6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

తీవ్ర అస్వస్థతకు గురైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 2 Y 143 days ago

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మురళీధర్‌రావును తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో బీజేపీ నేతలు చేర్పించారు. స్విమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మురళీధర్‌రావుకు చికిత్స కొనసాగుతోంది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితినిలకడగా ఉందని స్విమ్స్ వైద్యులు  తెలిపారు.

తల్లీ కూతురు సజీవ దహనం2 Y 143 days ago

నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో ఈ రోజు  తెల్లవారు జామున విద్యుత్ ఘాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కూతురు సజీవ దహనమయ్యారు . ఇంటినుండి పొగలురావడం చూసిన స్థానికులు
అగ్నిమాపక శాఖకు సమాచారమందించి మంటలను అర్పివేశారు.అప్పటికే లవారు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు .

ఫేస్ బుక్ లో భర్తపై దుష్ప్రచారం.. భార్యకు జరిమానా....2 Y 144 days ago

భర్తను నిందిస్తూ ఫేస్ బుక్  ద్వారా దుష్ప్రచారం చేసినందుకు ఓ యువతికి జరిమానా విధించారు. ఆస్ట్రేలియాకు చెందిన రోబిన్ గ్రీవ్యు.. తన భర్త మిరో డబ్రోస్కీ హింసించాడని గత డిసెంబర్ 12న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. 18 ఏళ్లపాటు తనకు నరకం చూపాడని, అందుకే అతణ్నుంచి విడిపోయానని ఫేస్ బుక్ లో  వెల్లడించింది.
స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న మిరో డ్రోస్కీ తన భార్యపై పశ్చిమ ఆస్ట్రేలియన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తనపై అసత్య ప్రచారం చేస్తూ తన గౌరవానికి భంగం కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రోబిన్ ఆరోపణల్లో నిజంలేదని, భర్త ఆమెను వేధించినట్టు ఆధారాలు లేవని తీర్పు వెలువరించింది. డబ్రోస్కీపై అసత్య ప్రచారం చేసినందుకు రోబిన్‑కు దాదాపు 8 లక్షల రూపాయల జరిమానా విధించింది.

 

సోషల్ మీడియాలో మేక్ ఇన్ ఇండియా హల్ చల్...2 Y 144 days ago

ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతి మూడు సెకన్లకు ఒకరి చొప్పున ఆ పేజీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన మూడు నెలల్లోనే ఫేస్ బుక్, ట్విట్టర్లలో విశేష స్పందన కన్పిస్తోంది. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ఫేస్ బుక్ పేజీలో 3 మిలియన్లకు పైగా అభిమానులు చేరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఇంతటి ఆదరణ ఇదే ప్రధమమని పేర్కొంది.

అలా చేస్తే మీకు నీతిలేనట్లే....2 Y 144 days ago

ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త రూపుదిద్దుకుంటున్న నీతి అయోగ్ పై విపక్షాలు విమర్శలు చేయడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. నీతి ఆయోగ్ ను విమర్శిస్తే నీతి లేకుండా పోతారని ధ్వజమెత్తారు. మూస పద్దతిలోని ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ప్రణాళికా రచనలో అన్ని రాష్ట్రాల సీఎంలకు చోటు కల్పించిన కేంద్రాన్ని విమర్శించడం తగదన్నారు. ప్రతిపక్షాలుంటేనే ప్రభుత్వాలు తమ తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉందన్న వెంకయ్య విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు.

మా మనోభావాలు దెబ్బతీయోద్దు....2 Y 144 days ago

ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర తమిళ నాయకులు ఆందోళన దిగారు. శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సెకు మద్దతుగా సల్మాన్ ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. సల్లూభాయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళుల మనోభావాలు దెబ్బతీయోద్దంటూ రాజపక్సె ఇంటి ముందు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. కుమారుడు నమల్ కోరికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సల్మాన్ అంగీకరించారు. ఆయనతో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అత్యుత్సాహానికిపోతే చిక్కులు తప్పవు.....2 Y 144 days ago

పీకే చిత్రం డౌన్ లోడ్ చేసుకుని చూశానన్న వివాదంలో చిక్కుకున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పై సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. యాంటీ పైరసీ చట్టాన్ని ఉల్లంఘించారంటూ పలువురు సామాజిక కార్యకర్తలు అఖిలేశ్ పై కేసు పెట్టారు. దీనిపై సీఎం కార్యాలయం స్పందించింది. పీకే చిత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు లైసెన్స్ పొందినట్లు తెలిపింది.

దానిపై మోడీతో మాట్లాడుతాం....2 Y 144 days ago

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ జూన్ నాటికి సిద్ధమవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళగిరిలో పర్యటించిన ఆయన పారశుద్ధ్యంపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 12న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తారని ఆయన వెల్లడించారు.

