6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

అమెరికాలో కాల్పులు: నలుగురి మృతి1 Y 91 days ago

 అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలోని హెస్టాన్‌ ప్రాంతంలో గుర్తు తెలియని దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 30మంది గాయపడ్డారు. సమాచారమందుకున్న భద్రతా దళాలులు ఘటనస్థలికి చేరుకోగానే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పులకు తెగబడింది ఉగ్రవాదులా? కాదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో నక్సల్ ప్రభావం1 Y 92 days ago

 దేశవ్యాప్తంగా 106 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉన్నట్లుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా 8 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్నదని స్పష్టం చేసింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పార్తిభాయ్ చౌదరీ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బీహార్‌లో గరిష్టంగా 22 జిల్లాలు నక్సలైట్ల ప్రభావముందని, ఆ తర్వాత జార్ఖండ్‌లో 21 జిల్లాలు, ఒడిశాలో 19 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లో 16 జిల్లాల చొప్పున ఉన్నాయి.

2017-18లో 9 వేల ఉద్యోగాల కల్పన1 Y 92 days ago

రైల్వే వ్యవస్థలో 2017-18లో 9 వేల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. వచ్చే ఏడాది 2 వేల కిలోమీటర్ల రైల్వే మార్గాలను విద్యుదీకరిస్తామని చెప్పారు. రోజుకు 7 కి.మీ. రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రూపాయి ఖర్చుతో రూ. 5 వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ - చెన్నై, ఖరగ్‌పూర్ -ముంబై, ఖరగ్‌పూర్-విజయవాడ సరకు రవాణా మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. 7,517 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతంలో కనెక్టివిటీ విస్తరణ చేస్తామన్నారు. మిజోరం-మణిపూర్ రైల్వే లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మారుస్తామని వెల్లడించారు. భారత్‌లో తయారీలో భాగంగా కొత్త లోకో ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఆరేళ్లలో సగటున రోజుకు 4.3 కి.మీ. మేర బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మించామని తెలిపారు

సర్దార్ దూకుడు ముందు మిగిలింది మూడు నగరాలే ?1 Y 92 days ago

సర్దార్ గబ్బర్ సింగ్ బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిందనే వార్తలు వస్తుండగా, నెల్లూరు. చెన్నై, బెంగుళూరు సిటీల్లో మాత్రమే బిజినెస్ ఖాళీ ప్రాంతాలుగా మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. ఆలస్యం చేస్తే ఇవి కూడా ఉండవని డిస్ట్రి బ్యూటర్లను తొందరపెడుతున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూడు నగరాలు మాత్రమే ఓపెన్ గా ఉండగా, మిగతా అన్ని ఏరియాల బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిందట. సర్ధార్ బిజినెస్ రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో ఉంటే రానున్న రోజుల్లో ఈ చిత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మా చానల్స్ చూడండి.. నెలకు మూడు వేలిస్తాం !1 Y 92 days ago

