6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు1 Y 88 days ago

పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు ఎర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ తెలిపారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ అందేలా చేస్తామని  ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ లింక్‌ తప్పని సరి చేస్తామని ఆయన అన్నారు. దీంతో నేరుగా ప్రభుత్వ సబ్సిడీలు  లబ్దిదారులకు అందేలా అవుతుందని ఆయన అన్నారు. 

రైతులే దేశానికి వెన్నెముక బడ్జెట్‌లో జైట్లీ1 Y 88 days ago

రైతులే దేశానికి వెన్నెముకని బడ్జెట్ సమావేశంలో జైట్లీ అన్నారు. అహార భద్రతలో రైతులే కీలకమని ఆయన గుర్తుచేశారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చూస్తామని జైట్లీ హామినిచ్చారు. రైతులకోసం మార్కెటింగ్‌ అవకాశాలు, నీటి లభ్యత పెంచుతామని ఆయన అన్నారు.

వైసీపీఎల్పీ సమావేశానికి ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా1 Y 88 days ago

ఎమ్మెల్యేల వలసలు, అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాసం,ఎమ్మెల్యే రోజాకు మద్దతు అంశాలపై చర్చించేందుకు సోమవారం నిర్వహించిన   వైసీపీఎల్పీ సమావేశానికి ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. గైర్హాజరు అయిన వారిలో సుజయ కృష్ణ రంగారావు (బొబ్బిలి),మణిగాంధీ (కోడుమూరు), గౌరు సుచరిత (పాణ్యం), శివ ప్రసాద్ రెడ్డి(ప్రొద్దుటూరు), తిప్పేస్వామి(మదనపల్లి), బాల నాగిరెడ్డి (మంత్రాలయం), మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు)లు ఉన్నారు.ఈ  సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని జగన్‌ ఆదేశించినా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం విశేషం.

అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి లేకుండానే శీతల గిడ్డంగుల నిర్వహణ1 Y 88 days ago

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో సబ్సిడీలు అందిస్తుండటం.. వాణిజ్య పంటలు సాగు ఎక్కువవుతుండటంతో శీతల గిడ్డంగుల నిర్మాణం జిల్లాలో తీవ్రమైంది. గుంటూరు ఒంగోలు జాతీయ రహదారిపై ఇరువైపులా పదుల సంఖ్యలో శీతల గిడ్డుంగులు కనిపిస్తుంటాయి. అయితే వీటిలో ఏ ఒక్క దానికీ అగ్నిమాపకశాఖ అనుమతులు లేవు. ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం కలగక తప్పదు. నిజం... జిల్లాలో మొత్తం 114 గిడ్డుంగులు ఉంటే ఏ ఒక్క దానికీ ఫైర్‌ ఎనవోసీ(నో అబ్జెక్షన సర్టిఫికెట్‌) లేదు. కానీ అన్నింటిలోనూ వ్యాపారం సాగుతోంది. అయినా అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడం.. కొన్నింటిపై కేసులు పెట్టటం జరుగుతోంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ గిడ్డుంగులు మాత్రం ప్రస్తుతం యథేచ్ఛగా నడుస్తున్నాయి. జిల్లాలో తరచూ శీతల గిడ్డంగుల్లో ప్రమాదాలు జరుగుతుండటం సర్వసాధారణంగా ఉంటోంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వేల టన్నులు రైతుల రెక్కల కష్టం అగ్నికి ఆహుతవుతోంది. ఇటీవల యడ్లపాడు వద్ద ఓ శీతల గిడ్డంగిలో జరిగిన ప్రమాదంలో 40 వేల మిర్చి టిక్కీలు, రూ.20 లక్షల పసుపు, 250 క్వింటాళ్ల జూట్‌ విత్తనాలు, మినుములు కాలిపోయాయి. రెండు మూడేళ్ల నుంచి ఇలాంటి ప్రమాదాలు అధికమవుతున్నాయి. ప్రమాదాలు జరిగి కోట్లలో నష్టాలు సంభవిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా ఉం టున్నారు.

ప్రకాశం బ్యారేజీపై రోడ్డు ప్రమాదం...దుర్గగుడి ఉద్యోగి మృతి1 Y 88 days ago

ప్రకాశం బ్యారేజీపై రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆటో ఢీకొని దుర్గగుడి శానిటేషన్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ దుర్గారావు మృతి చెందారు.