మమతా రాజీనామా చేయాలి....2 Y 144 days ago

శారదా చిట్ ఫండ్ కుంభకోణం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు మమత సర్కారుపై బీజేపీ దాడి చేస్తే తాజాగా ఆమె చేతిలో ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రి సీపీఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య విమర్శల దాడి చేశారు. అధికారంలో కొనసాగేందుకు తృణమూల్ కాంగ్రెస్ కు నైతిక హక్కులేదని బుద్ధదేవ్ విమర్శించారు. మమతా బెనర్జీ వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్మికులకు శుభవార్త....2 Y 144 days ago

కార్మికులను మోడీ సర్కార్ అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని దత్తాత్రేయ చెప్పారు.

అలైన్ మెంట్ మార్పుపై సీఎస్ సంతృప్తి.....2 Y 144 days ago

అలైన్ మెంట్ మార్పుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి మెట్రో అధికారులు నివేదిక సమర్పించారు. 3 కారిడార్లలో సర్వే పూర్తి చేసిన అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రస్తుత మార్పు ద్వారా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే అలైన్ మెంట్ మార్పు వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశాలను ఫోటోలతో సహా నివేదికలో పొందుపరిచారు. పాతబస్తీలో ప్రస్తుత అలైన్ మెంట్ ప్రకారం ఎన్ని ఆలయాలు, మసీద్ లు కనుమరుగవుతాయనే అంశాలను నివేదించారు. నివేదికపై సిఎస్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నెల 9 జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది

ప్రముఖ సినీ నటుడు అహుతి ప్రసాద్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కాగా ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్‌. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. అంచెలంచెలుగా పైకి వచ్చిన నటులలో ప్రసాద్ ఒక్కరు. అహుతి సినిమా నుంచి తెలుగు చిత్రసీమకు పరిచయమైన ప్రసాద్.. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం  సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.

మిలాద్ ఉన్ నబి ఉత్సవాలకు బారీ బందోబస్తు 2 Y 145 days ago

 మిలాద్ ఉన్ నబి ఉత్సవాల నేపధ్యంలో పాతబస్తీలోని పలు కీలక ప్రాంతాలతోపాటు  ప్రధాన రహదారులపై తీసుకోవలసిన బందోబస్తుపై నగర పోలీస్ కమిషనర్ మహేంధర్‌రెడ్డి ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితతితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టడానికికైనా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజలు  ఉత్సవాలను  ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

పాక్ కాల్పులు, ఇద్దరు జవాన్లు మృతి 2 Y 145 days ago

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.  సరిహద్దుల్లోని గ్రామాలపై పాక్ సైనికమూకలు మోర్టార్లు, బాంబులతో విరుచుకు పడుతున్నాయి. పాక్ సైన్యానికి ధీటైన సమాధానం చెబుతూ.. జమ్మూ కశ్మీర్‌లోని తంగ్దర్ సెక్టార్‌లో పాక్ సేనలను ఎదుర్కొంటూ మన దేశానికి చెందిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

మౌలాలి ఫైర్ స్టేషన్‌లో నలుగురు సస్పెండ్ 2 Y 145 days ago

హైదరాబాద్‌లోని మౌలాలి ఫైర్ స్టేషన్‌లో నలుగురు అగ్నిమాపక సిబ్బంది డిసెంబర్ 31న మద్యం తాగి చిందులేసిన ఘటన పై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఫైర్ స్టేషన్‌లోనే మద్యం తాగిన నలుగురిని   సస్పెండ్ చేసినట్లు  డిఎఫ్ వో పాపయ్య   తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ2 Y 145 days ago

 తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకవుతోంది.  జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద ఈ ఘటన జరిగింది.  రంగంలోకి దిగిన  సిబ్బంది గ్యాస్ లీకేజీని  నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పాక్..,జమ్ము-కశ్మీర్ లోకి ఉగ్రవాదుల్ని పంపుతోంది...2 Y 145 days ago

జమ్ము కశ్మీర్ లోకి తీవ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందన్నారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్. సరిహద్దు వెంబడి నిరంతరం కాల్పులకు పాల్పడుతూ ..కాల్పుల మాటున తీవ్రవాదులను చొరబడేలా చూస్తోందన్నారు. అయితే జమ్మూలె ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ కాల్పులకు బీఎస్ ఎఫ్ జవాన్లు దీటుగా సమాధానమిస్తున్నారని మంత్రి తెలిపారు

విమాన శకలాల్లోంచి నడుచుకుంటూ వచ్చిన బాలిక....2 Y 145 days ago

అమెరికాలో ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. కెంటకీలో ఈ ఎంపీ-3 అనే  ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కెంటకీ సరస్సు వద్ద అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచందారు. అయితే ఏడేళ్ల బాలిక కూలిన విమాన శకలాల్లోనుంచి నడుచుకుంటూ బయటకు వచ్చింది. అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

వాటర్ ట్యాంక్ కూలి 20మంది మృతి....2 Y 145 days ago

కర్ణాటకలోని రాయ్ చూర్ మండలం యాపలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలి 20మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కు చెందినవారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రేమజంట....2 Y 145 days ago

కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన అపర్ణ, పైడవాడకు చెందిన చల్లా నాగరాజు అనే ఇద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


Copyrights © 2014 6tvlive.com