‘మేమే కంప్యూటర్ ఇస్తాం.. ఇం టర్నెట్ కనెక్షన్ ఉంటే బిల్లు కూడా ఇస్తాం. అంతే కాదు.. నెలకు రూ.3,000 మీ అకౌంట్‌లో వేస్తాం.  మేము ఇచ్చిన కంప్యూటర్‌ను రోజుకు ఎనిమిది గంటలు ఆన్‌చేసి ఉంచాలి. ఇందుకోసం ఇప్పుడు 10 వేలు చెల్లించాలి.’ ఇదీ కోదాడలో నెల రోజు లుగా ఒక సంస్థ చేస్తున్న ప్రచారం. దీంతో వేలం వెర్రిగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉద్యోగులు ఎగబడుతున్నారు. కానీ, ఇందులో ఏదో తిరకాసు దాగుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమ వెబ్‌సైట్ కోసం ప్రచారం అని చెబుతుండడం గమనార్హం. కోదాడ, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్షిత క్రియేషన్స్ పేరుతో  వెబ్‌చానల్స్ నడుపుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. విద్యార్థులు, వ్యాపారులను మచ్చిక చేసుకుని రూ.10 వేలకు పాత కంప్యూటర్ అంటగడుతున్నారు. ప్రతినెలా నెట్ బిల్లు రూ.500 ఇస్తామని.. రోజు ఎనిమిది గంటలు కంప్యూటర్‌ను ఆన్ చేసి ఉంచితే ప్రతి నెలా రూ.3,000 అకౌంట్‌లో వేస్తామని ప్రచారం చేయడంతో ఒక్క కోదాడలోనే నెల రోజుల్లో 200 మంది రూ.10 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి పాత కంప్యూటర్లను తీసుకున్నారు. వాస్తవానికి ఒక్కో కంప్యూటర్ ఖరీదు రూ. 5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ఉంటుందని పాత కంప్యూటర్లను రెట్టింపు రేట్లతో అంటగడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పౌడర్‌తో కేన్సర్ వచ్చిందని.. రూ. 493 కోట్ల పరిహారం1 Y 92 days ago

జాన్సన్ అండ్ జాన్సన్  కంపెనీకి అతి పెద్ద షాక్ తగిలింది. ఈ కంపెనీ తయారుచేసిన బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్‌లను కొన్ని దశాబ్దాల పాటు వాడిన ఓ మహిళ అండాశయ ముఖద్వార కేన్సర్‌తో మరణించడంతో.. ఆమె కుటుంబానికి సుమారు రూ. 493 కోట్ల పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. మిస్సౌరీ రాష్ట్ర జ్యూరీలోని 60 మంది సభ్యులుగల సెయింట్ లూయిస్ సర్క్యూట్ కోర్ట్  ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జాకీ ఫాక్స్ (62) ఒవేరియన్ కాన్సర్‌తో 2013లో మరణించారు. దీంతో ఆమె కొడుకు మార్విన్ స్కాల్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ల టాల్కం పౌడర్‌ను దీర్ఘకాలం పాటు వాడడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. టాల్క్ బేస్‌డ్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించలేదని చెబుతున్నారు. ఇదే అంశంపై మిస్సోరి కోర్టులో వెయ్యి కేసులు, న్యూజెర్సీ కోర్టులో మరో 200 కేసులు కూడా నమోదయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మోసం చేసిందని, నిర్లక్ష్యం వహించిందని, కుట్రపూరితంగా వ్యవహరించిందని జ్యూరీ తేల్చినట్లు ఫాక్స్ కుటుంబ న్యాయవాదులు తెలిపారు

100 స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు1 Y 92 days ago

త్తగా మూడు రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2016 సంవత్సరానికి గాను లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ ప్రెస్ సర్వీసులను ఆయన ప్రకటించారు.  ఫుల్లీ ఎయిర్ కండీషన్డ్ థర్డ్ క్లాస్ బోగీలతో హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ఉంటుందని వెల్లడించారు. తేజస్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పారు. ఇందులో వై-ఫై, వినోదం సహా అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దీన్ దయాళ్ బోగీలు ప్రవేశపెడుతున్నట్టు  వీటిలో మంచినీళ్లు, చార్జింగ్ పాయింట్లు సహా అన్ని సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కల్పిస్తామని, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరిస్తామని హామీయిచ్చారు.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి ఇదే సరైన సమయం 1 Y 92 days ago