స్మార్ట్‌ పరికరాల తయారీకి సన్నని గ్రఫీన్‌ పలకలు1 Y 88 days ago

 కాంతి, ఉష్ణాన్ని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసే స్మార్ట్‌ పరికరాల తయారీకి అవసరమైన అత్యంత పల్చని, ప్రభావవంతమైన గ్రఫీన్‌ పలకలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాధారణంగా గ్రఫీన్‌లో కాంతి శోషక సామర్థ్యం తక్కువగా ఉంటుంది. తనపై ప్రసరించిన కాంతిలో 2.3 శాతాన్ని మాత్రమే ఇది శోషించుకోగలదు. అయితే, కీటకాల కళ్లలోని నిర్మాణ ప్రత్యేకతల స్ఫూర్తితో... గ్రఫీన్‌ సూక్ష్మ పలకలను బ్రిటన్‌లోని సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. పలకలపై ప్రసరించిన కాంతి కొన్ని సూక్ష్మమైన ప్రదేశాల్లో కేంద్రీకృతమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాంతి పరావర్తనాన్నీ పరిహరించారు. దీంతో పలకల కాంతి శోషక సామర్థ్యం 90 శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన అరుణ్‌జైట్లీ1 Y 88 days ago

 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను అరుణ్‌జైట్లీ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.

రేపటి నుంచి జలమండలి మేనేజర్‌ పోస్టులకు మౌఖిక పరీక్షలు1 Y 88 days ago

జలమండలిలో మేనేజర్‌(ఇంజినీరింగ్‌) పోస్టులకు తెలంగాణరాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) మంగళవారం (మార్చి1)నుంచి మౌఖిక పరీక్షలునిర్వహించనుంది. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలిచిన సుమారు 300 మంది అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. మూడో తేదీ దాకా జరిగే మౌఖిక పరీక్షను కమిషన్‌ కార్యాలయంలో నిర్వహిస్తారు. 

ఏపీ విద్యుత్తు ప్రాజెక్టుల వ్యయాలపై తెలంగాణ డిస్కం అభ్యంతరాలు1 Y 88 days ago

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పాదన సంస్థ (ఏపీజెన్‌కో) ప్రాజెక్టులకు సంబంధించిన 2014-2019 సంవత్సరాల ఛార్జీల ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చేపట్టింది. ఈ విషయమై ఏపీజెన్‌కో విజ్ఞాపన సమర్పించింది. దీనిపై ఈఆర్‌సీ మార్చి 2వ తేదీ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరపనుంది. అభ్యంతరాలు, సలహాలను పంపాలని కోరింది. ఇందుకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌) కూడా స్పందించింది. తన అభ్యంతరాలను సమర్పించింది. ‘సీలేరు కాంప్లెక్స్‌, శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం, విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం విషయంలో 2009-14 సంవత్సరాల కాలానికి రూ.174.73 కోట్ల అదనపు పెట్టుబడి ఖర్చు అయినట్లుగా ఏపీజెన్‌కో తన విన్నపంలో తెలియజేసింది. కానీ గతంలో సమర్పించిన దరఖాస్తుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. 2014 మే లో ఈఆర్‌సీ ఆర్డరు కూడా ఇచ్చింది. అదనపు వ్యయాన్ని సమర్థించుకునే పద్దువారీ ఖర్చూ ఏపీజెన్‌కో పిటిషన్‌లో లేదు’ అని పేర్కొంది. థర్మల్‌ స్టేషన్ల విషయంలో అనుమతించిన పెట్టుబడి వ్యయానికన్నా ఇంకా రూ.277.97 కోట్లు కావాలన్న ఏపీజెన్‌కో విన్నపాన్ని పరిశీలించాల్సి ఉందని కోరింది. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి సవరించిన మార్గదర్శకాల ఆధారంగా నిర్వహణ ఖర్చులను ఇవ్వాలని కోరడంపైనా అభ్యంతరం తెలిపింది. 

భారత్‌ × పాక్‌ మ్యాచ్‌ వేదికను మార్చాలి: కాంగ్రెస్‌1 Y 88 days ago

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 19న హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించే భారత్‌×పాకిస్థాన్‌ మ్యాచ్‌ వేదికను ఇతర రాష్ట్రాల్లోన్ని మైదానాలకు మార్చాలని లేదా మ్యాచ్‌ రద్దు చేయాలని హిమాచల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పాకిస్థాన్‌తో పోరాడి ప్రాణాలొదిలిన వీర సైనికుల త్యాగాలను గౌరవించి వేదికను మార్చాలని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ను హరియాణా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుఖ్విందర్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ధర్మశాలలో నిర్వహించే మ్యాచుల ద్వారా వచ్చే ఆదాయంలో సగం పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో మరణించిన వారి కుటుంబాలకు, ఉగ్రవాదులతో పోరాడిన వారికి పంచాలని కోరారు.

