస్తున్నారు. న్యాక్‌ గ్రేడ్‌ సాధించాలన్నా శాశ్వత అధ్యాపకులు ఉండటం తప్పనిసరి. ఈక్రమంలో 1124 పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ కళాశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దస్త్రాన్ని(ఫైలు) ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు.

‘స్వచ్ఛ’ పోటీలో జంట జిల్లాలు1 Y 93 days ago

 పరిపాలనలో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రతి ఏడాది ప్రదానం చేసే ప్రధానమంత్రి అవార్డులకు తెలంగాణ రాష్ట్రం నుంచి జంట జిల్లాలైన రంగారెడ్డి, హైదరాబాద్‌లు పోటీ పడుతున్నాయి. జనధన్‌ యోజనలో భాగంగా బ్యాంకుల్లో శూన్యఖాతాలు తెరిపించడం, రూపీకార్డుల పంపిణీ, ప్రమాద బీమాను సమర్థంగా అమలు చేయడం, అందరికీ ఆధార్‌ కార్డులు అందేలా చూడటంలో ఈ రెండు జిల్లాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలు సైతం ఈ పథకం అమలులో ప్రత్యేకత చాటాయని, విజేతను ఎంపిక చేయడంలో భాగంగా తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు తాజాగా సమగ్ర వివరాలను పంపించాలంటూ మంగళవారం లేఖలు పంపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు పథకాన్ని విజయవంతం చేయడానికి ఎలా కృషి చేశామో కేంద్ర కమిటీ ఎదుట వివరించాల్సి ఉంటుంది. అక్కడ ఉత్తమంగా నిలిచిన జిల్లాకు అవార్డు ఇస్తారని లేఖలో ఉంది. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశంతో దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రతినిధులు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ నిర్మాణం, నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఎంసెట్‌ ద్వారా బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలు 1 Y 93 days ago

తెలంగాణ ఎంసెట్‌ ద్వారా బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలు చేపట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. నాలుగేళ్ల కోర్సులో తొలుత 50మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచి హైదరాబాద్‌ శివారు దూలపల్లిలోని అటవీఅకాడమీలో తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెదక్‌ జిల్లా ములుగులో తెలంగాణ అటవీకళాశాల ఏర్పాటుకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈకళాశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఫారెస్ట్రీకోర్సును ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, తెలంగాణ ఉన్నత విద్యామండలితో అటవీశాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. అర్హతపరీక్ష కసరత్తు తుదిదశకు చేరినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

పదేళ్లలో ఎన్నడూ లేనంత ఎండ 1 Y 93 days ago

 వేసవి ఇంకా పూర్తిగా రాకుండానే ఎండలు మాత్రం మండిపోతున్నాయి. గత పదేళ్లలో ఫిబ్రవరి నెలలో ఎన్నడూ లేనంత అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత మంగళవారం నిజామాబాద్‌లో 41.6 డిగ్రీలుగా నమోదైంది. గత పదేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు భద్రాచలంలో 2009 ఫిబ్రవరి 28న 41.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ రికార్డును మంగళవారం నిజామాబాద్‌లో భానుడు సమం చేశాడు. దక్షిణ తెలంగాణ ఎండల వేడితో ఉడుకుతోంది. గత పదేళ్లలో ఫిబ్రవరి నెలలో ఎన్నడూ లేనిస్థాయిలో ఈసారి పలు పట్టణాల్లో అత్యధిక ఉష్ణోగ్రత ఇప్పటికే నమోదైంది. ఈ ఎండల ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదాహరణకు ఫిబ్రవరిలో గత పదేళ్లలో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత భద్రాచలంలో 2009 ఫిబ్రవరి 28న, అదేఏడాది అదేనెల 26న మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీలు నమోదైంది. కానీ ఈఏడాది ఈ నెలలో ఇప్పటికే పలు పట్టణాల్లో ఈ రికార్డు పటాపంచలైంది

సీఆర్‌పీఎఫ్‌లో182 పారా మెడికల్ పోస్టులు1 Y 94 days ago

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో నాన్‌గెజిటెడ్ పారామెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీల సంఖ్య - 182

సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్)-22 పోస్టులు (జనరల్-11,ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1, ఎక్స్ సర్వీస్‌మెన్-2)

అర్హత: ఇంటర్‌తోపాటు మూడున్నర ఏండ్ల జనరల్ నర్స్ అండ్ మిడ్ వైఫరీలో ఉత్తీర్ణత. సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (రేడియోగ్రాఫర్)-6 పోస్టులు (జనరల్-2,ఓబీసీ-3, ఎస్టీ-1)

అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్ ఉత్తీర్ణత. డిప్లొమా లేదా రెండేండ్ల రేడియో డయాగ్నసిస్ సర్టిఫికెట్ ఉండాలి. 

వయస్సు: 2016 మార్చి 23 నాటికి 30 ఏండ్లకు మించరాదు

పే స్కేల్: రూ.9,300-34,800+ గ్రేడ్ పే రూ.4,200/-

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మాసిస్ట్)-54 పోస్టులు (జనరల్-25, ఓబీసీ-12, ఎస్సీ-7, ఎస్టీ-4, ఎక్స్ సర్వీస్‌మెన్-6)

అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్‌లో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా రెండేండ్ల ఫార్మసీ లేదా ఫార్మసీలో డిగ్రీలో ఉత్తీర్ణత. సెంట్రల్ లేదా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో సభ్యత్యాన్ని కలిగి ఉండాలి. 