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి ఇదే సరైన సమయమని కివీస్‌ కెప్టెన బ్రెండన మెకల్లమ్‌ తెలిపాడు. ‘క్రికెట్‌ నుంచి ఇలా తప్పుకోవడం ఆదర్శనీయం మాత్రం కాదు. కానీ రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. చివరి టెస్ట్‌తో పాటు సిరీస్‌ ఓటమి తీవ్ర నిరుత్సాహం కలిగించింద’ని మెకల్లమ్‌ అన్నాడు. ఇక మ్యాచ ముగిశాక బ్రెండనను న్యూజిలాండ్‌ క్రికెట్‌ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మెకల్లమ్‌ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే అతను ఎక్కువగా భావోద్వేగానికి గురికాలేదు. బ్రెండన 101 టెస్ట్‌ల్లో 38.64 సగటుతో 6453 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సర్వేపల్లిలో తొలి రాష్ట్రపతి రాధాకృష్ణన్ విగ్రహావిష్కరణ1 Y 92 days ago

వెంకటాచలం మండలం సర్వేపల్లిలో తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సరళలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నందికొట్కూరు స్కూల్‌లో విద్యార్థులపై తేనెటీగల దాడి1 Y 92 days ago

 నందికొట్కూరులో కృష్ణవేణి స్కూల్‌లో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనతో 30 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడ్డారు. 

టార్గెట్‌ 100 రోజులు...రూ.3 కోట్లతో సంజీవయ్య పార్కు సుందరీకరణ 1 Y 92 days ago

 గ్రేటర్‌లో వంద రోజుల ప్రణాళిక లక్ష్యాల అమలు కోసం ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరు గులు పెడుతున్నాయి. ఇప్పటికే వంద రోజుల్లో పూర్తి చేసే అంశాలను ప్రభుత్వానికి సూచించిన శాఖలు వాటిని గడువులోగా పూర్తి చేయ డంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఈ ప్రణాళికను స్వయంగా రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ ఆర్‌ స్వయంగా పరిశీలిస్తుండడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కుంటున్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలకంగా ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలోని అర్బన్‌ ఫారెస్ర్టీ విభాగం మూడు అం శాలను వంద రోజుల్లో పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే తెలంగాణకు హరి తహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎంచుకున్న అంశాలు పచ్చదనానికి సంబంధించినవే కావడంతో అర్బన్‌ ఫారెస్ర్టీ విభాగం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిం చింది. నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ను అనుకొని సంజీ వయ్య పార్కులోని డంప్‌యార్డు, గాజుల రామారం డంపింగ్‌ యా ర్డులను సుందరీకరణ చేసి పచ్చని మొక్కలతో వాటిని రూపొందిం చాల్సి ఉంది. అదే విధంగా మే 31 నాటికి హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 55 మండలాలు, 850 గ్రామాలకు అవసరమైన 50 లక్షల మొక్క లను పెంచి పంపిణీకి సిద్ధంగా ఉంచాల్సి ఉందని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ర్టీ విభాగం సంచాలకులు స్వర్గం శ్రీనివాస్‌ తెలిపారు.

ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో మాక్‌టెస్ట్‌1 Y 92 days ago

 తెలంగాణ ప్రభుత్వం విడుదలచేసిన ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్లకు మాక్‌ టెస్ట్‌ (నమూనా పరీక్ష)ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు మనబడి డాట్‌కామ్‌ సీఈవో కిరణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రూపావళిలో 60 గ్రాండ్‌ టెస్ట్‌ల్లో ఏర్పాటుచేశామని గ్రూప్‌-2 సిలబస్‌ మొత్తం కవరవుతుందని తెలిపారు. పరీక్షల్లో రాయలనుకునేవారు మొబైల్‌, పీసీ, టాబ్‌, లాప్‌టాప్‌ల ద్వారా మనబడి డాట్‌కామ్‌కు లాగిన్‌ కావాలన్నారు.