విజయవాడ అదనపు సీపీగా ఐజీ లడ్హా1 Y 88 days ago

బెజవాడ పోలీసు కమిషనరేట్‌కు సీపీ గౌతం సవాంగ్‌కు సహాయంగా ఐజీ, డీఐజీలు రావడం ఖాయమైంది. కృష్ణలంక స్వర్ణబార్‌ కల్తీ మద్యం కేసు దర్యాప్తు బృందం (సిట్‌) ఐజీ మహేష్‌ లడ్డా అదనపు సీపీగా నియమితులు కావచ్చనే సమాచారముంది. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన ఎస్పీల సమావేశం సందర్భంగా కమిషనరేట్‌ విస్తరణ, నూతన పోస్టుల భర్తీ గురించి చర్చ జరిగింది. లడ్హా సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, డీఐజీ అయిన అబ్దుల్‌సత్తార్‌ ఖాన్‌కు సైతం జాయింట్‌ కమిషనర్‌గా బెజవాడలోనే పోస్టింగ్‌ లభించవచ్చని వినికిడి.

పంజాబ్‌లో సైనిక దుస్తుల అమ్మకాలపై నిషేధం1 Y 88 days ago

రాష్ట్రంలో సైనిక దుస్తుల అమ్మకాలపై నిషేధం విధించినట్లు పంజాబ్‌ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సరైన గుర్తింపు లేకుండా ఈ రకమైన దుస్తులు అమ్మరాదని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని గురుదాస్‌పుర్‌, పఠాన్‌కోట్‌లో సైనిక దుస్తులు ధరించి మారువేషాల్లో ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా సైనిక దుస్తులు కొనుగోలు చేయాలంటే వారు స్వీయ ధ్రువీకరణ గుర్తింపు పత్రం, మొబైల్‌ సంఖ్యను అమ్మకందారులకు సమర్పించాలి. షాప్‌ యజమాని క్రమం తప్పకుండా ఏ రోజున ఎవరికి సైనిక దుస్తులు అమ్మారో తెలిపే రిజిస్టర్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఫేస్‌బుక్‌కు పోటీగా ‘ట్రూ ఇండియన్‌’1 Y 88 days ago

భారత్‌లో ఫేస్‌బుక్‌కు పోటీగా సామాజిక అనుసంధాన వేదికను సిద్ధం చేస్తున్నట్లు ట్రూఇండియన్‌ అనే సంస్థ వెల్లడించింది. ‘ట్రూ ఇండియన్‌’ పేరుతో ఆవిష్కృతమవుతున్న ఈ సామాజిక అనుసంధాన వేదికను బిహార్‌ ఆర్థిక మంత్రి జగ్గంత్‌ మిశ్ర కుమారుడు మనీశ్‌ మిశ్ర నేతృత్వంలోని సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేశారు. భారత్‌లోని భిన్నత్వం, సమానత్వ భావనలను తమ వేదిక ప్రతిబింబిస్తుందని ట్రూ ఇండియన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మదుపరులు, వ్యవస్థాపకులకు కేవలం లాభాలు అర్జించి పెట్టేందుకే ఫేస్‌బుక్‌ పనిచేస్తోందని ట్రూ ఇండియన్‌ను ప్రారంభించనున్న దాతృత్వ సంస్థ ‘ఫ్రెండ్స్‌ ఫర్‌ లైఫ్‌’ ఆరోపించింది. ఫేస్‌బుక్‌ను 19వ శతాబ్దంలో దేశాన్ని దోచుకున్న ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ’తో పోల్చింది. సామాజిక అనుసంధాన వేదిక ‘ఆర్కుట్‌’ను ఫేస్‌బుక్‌ ఏ విధంగా మూలకు నెట్టిందో.. తాము కూడా అలానే మరో ఐదేళ్లలో భారత్‌కు ఫేస్‌బుక్‌ నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొంది.

హరీశ్ కు ‘గ్రేటర్ వరంగల్’ బాధ్యత1 Y 89 days ago

 గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం రాత్రి తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఆదివారం నుంచి ఎన్నికల తంతు ముగిసే వరకు వరంగల్‌లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని హరీశ్ ను ఆయన ఆదేశించారు.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌కి సంజయ్‌ రెడీ1 Y 89 days ago

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు. గురువారం జైలు నుంచి విడుదలైన ఆయన యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో సంజయ్‌ ఓ సినిమా చెయ్యనున్నారు. ‘‘కథా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. సమ్మర్‌లో షూటింగ్‌ మొదలుపెడతాం. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ 

సూర్యాపేటలో... గంజాయి మత్తులో ఇద్దరు యువకుల వీరంగం1 Y 89 days ago

నల్గొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఆదివారం ఇద్దరు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. మత్తులో ఉన్న ఆ ఇద్దరు యువకులు రోడ్డుపై వెళుతున్న పలువురిపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకుని అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడి చేశారు. దీంతో అటు పోలీసులకు, ఇటు పలువురికి గాయాలయ్యాయి. 

