6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

బంగారానికి డైమండ్ ఇస్తానంటోన్న నారా రోహిత్1 Y 89 days ago

శాస్త్రోక్తంగా నామకరణం చేయకపోయినా ప్రేమికులందరికీ కామన్‌ నేమ్‌గా ఉండే ‘బంగారం’ ఎప్పుడూ బంగారమే. ఆ ప్రేమ ఇంకొంచెం ముదిరి ‘బంగారం’ కాస్త ‘డైమండ్’, ‘ప్లాటినం’గా మారిపోయినా చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదు. ‘తుంటరి’ సినిమా కోసం నారా రోహిత్ ఆ పనే చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన లతా హెగ్డే‌ని ఇంప్రెస్ చెయ్యడానికి ‘డైమాండ్ గర్ల్’ అని ఓ పాటేసుకున్నాడు. తన డైమండ్ గర్ల్‌కి ఏమిచ్చాడో తెలీదు కానీ మీ బంగారానికి మాత్రం ఓ డైమండ్‌ని గిఫ్ట్‌గా ఇస్తానంటున్నాడు ఈ తుంటరోడు.

ఎర్రగడ్డ మార్కెట్‌ను సందర్శించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు1 Y 89 days ago

నగరంలోని ఎర్రగడ్డ మార్కెట్‌ను ఎంఐఎం ఎమ్మెల్యేలు పాషాఖాద్రి, మొయినుద్దీన్‌లు ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలిస్తారనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు మార్కెట్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఎర్రగడ్డ మార్కెట్ యధావిధిగా కొనసాగుతుందన్నారు. వ్యాపారస్తులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.

మేడారం జాతర బందోబస్తుకు వెళ్ళిన హోంగార్డు అదృశ్యం1 Y 89 days ago

మేడారం సమ్మక్క సారక్క జాతరలో బందోబస్తు కోసం వెళ్లిన ఓ హోంగార్డు అదృశ్యమయ్యాడు. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం, నూరినగర్‌ బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇబ్రహీం(45) చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు బందోబస్తుకు వెళ్తున్నానని ఇంట్లో చె ప్పి ఈనెల 13న ఇంటి నుంచి వెళ్ళాడు. తిరిగి 20వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తన భార్యకుఫోన్‌ చేసి 21వ తేదీన ఇంటికి వస్తున్నానని చెప్పాడు. తనతో పాటు వెళ్ళిన పోలీస్‌ సిబ్బంది అంతా తిరిగి వచ్చినా తన భర్త రాకపోవడంతో ఆందోళన చెందిన అతని భార్య సలీమ బేగం పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది.

కాచిగూడ ఎస్‌ఐ శివానంద్‌ సస్పెండ్‌1 Y 89 days ago

కాచిగూడ ఎస్‌ఐ శివానంద్‌ గౌడ్‌ను నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఇటీవలె ఓ మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఎస్‌ఐకు ఫిర్యాదుచేశారు. దీన్ని దర్యాప్తు విషయంలో శివానంద్‌ గౌడ్‌ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. దీంతో ఆమె కమిషనర్‌కు దృష్టికి తీసుకువెళ్లింది. ఎస్‌బి ద్వారా విచారణ జరిపించిన కమిషనర్‌ ఎస్సై నిర్లక్ష్యంగా ఉన్నట్టు తేలడంతో సస్పెండ్‌ చేశారు

ఫ్రీడం251 అందిన తర్వాతే సొమ్ము: రింగింగ్‌ బెల్స్‌1 Y 89 days ago

 మోసం కేసులో ఎఫ్‌ఐఆర్‌, పరువు నష్టం దావా, రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ అధికారుల నిశిత నిఘాల నడుమ.. ఫ్రీడం స్మార్ట్‌ఫోన్‌ 251 నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఫోన్‌ను అందుకున్న తర్వాతే డబ్బు చెల్లించే (క్యాష్‌ ఆన్‌ డెలివరీ-సీవోడీ) సదుపాయం కల్పిస్తున్నట్లు రింగింగ్‌ బెల్స్‌ చైౖర్మన్‌ అశోక్‌ చద్దా ప్రకటించారు. పారదర్శకత కోసమేగాక ఎలాంటి లోపాల్లేకుండా చూసేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తొలిదశలో జూన్‌ 30లోగా 25 లక్షల స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామన్నారు. కాగా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకునే వీలు కల్పించిన తొలిరోజున 30 వేల ఆర్డర్లు వచ్చాయి. తర్వాత వెబ్‌సైట్‌ క్రాష్‌ అయింది.