విడుదలైన కొద్దిసేపటికే సంజయ్‌పై హైకోర్టులో పిటిషన్1 Y 92 days ago

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విడుదలపై ముంబై హైర్టులో పిటిషన్ దాఖలైంది. 42 నెలలపాటు జైలు జీవితం గురువారం ఉదయం సంజయ్ బయటికొచ్చారు. పుణెలోని ఎరవాడ జైలు నుంచి బయటికొస్తూ.. జైలు వైపు తిరిగి మళ్లీ తాను ఇక్కడకు రాననిచెప్పి సెల్యూట్ చేశారు. అయితే సంజయ్ బయటికొచ్చిన కొద్దిసేపటికే అతడిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మహారాష్ట్ర సామాజిక ఉద్యమాకారుడు ప్రదీప్ బలేకర్ మున్నాభాయ్ విడుదలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో చాలామంది పేద నేరస్థులు ఏళ్లతరబడి సత్ప్రవర్తనతో నడుచుకుంటున్నారని, శిక్ష కాలం పూర్తయినా కొంతమందిని జైలు నుంచి విడుదల చేయడం లేదని, కేవలం వీఐపీ అన్న కారణంగానే సంజయ్ దత్‌కు మర్యాదలు చేసి మరీ విడిచిపెట్టారని ప్రదీప్ బలేకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

మార్చి 1 నుంచి సీబీఎస్‌ఈ ఇంటర్‌ పరీక్షలు1 Y 92 days ago

సీబీఎస్‌ఈ ఇంటర్‌ (మాధ్యమిక విద్య- 12వ తరగతి) పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఏప్రిల్‌ 24 వరకూ ఇవి కొనసాగుతాయి. మరోవైపు బోర్డు ఆధారిత పరీక్షల ఐచ్ఛికాన్ని ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు మార్చి ఒకటో తేదీ నుంచి 28 వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల ఆధారిత పరీక్షల ఐచ్ఛికాన్ని ఎంపికచేసుకున్న వారికి మార్చి పది నుంచి పరీక్షలు మొదలవుతాయి. ఈ వివరాలతో మాధ్యమిక విద్యా పరీక్షల కేంద్ర బోర్డు(సీబీఎస్‌ఈ) బుధవారం ఓ ప్రకటన విడుదలచేసింది.

ఎరవాడ జైలు నుంచి సంజయ్‌దత్‌ విడుదల 1 Y 92 days ago

ప్రముఖ హిందీ నటుడు సంజయ్‌దత్‌ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న ఆయన ఇప్పటి వరకు 42 నెలలపాటు కటకటాల్లో ఉన్నారు. జైలులో సంజయ్‌దత్‌ సత్ప్రవర్తనను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఆయన శిక్షా కాలాన్ని తగ్గించింది. దీంతో ఆయన ముందుగానే జైలు నుంచి విడుదలయ్యారు.

రోహిత్‌ తమ్ముడికి దిల్లీ ప్రభుత్వ ఉద్యోగం 1 Y 92 days ago

రోహిత్‌ వేముల తమ్ముడు రాజాకు ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని దిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. తమ కుటుంబం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు రోహిత్‌ తల్లి రాధిక విన్నవించిన అనంతరం రాష్ట్ర క్యాబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ‘రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో తమ కుటుంబానికి ఎలాంటి ఆదాయ మార్గమూ లేకుండా పోయిందని కేజ్రీవాల్‌కు రాధిక తెలిపారు. తన చిన్న కుమారుడికి ఉద్యోగమివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేజ్రీవాల్‌ ఆమెకు భరోసా ఇచ్చారు’అని దిల్లీ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన రాజాకు సరిపడే ఉద్యోగమివ్వాలని నిర్ణయించినట్లు దానిలో పేర్కొంది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు న్యాయం చేయాలని మంగళవారమిక్కడ ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే.

కొత్త ఆవిష్కరణలకు తెరలేపిన ఇంజనీరింగ్ విద్యార్థులు1 Y 93 days ago

 ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమ సృజనాత్మక శక్తి పదును పెట్టారు. అసాధ్యమనుకున్న వాటిని తాము సాధ్యం చేయగలుగుతామంటూ కొత్త ఆవిష్కరణలకు తెర లేపారు. రోబోటిక్స్‌, సివిలింగ్‌, ఎలక్ట్రానిక్స్‌.. ఇలా అనేక విభాగాల్లో తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి చేసిన ప్రయోగాలు సందర్శకులను ఆకర్షించాయి. సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ముఫకంజా కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు అడ్సోఫస్‌-2016 పేరిట మంగళవారం వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్‌ జావీద్‌ ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి ఉపయోపడే విధంగా విద్యార్థులు కొత్త రకం ఆ విష్కరణలు చేశారన్నారు. ఈ ప్రయోగాలు నిత్యం జీవితంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. . 

