6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

చంద్రబాబుపై నాకు ఆ నమ్మకం ఉంది.....2 Y 139 days ago

కాంగ్రెస్పార్టీకి రుద్రరాజు పద్మరాజు రాజీనామా చేశారు. చంద్రబాబు కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకంతో టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్రఘువీరారెడ్డికి పంపానని తెలిపారు. కాంగ్రెస్పార్టీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చాలా ప్రయత్నించామని.. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలు, సమస్యల గురించి సోనియాకు చెప్పామన్నారు రుద్రరాజు పద్మరాజు.

దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే లాంటిది...2 Y 139 days ago

దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే లాంటిదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్ లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ సూర్యోదయ రాష్ట్రమని అన్నారు. అంతేకాకుండా పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామనివిశాఖలో మెగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, వచ్చే నెల నుంచి ఈ-బిజ్‑ను ప్రారంభిస్తామని బాబు తెలిపారు.

తల్వార్ తో దొంగల్ని తరిమికొట్టిన యువతి....2 Y 139 days ago

భోపాల్‌కు చెందిన ఓ విద్యార్థిని దొంగల ఆట కట్టింది.ఇంటిలో చొరబడ్డ దొంగలను తల్వార్‌తో తరిమికొట్టింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన విద్యార్థిని చరణ్‌ప్రీత్ కౌర్ (21) ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతోంది. బుధవారం వేకువ జామున తన ఇంట్లోని రెండో అంతస్తులో కూర్చొని పరీక్షలకు చదువుకుంటోంది. అదే సమయంలో ఇంట్లోకి ముసుగు దొంగలు చొరపడ్డారు.   వారి చూసి ఏమాత్రం జంకకుండా.. అప్రమత్తమైన చరణ్‌ప్రీత్ తన గదిలో ఉన్న నాలుగడుగుల తల్వార్ తీసుకుని అరుస్తూ వారిపైకి దూసింది. కౌర్ కేకలు విని ఆమె తండ్రి హర్వీందర్ కూడా మరో తల్వార్ తీసుకుని వారి వెంటబడ్డారు. దీంతో దొంగలు పరుగు లంకించారు.    ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి చరణ్‌ప్రీత్‌ ధైర్యాన్ని మెచ్చుకుని అభినందించారు. అంతేకాకుండా ఆమె పేరును సాహస యువతి అవార్డుకు సిఫార్సు చేసి పంపుతానని తెలిపారు.

ముంబయి పేలుళ్ల తీవ్రవాది మళ్లీ ఇంటికే.... 2 Y 139 days ago

ముంబయి పేలుళ్ల తీవ్రవాది, లష్కరే తోయిబా ప్రధాన నేత జకీర్ రెహ్మన్ లఖ్వీకి మరోసారి బెయిల్ మంజూరయింది. రూ.2 లక్షల పూచీ కత్తుతో ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ లో పాకిస్థాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతనికి బెయిల్ ఇవ్వగా భారత్ నిరసనల నేపథ్యంలో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. లఖ్వీపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తాజాగా మళ్లీ బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.

జమ్మూ - కశ్మీర్ లో గవర్నర్ పాలన....2 Y 139 days ago

జమ్మూకాశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు కేంద్రం సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో.. గవర్నర్‌ పాలన విధించాలని కేంద్రం కోరింది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..అతిపెద్ద పార్టీగా  పీడీపీ అవతరించింది.

మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాజపక్సే.....2 Y 140 days ago

శ్రీలంక అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు దేశమంతా పోలింగ్ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోటీలో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు

మహిళతో మూత్రం తాగించిన ముగ్గురు వ్యక్తులు....2 Y 140 days ago

నెల్లూరుజిల్లా దగదర్తి మండలంలో అమానుషం జరిగింది. ప్రభుత్వం పట్టా ఇచ్చిన భూమిని సాగు చేసుకొనేందుకు వెళ్లిన దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అంతటితో ఆగని వారి పైశాచికత్వం ఆమెతో మూత్రం తాగించేదాకా వెళ్లింది. గాయపడిన మహిళను  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై దళిత, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి

ప్రజాధనం దుర్వినియోగం....2 Y 141 days ago

చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉన్న రాష్ట్రాలే పొదుపు పాటిస్తుంటే..చంద్రబాబు సర్కారు మాత్రం బడ్జెట్ లోటులో ఉందని చెబుతూ.. ప్రభుత్వ ధనాన్ని దుబారా చేస్తోందని దుయ్యబట్టారు. నచ్చిన వారిని ప్రత్యేక విమానాల్లో విదేశాలకు విహార యాత్రలకు తీసుకెళ్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమీక్షలను హైదరాబాద్ లో జరిపే అవకాశం ఉన్నా... విజయవాడలో నిర్వహిస్తూ లక్షలకు లక్షలు వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

2016 లో జీరో బడ్జెట్.. 2 Y 141 days ago

2016 లో జీరో బడ్జెట్‌..ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు ఏపీ ఆర్తిక మంత్రి యనమల ప్రకటించారు. విజయవాడ ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు, రెవెన్యూ వసూళ్లపై చర్చ అనంతరం... ప్రజలపై ఎలాంటి భారం మోపబోమని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటామన్న యనమల.... రెవెన్యూ ఖర్చులు తగ్గించడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు ప్రకటించారు.