పాకైనా.. ఎవరైనా.. తేడా ఉండదు : కోహ్లీ1 Y 94 days ago

 ప్రత్యర్థి టీమ్ పాకిస్థాన్ అయినా మరే జట్టు అయినా తన ఆట తీరులో తేడా ఉండదని క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఢాకాలో బుధవారం నుంచి ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ టోర్నీలో భాగంగా ఈనెల 27న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మైదానంలోకి వెళ్లినప్పుడు క్రికెట్ ఆడేందుకు వెళ్తాం, ప్రతి జట్టును ఒకే రకంగా చూస్తామని కోహ్లీ అన్నాడు. పాకిస్థాన్ బలమైన జట్టు అని, ఆ టీమ్‌తో పోటీకి దిగినప్పుడు తన ఆట శైలిలో తేడా ఉండదన్నాడు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని నమ్మడం ముఖ్యమైందని, టోర్నీలో ఉత్తమ ఆటను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ1 Y 94 days ago

ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా కేంద్రానికి విన్నవించేందుకు రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డిలతో కలసి ఢిల్లీ వచ్చారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించేందుకు పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ వచ్చినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ కలవనున్నారని ఆయన వివరించారు. పది రోజుల క్రితమే అపాయింట్‌మెంట్ కోరామని, అపాయింట్‌మెంట్ ఖరారైతే  ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా మంగళవారం కలుస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ గడచిన ఏడాదిన్నరగా పోరాటం సాగిస్తోందని, ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుందని కొద్ది నెలల క్రితం కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ దిశగా నేటికీ సానుకూల ఫలితం కనిపించలేదన్నారు. 

మొబైల్ నుంచి ఐదు సెకన్లలో మూవీలు డౌన్లోడ్!1 Y 94 days ago

 మీ మొబైల్ నెట్వర్క్ నుంచి ఏదైనా సినిమాను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా?. మీరు వినియోగిస్తున్న నెట్వర్క్ చాలా నెమ్మదిగా ఉండి మీ సహనాన్ని పరిక్షిస్తుందా? అయితే ఇకపై అలా నిరీక్షించాల్సిన అవసరం లేదు.  మీ మొబైల్ నుంచి క్షణాల్లోనే సినిమాలను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది.  అదే 5జీ నెట్వర్క్.  ప్రపంచంలోనే అతి వేగవంతమైన 5జీ నెట్వర్క్ సేవలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. దక్షిణ లండన్లోని పట్టణ శివారు ప్రాంతంలో ఈ తరహా మొబైల్ నెట్వర్క్లకు రూపాంతరణ జరుగుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభించే మొబైల్ నెట్వర్క్ల కంటే ఈ నెట్వర్క్ 100 పాళ్లు వేగవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఇతర కంపెనీలు సహా సామ్సంగ్, ఫిజిస్తూ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు లండన్లోని ఓ యూనివర్సిటీలో సర్వే చేస్తున్నాయి.

మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్; ఓటమి దిశగా కివీస్1 Y 94 days ago

న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్టేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ పరాజయం దాదాపుగా ఖాయమైంది. 121/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన కివీస్ 335 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విలియమ్సన్(97) తృటిలో సెంచరీ కోల్పోయాడు. హెన్రీ(66) అర్ధ సెంచరీ సాధించాడు. ఆండర్సన్ 40, వాట్లింగ్ 46 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బర్డ్ 5, పాటిస్సన్ 4 వికెట్లు పడగొట్టారు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.

సీఎం సొంతూరైనా ఇసుక ఇచ్చేది లేదు! 1 Y 94 days ago

ది స్వయానా సీఎం ఫాంహౌస్‌ గ్రామం ఎర్రవెల్లి! అక్కడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఇసుక కోసం మెదక్‌ జిల్లాలోని నంగునూరు మండలం అక్కెనపల్లికి వచ్చారు రెవెన్యూ అధికారులు! కానీ, గ్రామస్థులు అడ్డుకున్నారు. ససేమిరా అన్నారు. ఎర్రవల్లికైనా.. సీఎం సొంతూరికైనా సరే ఇసుకను ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. రెండు రోజుల క్రితం అక్కడి పెద్దవాగుకు మూడు టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను తరలించిన మండల తహసీల్దార్‌ గులాం ఫరూక్‌ అలీ.. ఈ ఘటనతో అవాక్కయ్యారు. ఆర్డీవో ముత్యంరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన సోమవారం గ్రామస్థులను ఒప్పించే ప్రయత్నం చేసినా అదే మాట సూటిగా చెప్పారు. అయినా సరే తరలించాలనుకుంటే తమపై అదే వాహనాలను ఎక్కించి.. చంపి.. శవాలపై నుంచి తీసుకెళ్లాలని హెచ్చరించారు.


Copyrights © 2014 6tvlive.com