 
ఆకట్టుకున్న రోబోటిక్స్‌ విభాగం..

రోబోటిక్స్‌లో విద్యార్థుల ప్రయోగాలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. ఓ యువకుడు కాలుష్య రహిత ఫార్మూలా వన్‌ రేస్‌ కారును రూపొందించారు. కేవలం 48 ఓల్ట్‌ బ్యాటరీ తరంగాలతో ఈ కారు నడుస్తుంది. గంటకు నలభై కిలో మీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని విద్యార్థులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మొదట్లోనే గుర్తిస్తే చాలా వరకు నష్టాన్ని నివారించొచ్చు. ప్రమాదం చిన్నగా ఉన్నప్పు డే గుర్తించేందుకు వీలుగా ఫైర్‌ డిటెక్టర్‌ అండ్‌ ఎక్సిట్విన్‌క్విషన్‌ బోట్‌ ఓ విద్యార్థిని రూపొందించారు. 

కడప జిల్లాలో జగన్‌కు మరో షాక్... టీడీపీలోకి మరో ఎమ్మెల్యే1 Y 93 days ago

 వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ నేతలు ఒక్కొక్కొరుగా టీడీపీ బాట పడుతున్నారు. తాజాగా సొంత జిల్లాలో జగన్‌కు మరో షాక్ తగిలింది. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీకి గుడ్ బై చెప్పారు. బుధవారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో జయరాములు టీడీపీ కండువా కప్పుకున్నారు.ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇతర నేతలు ఈ కార్యక్రమంలో ఉన్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన తనయ అఖిలప్రియతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 

రూ.251 స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో విఫలమైతే... రింగింగ్‌ బెల్స్‌పై చర్యలు1 Y 93 days ago

 కేవలం రూ.251లు చెల్లించండి.. 3జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతంచేసుకోండి అంటూ భారీఎత్తున విక్రయాలకు తెరలేపిన రింగింగ్‌బెల్స్‌ కంపెనీపై కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. వినియోగదారులకు చెప్పినట్లుగా రూ.251లకు స్మార్ట్‌ఫోన్‌ను సరఫరా చేయడంలో విఫలమైతే కంపెనీపై చర్యలు తప్పవని ఆ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ ఈ ఫోన్లను ఎలా తయారు చేస్తోంది? దానికి బీఐఎస్‌ సర్టిఫికెట్‌ ఉందా లేదా? 251లకే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందా లేదా? అనే విషయాన్ని తాము పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ విషయమై కంపెనీ వర్గాలతోనూ మాట్లాడామన్నారు. ఒకవేళ సరఫరా చేయడంలో విఫలమైతే చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా, కేవలం 251లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ప్రకటించి.. రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ సంచలనం సృష్టించింది. కానీ, ఇంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ తయారు ఎలా సాధ్యమంటూ మొబైల్‌ పరిశ్రమ వర్గా లు సందేహాలు వ్యక్తం చేశాయి. రింగింగ్‌ బెల్స్‌ చెప్తున్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను అందించాలం టే రాయితీలు పోయి నా రూ.3,500లకు తక్కవ కాదని అంటున్నాయి. ఈ విషయాన్ని తెలియచేస్తూ టెలికాం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో 128 ఉద్యోగాలు1 Y 93 days ago

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న 14 అమ్యునేషన్ డిపో (14ఎఫ్‌డీ)లో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మెన్ మేట్, మెటీరియల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది 


Copyrights © 2014 6tvlive.com