పత్రికా కార్యాలయంపై కాల్పులు.. 10మంది జర్నలిస్టులు మృతి....2 Y 141 days ago

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో దారుణం జరిగింది. పత్రికా కార్యాలయంపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పదిమంది జర్నలిస్టులు దుర్మరణం పాలయ్యారు.

ప్రభుత్వానికి అవే రెండు కళ్లు...2 Y 141 days ago

అభివృద్ధి, సంక్షేమం.. ప్రభుత్వానికి రెండు కళ్లు అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణవిముక్తి రెండో విడతలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదని అధికారులను ఆదేశించారు. జపాన్, సింగపూర్ ప్రభుత్వాల సహకారంతో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న సింగపూర్ బృందం మళ్లీ వస్తుందని.. భూ సమీకరణ ప్రక్రియ కూడా ఆటంకాలు లేకుండా సాగుతుందని తెలిపారు.

ఆవేదనలో జగన్...2 Y 141 days ago

అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, పల్లెరఘునాథ్రెడ్డి, గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేకమంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు

యువరాజ్ కు దక్కని చోటు...2 Y 142 days ago

ప్రపంచకప్ క్రికెట్ టీమ్ లో యువరాజ్ కు చోటు లభించలేదు.

నాకూ కావాలి....2 Y 142 days ago

పద్మభూషణ్ అవార్డు కోసం మరో అథ్లెట్ డిమాండ్ చేస్తున్నారు. తనకు పద్మభూష్ అవార్డు కావాలని విజేందర్ సింగ్ డిమాండ్ చేశారు. క్రీడాకారుల వరుస డిమాండ్లతో కేంద్రప్రభుత్వం ఏం చేస్తోందో వేచి చూడాలి.

రామగుండం బొగ్గు గనిలో ప్రమాదం2 Y 143 days ago

కరీంనగర్ జిల్లా రామగుండం-2ఏ బొగ్గు గనిలో పైకప్పు కుప్పు కూలింది.ఈ  ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఎర్రగడ్డ శ్మశానవాటికలో ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు 2 Y 143 days ago

 ప్రముఖ సినీ నటుడు ఆహుతిప్రసాద్‌ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరిగాయి.  ఆహుతిప్రసాద్‌  చితికిఆయన కుమారుడు  నిప్పంటించడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సోమవారం ఉదయం ఫిల్మింనగర్‌ నుంచి ఎర్రగడ్డ శ్మశాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలు అభిమానులు తరలివచ్చారు. 

రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో పోస్టర్లు2 Y 143 days ago

నల్లగొండ జిల్లాలో రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో పోస్టర్లు వెలిసాయి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌ ఖబడ్దార్‌ అంటూ పోస్టర్లలో ఉంది . ఆ పోస్టర్లపై  పోలీసులు విచారణ  చేపట్టారు.

తెలంగాణ టూరిజం బస్సుకు ప్రమాదం2 Y 143 days ago

 తెలంగాణ టూరిజం బస్సుకు మహారాష్ట్ర లోని షోలాపూర్ వద్ద  ప్రమాదం జరిగింది. షిర్డి నుంచి హైదరాబాద్ వస్తున్న  టూరిజం బస్సు ట్రాక్టర్ ను తప్పించబోయి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. 43 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   

గిరిజనులను హత్య చేసిన మావోలు 2 Y 143 days ago

 ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కొర్రాగూడ వద్ద  ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

గణేష్ పాత్రో కన్నుమూత2 Y 143 days ago

 ప్రముఖ రచయిత, సినీ మాటల రచయిత గణేష్‌పాత్రో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ సినిమాలకు రచయితగా  గణేష్‌పాత్రో ప్రసిద్ది పొందారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,రుద్రవీణ, మా పల్లెల్లో గోపాలుడు, ప్రేమించు పెళ్లాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరో చరిత్ర, అత్తవారిల్లు సినిమాలకు మాటలు రాశాడు.  రెండు సార్లు నంది అవార్డులు వరించాయి. గణేష్‌పాత్రో స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం.


Copyrights © 2014 6tvlive.com