జగన్‌కు హ్యాండ్‌ ఇచ్చిన ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు1 Y 89 days ago

ఏపీలో ఆపరేషన్‌ నేపథ్యంలో వైసీపీలో కలకలం రేగుతోంది. పార్టీ వీడబోనని చెప్పిన రెండోరోజే ఆ పార్టీ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు జగన్‌కు హ్యాండ్‌ ఇచ్చారు. జగన్‌ పూర్తిగా ఇదే అంశంపై దృష్టి పెట్టి ఎమ్మెల్యేలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే డేవిడ్‌ రాజు పార్టీ వీడడం ఆ పార్టీ సీనియర్‌లను నివ్వెర పరిచింది. దీంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలతో సీరియస్‌గా చర్చించాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ వైసీపీ సీనియర్‌ నేతలను ఆదేశించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఒక ఎత్తు అయితే డేవిడ్‌ రాజు పార్టీ మారడం మరొక ఎత్తు. డేవిడ్‌ రాజు శుక్రవారం జగన్‌ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవద్దని సూచించారు. జరిగి 48 గంటల్లోనే రాజు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి టీదీపీలోకి చేరటం వైసీపీలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలియవచ్చింది. 

రూ.53 లక్షలు మోసపోయిన బ్యాంక్‌ మేనేజర్‌1 Y 89 days ago

 నగరంలోని మోతీనగర్‌కు చెందిన బ్యాంక్‌ మేనేజర్‌ని సైబర్‌ నేరగాళ్లు రూ.53 లక్షలకు మోసం చేశారు. ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసే జితేందర్‌ తన రిజ్యూమ్‌ని నెట్‌లో పెట్టారు. సైబర్‌ నేరగాళ్లు ఆ రెజ్యూమ్‌ని చూసి స్కాట్లాంట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం నమ్మకాలికారు. ప్రాససింగ్‌ ఫీజు రూపంలో మొదట రూ.5వేలు వసూల్జేశారు. ఈ తర్వాత లక్ష వసూలు చేశా రు. ఏదో ఒక సాకు చెబుతూ మూడు నెలల కాలంలో మొత్తం రూ.53 లక్షలు వసూలు చేశారు. బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఢిల్లీ వెళ్లి ముఠాను అరెస్ట్‌ చేశారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ కింద వారిని నగరానికి తీసుకువచ్చారు. పోలీసులకు పైసా కూడా రికవరీ కాలేదు

భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కురు వృద్ధుడు మృతి1 Y 89 days ago

 భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కురు వృద్ధుడు బీకే గురుదాచర్‌ (99) శనివారం కన్నుమూశాడు. ఆయన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మైసూర్‌కు సారథ్యం వహించాడు. 1935-1946 మధ్య ఆల్‌రౌండర్‌ గురుదాచర్‌ 27 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచల్లో 29.63 సగటుతో 1126 పరుగులు చేసి.. వంద వికెట్లు తీశాడు. ఆయన మృతిపట్ల కర్ణాటక క్రికెట్‌ సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

సత్యాన్వేషణకు మార్గం సైన్స్‌...నేడు నేషనల్‌ సైన్స్‌ డే 1 Y 89 days ago

సైన్స్‌ అంటే...పరిశీలన, ప్రయోగం, నిర్ధారణ ద్వారా వెలువడే సత్యమే సైన్స్‌. ఊహలకు, కల్పనలకు ఇందులో తావుండదు. ఇదీ సైన్స్‌ డే నేపథ్యం‘రామన్‌ ఎఫెక్ట్‌’’ కనుగొన్నందుకు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్‌సీవీ రామన్‌కు 1930, ఫిబ్రవరి 28న నోబెల్‌ బహుమతి ప్రకటించారు. ఆ రోజును ‘‘నేషనల్‌ సైన్స్‌ డే’’గా జరుపుకుంటున్నాం.
 
‘‘ విజ్ఞానశాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి.. ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మథించగలవు’’. 
1954లో భారతరత్న అవార్డు అందుకుంటున్న సందర్భంగా సర్‌ సీవీ రామన్‌ అన్న మాటలు... 

తప్పక చూడాల్సిన కొన్ని సైన్స్‌ మ్యూజియమ్స్‌ 

బిర్లా సైన్స్‌ మ్యూజియం, హైదరాబాద్‌ జూసైన్స్‌ సిటీ, కలకత్తా జూమోక్షగుండం శ్వేస్వరయ్య ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నలాజికల్‌ మ్యూజియం, బెంగుళూరు జూ బిర్లా ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నలాజికల్‌ మ్యూజియం, కలకత్తా జూ నేషనల్‌ సైన్స్‌ సెంటర్‌, ఢిల్లీ నెహ్రూ సైన్స్‌ సెంటర్‌ , ముంబాయి


Copyrights © 2014 6tvlive.com