పాక్‌లో కోహ్లీ వీరాభిమానికి బెయిల్‌1 Y 89 days ago

విరాట్‌ కోహ్లీకి వీరాభిమాని అయిన ఉమర్‌ దరజ్‌(22) అనే పాక్‌ పౌరుడికి సెషన్స్‌ కోర్టు శనివారం బెయిలు మంజూరు చేసింది. 22 ఏళ్ల ఉమర్‌ చూడటానికి కోహ్లీలాగే ఉంటాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీ 90 పరుగులు కొట్టాడు. దీంతో ఆనందం పట్టలేక అదే రోజు ఉమర్‌ తన ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఉమర్‌ ఇంటిపై దాడి చేసిన పోలీసులు భారత పతాకాన్ని, ఇంట్లో అంటించి ఉన్న కోహ్లీ చిత్రపటాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్‌పై దేశద్రోహ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోహ్లీ మీద ఉన్న ఇష్టం.. భారత క్రికెట్‌ జట్టు అభిమానిని చేసిందని, తాను నేరం చేసిన విషయం కూడా తనకు తెలియదని, దయచేసి తనను భారత్‌కు గూఢచారిగా చూడొద్దని ఉమర్‌ పేర్కొన్నాడు. ఈ నేరం రుజువైతే ఉమర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

టీపీఎల్ సెమీస్‌లో ఖమ్మం1 Y 91 days ago

తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ట్వంటీ 20 చాంపియన్‌షిప్‌లో ఖమ్మం జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు.. ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది. తొలుత ఖమ్మం నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. సంకీర్త్ (64) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. లక్ష్యఛేదనలో ఆదిలాబాద్ 18.4 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది.

లోక్‌సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ1 Y 91 days ago

 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం పెరిగిందని తెలిపారు. అలాగే ద్రవ్యోల్బణం 4.5 నుంచి 5 శాతంగా ఉందని చెప్పారు. ద్రవ్యలోటును 3.9శాతానికి పరిమితం చేయడం సాధ్యమే అని ఆయన అన్నారు. 7వ వేతన సంఘం సిఫారసుల వల్ల ధరలు పెరగవన్నారు. బ్యాంకులకు మూలధనం పెంచే అవకాశం ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు.

పిల్లలు అశ్లీల వెబ్‌సైట్లు చూడకుండా నిరోధించాల్సిందే : సుప్రీంకోర్టు స్పష్టం1 Y 91 days ago

పిల్లలు అశ్లీల వెబ్‌సైట్లను చూడకుండా నిరోధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  అశ్లీల వెబ్‌సైట్లను చూడకుండా నిరోధించలేమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సుప్రీం ఏకీభవించలేదు. చైల్డ్‌పోర్నోగ్రఫి ఆపాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో అశ్లీల వెబ్ సైట్ లను చూడకుండా నిరోధించేందుకు కేంద్రప్రభుత్వం ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

అఫ్జల్‌గంజ్‌లో చిట్‌ఫండ్‌ కంపెనీ మోసం1 Y 91 days ago

 నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ మోసానికి పాల్పడింది. ప్రజల నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలు చేసి రాంరాజు చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసి డబ్బుతో ఉడాయించింది. విషయం తెలుసుకున్న బాధితులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. 

సెల్‌ఫోన్‌ను ఆ నాలుగు చోట్ల మాత్రం అస్సలు పెట్టుకోవద్దు1 Y 91 days ago

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ప్రధానంగా ఎదుర్కునే సమస్య బ్యాటరీ చార్జింగ్ డల్ అయిపోవడం. దీనికి కారణాలు అనేకం. అయితే స్మార్ట్‌ఫోన్‌ను నాలుగు చోట్ల మాత్రం అస్సలు పెట్టొద్దని పరిశోధకులు చెబుతున్నారు. ప్యాంట్ బ్యాక్ పాకెట్‌లో సెల్‌ఫోన్‌ను పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. బ్యాక్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల కూర్చున్నప్పుడు అది ఒత్తిడికి గురై బ్యాటరీ ఉబ్బే ప్రమాదముందని చెబుతున్నారు. ఫ్రిజ్‌లు, ఏసీలకు దగ్గరలో సెల్‌ఫోన్లు ఉంచొద్దని టెక్నాలజీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 0 డిగ్రీస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో సెల్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కోల్పోతుందన్నారు. మొబైల్‌ను పొరపాటున కూడా ఎండలో పెట్టేసి మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అలా వదిలేయడం వల్ల బ్యాటరీ వేడెక్కి పాడైపోయే ప్రమాదముందని తెలిపారు. వంట చేస్తూ ఫోన్ మాట్లాడి, కొంతమంది ప్రెజర్ కుక్కర్, స్టవ్‌కు దగ్గరలో ఫోన్‌ను ఉంచుతుంటారు. 

వరంగల్ కార్పొరేషన్‌లో 53 స్థానాల్లో టీడీపీ పోటీ1 Y 91 days ago

 వరంగల్ కార్పొరేషన్‌లో 53 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు టీడీపీ మద్దతు ఇవ్వనుంది. టీడీపీ అభ్యర్థులను  పోటీ నుంచి తప్పించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తుంది. దీంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు.  53 మంది టీడీపీ అభ్యర్థులతో హైదరాబాద్‌లో క్యాంపు వేశారు.కార్పొరేటరు అభ్యర్థులతో ప్రమాణం చేయించి వారికి బీఫామ్‌లు ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. 

రూ.99కే 35 వేల ఉచిత సెకన్లు : టెలినార్‌1 Y 91 days ago

 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని తన కస్టమర్లకు టెలినార్‌ సరికొత్త స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్‌ (ఎస్‌టివి)ను అందుబాటులోకి తెచ్చింది. 99 రూపాయల ఎస్‌టివితో రీచార్జ్‌ చేసుకుంటే 35,000 ఉచిత సెకన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. వీటి కాలపరిమితి 28 రోజులు. మొత్తం సెకన్లలో 17,500 ఉచిత సెకన్లను ఏ నెట్‌వర్క్‌కైనా వాడుకోవచ్చు. మిగతా 17,500 సెకన్లను టెలినార్‌ నెట్‌వర్క్‌లో వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 27,28 తేదీల్లోనే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని టెలినార్‌ ఎపి సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీనాథ్‌ కొటియన్‌ తెలిపారు.

టమాటా రైతుకు మిగులుతుంది ఒక్క రూపాయే !1 Y 91 days ago

గతంలో చుక్కలనంటిన టమాట ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో దాని ధర కిలోకు కనీసం రూపాయి కూడా పలుకడం లేదు. పెట్టుబడి కాదు కదా... కూలీ కూడా దక్కడం లేదని రైతులు వాటిని పంటచేన్లలోనే వదిలేస్తున్నారు. తూప్రాన్‌ ప్రాంతంలో మొన్నటివరకు కిలో టమాట ధర రూ.80 వరకు పలికి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం దాని ధర రూపాయి కంటే తక్కువకు పడిపోయింది. కిలో టమాట ధర రూ.30లు ఉన్న సమయంలో రైతులు ఆ పంట సాగు చేశారు. కరువు పరిస్థితుల్లో ఆదుకుంటుందని వారు ఆశపడ్డారు. నిన్న మొన్నటివరకు మార్కెట్లో కిలో ధర రూ.10లు పలకింది. ఆ తర్వాత వ్యాపారులు రూ.10లకు మూడు, నాలుగు కిలోలను కూడా విక్రయించారు. గురువారం ధర మరింత దిగజారిపోయింది. టమాట పంట పండించిన రైతు వద్ద 20-25 కిలోల టమాట బాక్సుకు రూ.17-20లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దాంతో కిలో టమాటకు రూపాయి కూడా దక్కకపోవడంతో రైతులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు చెల్లించిన డబ్బు కూడా రావడంలేదని వాపోతున్నారు. 

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడికి ట్రాఫిక్‌ డ్యూటీ 1 Y 91 days ago

మద్యం తాగి వాహనం నడుపు తూ మల్కాజిగిరి ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన ఓ యువకుడు కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఈసీఐఎల్‌ చౌరస్తాలో 3 గంటల పాటు ట్రాఫిక్‌ డ్యూటీ నిర్వహించాడు. కీసర మండలం నాగారానికి చెందిన హను మంతు గత శనివా రం మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ కుషాయి గూడలో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. దీంతో సదరు పోలీ సులు కేసు నమోదు చేసి నేరేడ్‌మెట్‌ కోర్టులో ప్రవేశపెట్టగా రెండు రోజులు జైలు శిక్ష, 3 గంటలు ట్రాఫిక్‌ డ్యూటీ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. రెండు రోజుల పాటు చర్లపల్లి జైలులో శిక్షను పూర్తి చేసుకున్న హనుమంతు, శిక్షలో భాగంగా ఈసీఐఎల్‌ చౌరస్తాలో 3 గంటల పాటు ట్రాపిక్‌ విధులు నిర్వహించాడు. ‘డోంట్‌ డ్రంకెన డ్రైవ్‌’ అనే నినాదంతో కూడిన ప్లకార్డును చేతబట్టి హనుమంతు ట్రాఫిక్‌ డ్యూటీ చేశాడు. 

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపునకు ఓ.కే1 Y 91 days ago

జంటనగరాలు, శివార్ల ప్రజలను ట్రాఫిక్‌ విష వలయం నుంచి గట్టెక్కించడంలో కీలక భూమిక పోషించనున్న ఎంఎంటీఎస్‌ మూడో దశకు తెర లేచింది. మూడో దశ కింద ఘట్‌కేసర్‌ నుంచి రాయ్‌గిరి (యాదాద్రి) వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన విన్నపానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం.... గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో.... రాయ్‌గిరి స్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దీని కోసం 330 కోట్ల రూపాయిలు వ్యయమవుతుందని అంచనాలు రూపొందించారు. ఇప్పటికే.... ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.... ఘట్‌కేసర్‌-రాయ్‌గిరి (యాదాద్రి) మధ్య మూడో దశకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం గమనార్హం. రెండో దశ ప్రాజెక్టు కింద ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడపనున్న సంగతి విధితమే. కాగా.... రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.... మూడో దశ చేపడుతున్నందున.... రెండో దశ మాదిరిగానే.... ఈ ప్రాజెక్టును కూడా కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం 1/3: 2/3 పద్ధతిలో చేపట్టనున్నారు. అంటే.... 330 కోట్ల రూపాయిల ఖర్చులో.... 110 కోట్ల రూపాయిలను కేంద్ర ప్రభుత్వం, 220 కోట్ల రూపాయిలను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఘట్‌కేసర్‌ నుంచి రాయ్‌గిరి వరకు 34 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఘట్‌కేసర్‌-రాయ్‌గిరి మధ్య ప్రస్తుతం బీబీనగర్‌, భువనగిరి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 

ఏసీ, 4జి వై-ఫైతో సిటీలో ఈజీ కమ్యూట్1 Y 91 days ago

ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ప్రతిరోజూ ఉద్యోగాల కోసం 20-30 కిలోమీటర్ల దూరం వెళ్లేవాళ్లు చాలామందే ఉంటారు. వీళ్లలో కార్లు, ద్విచక్రవాహనాలు వాడేవాళ్లు 15-20 శాతం మాత్రమే. మిగిలిన వాళ్లంతా అయితే సిటీబస్సులు లేదా ఎంఎంటీఎస్‌ రైళ్లను నమ్ముకునే వెళ్తుంటారు. కానీ మనకు కావాల్సిన సమయానికి బస్సు దొరకడం, ఒకవేళ బస్సు వచ్చినా అందులో సీటు దొరకడం దాదాపు అసాధ్యమే. పోనీ క్యాబ్‌లలో వెళ్దామా అంటే అంత డబ్బు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి సమస్యలను తీర్చేందుకు మొదలైన ఓ స్టార్టప్‌ కంపెనీయే ఈజీకమ్యూట్‌. ఇలాంటి సమస్యతో బాధపడిన ఓ యువకుడు రాహుల్‌ జైన్‌. అతడికి ఈ సమస్యను తానే ఎందుకు పరిష్కరించకూడదన్న ఆలోచన వచ్చింది. వెంటనే తన మిత్రుడు మయాంక్‌ చావ్లాతో పంచుకున్నాడు. ఆ ఆలోచనే ఈజీకమ్యూట్‌గా రూపొందింది. ఈజీ కమ్యూట్‌ అనేది నగరంలో తిరిగే ఏసీ బస్‌ షటిల్‌ సర్వీస్‌. ఏసీ మినీబస్సులను నడుపుతున్న ఈ సంస్థ.. వాటిలో 4జి వై-ఫై సేవలను కూడా అందిస్తోంది. దీని యాప్‌ద్వారా మనకు కావల్సిన సమయానికి కావల్సిన రూట్లో సీటు బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి బోగీకి ఒక అటెండెంట్‌ ఉంటారు, అత్యవసర పరిస్థితిలో తెలియజేసేందుకు యాప్‌లోనే ఎస్‌ఓఎస్‌ సదుపాయం కూడా ఉంది.

బోయగూడలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగిపై దాడి1 Y 91 days ago

బోయగూడలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి సాయికుమార్‌పై అర్థరాత్రి దుండగులు కత్తులతో దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను ముషీరాబాద్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి తలసాని బంధువులే దాడి చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

‘వంగవీటి’ టైటిల్‌ లోగో విడుదల చేసిన వర్మ 1 Y 91 days ago

వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వంగవీటి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌ లోగోను వర్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా గురువారం విడుదల చేశారు. ఎర్రటి జెండా, కత్తి, వంగవీటి అనే అక్షరాన్ని గొలుసులతో కట్టివేయడం ఈ లోగోలో కనబడుతోంది. ఈ చిత్రమే తన చివరి తెలుగు సినిమాగా గతంలో వర్మ ప్రకటించారు.

సీబీఐ వలలో రైల్వే ఉద్యోగి1 Y 91 days ago

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్న రైల్వే ఉద్యోగి ఎట్టకేలకు సీబీఐ వలలో చిక్కాడు. వివరాల్లోకి వెళితే గుంటూరు రైల్వేశాఖలో పనిచేస్తున్న షేక్‌ మహబూబ్‌ బాషా ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నాడు. బాషాను నమ్మి మోసపోయిన కొందరు బాధితులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బాషాపై నిఘాపెట్టి... శుక్రవారం ఉదయం నిరుద్యోగుల నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


Copyrights © 2014 6tvlive.com