6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

నగరంపై కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టి.....2 Y 70 days ago

మహానగరంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇరుకైన రోడ్లు... అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించడంతో పాటు మురుకు కుపంలా మారిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు నడుంబిగించింది సర్కార్.

క్యూకడుతున్న నేతలు..నోరుజారుతున్న కేజ్రీ....2 Y 70 days ago

దేశ రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఓ పక్క ఆప్ నేతలందరూ బీజేపీలోకి క్యూ కట్టేస్తుంటే మరోపక్క పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు నోరు జారుతూ విమర్శల పాలవుతున్నారు.

కేంద్రం ఆధీనంలోనే రైల్వేశాఖ....2 Y 70 days ago

రైల్వే శాఖ కేంద్రం ఆధీనంలోనే ఉంటుందని ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు.  రైల్వేలో PPP, FDI లను ఆహ్వానించడంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన.. రైల్వేను ప్రైవేటికరించే ఉద్దేశ్యం లేదన్నారు. సదస్సు అనంతరం సికింద్రాబాద్ స్టేషన్లో కొత్తగా రెండు ఏసీ రైలు సర్వీసులను ప్రారంభించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు మంత్రి.

 

భార్యను 270సార్లు పొడిచి చంపిన భర్త....2 Y 70 days ago

బ్రిటన్‌లో ఇదో ఘోరం! తాహీ హరోబా మనా అనే 37ఏళ్ల కర్కోటకుడు తన భార్యను అతి దారుణంగా 270సార్లు పొడిచి చంపాడు. ఆమె శరీరాన్ని ఓ కప్‌బోర్డులో కుక్కేశాడు. అంతేకాదు.. ఆమె మెదడులోకి ఎలక్ట్రిక్ డ్రిల్ మెషీన్‌ను జొప్పించి, చిత్రహింసలకు గురిచేశాడు. కేవలం చిన్న తగాదా వీరిద్దరి మధ్య ఈ ఘోరానికి కారణమైంది. తన భార్యను ఇతగాడు ఇంత దారుణంగా చంపుతున్న సమయంలో వారి నలుగురి పిల్లలు ఇంట్లోనే వున్నారని పోలీసులు చెప్పారు. బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌లో జరిగిన ఈ దారుణం స్థానికులను కలిచివేసింది. తన భార్యను తాను చంపానని మనా పోలీసులకు ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా చెప్పాడు. కోర్టులో ఇతడ్ని విచారించవలసి వుంది.

పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి....2 Y 70 days ago

కడప జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా రామాపురం నల్లగుట్టపల్లిలో పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధిత చిన్నారుల చికిత్స కోసం  ఆస్పత్రికి తరలించారు.

6టీవి ప్రేక్షకులకు సంక్రాంతి,కనుమ శుభాంకాక్షలు...2 Y 73 days ago

6టీవి ప్రేక్షకులకు సంక్రాంతి,కనుమ శుభాంకాక్షలు...

రేపిస్ట్ అరెస్ట్....2 Y 75 days ago

నగరంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పుడుతున్న కరడుగట్టిన రేపిస్ట్‑, ఆటోడ్రైవర్ రవిని నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‑కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో రవిని విచారిస్తున్నారు. అతడిపై పలు రేప్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నగరంలో ఒంటరిగా ఉన్న మహిళలను రవి తన ఆటోలో ఎక్కించుకుని... నగర శివారు ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు. అక్కడ మహిళను బెదిరించి వారి వద్ద నుంచి నగదు, బంగారం దొంగిలించి.. ఆపై వారిపై అత్యాచారం చేసి పరారైయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడు రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో బుధవారం నిందితుడు రవి పోలీసులకు చిక్కాడు.   

6టీవి ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు2 Y 75 days ago

6టీవి ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు

తమ్ముడు సెల్‌ఫోన్ ఇవ్వలేదని అక్క ఆత్మహత్య...2 Y 78 days ago

అడిగిన వెంటనే తమ్ముడు సెల్‌ఫోన్ ఇవ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ ఎంఏ.జావీద్ కథనం ప్రకారం.. అహ్మద్‌కాలనీకి చెందిన షేక్ చాంద్, రజియాబేగం దంపతులకు సోఫియాబేగం, సాద్ సంతానం. కూతురు సోఫియాబేగం(17) మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. శుక్రవారం సాయంత్రం సాద్ సెల్ ఫోన్‌తో ఆడుతున్నాడు. తనకు ఫోన్ అవసరం ఉందని సోఫియా అడిగింది. అతను ఎంతకీ ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవపడ్డారు. గమనించిన తల్లి వీరిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సోఫియా గదిలోకి వెళ్లి కొక్కానికి ఉరి వేసుకుంది. రాత్రయినా ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులుతలుపులు తెరిచి చూశారు. యువతి కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు అరెస్ట్...2 Y 79 days ago

బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు నజీర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.  దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న నజీర్ ...ఫజీయుద్దీన్ గ్యాంగ్ లో సభ్యుడు. నజీర్ పై అబిడ్స్, హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నాయి.

హుదూద్ నష్టంపై కేంద్రం ఆరా ...2 Y 79 days ago

విశాఖ హుదూద్ ప్రభావిత ప్రాంతాలలో పార్లమెంటరీ కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా తుపాను నష్టంపై కమిటీ అంచనా వేసింది. కాగా స్టీల్ ఫ్లాంట్ తో పలు ప్రాంతాల్లో కమిటీ సభ్యలు పర్యటించారు.

కాకతీయ మిషన్ పై కసరత్తు....2 Y 79 days ago

సచివాలయంలో కాకతీయ మిషన్ పై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు... చీఫ్ ఇంజినీర్లు... డీఈలు... ఈఈలతో హరీష్ రావు మిషస్ కాకతీయపై  చర్చించారు.  మొదటి దశలో ఆరు జిల్లాల్లో 200 పైగా చెరువులను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

పాలనను గాలికి వదిలి పర్యటనలా...2 Y 79 days ago

టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనను గాలికి వదిలి పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు కరువు... మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ప్రభుత్వం ఇంకా రుణాలు మాఫీ చేయకుండా చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఏడు నెలలు గడిచిన సర్కార్ ఇంత వరకు కరువు మండలాలను ప్రకటించలేదని విమర్శించారు.

పింఛన్ ఇవ్వడంలేదు సారూ.....2 Y 79 days ago

అర్హులైన తమకు పింఛన్ ఇవ్వడం లేదని వరంగల్ నగరపాలక సంస్థ ఎదుట వృద్దులు, వితంతువుల ఆందోళకు దిగారు. పింఛన్ ఫారాలు కార్పోరేషన్ కార్యలయం లో ఎవ్వరికి ఇవ్వాలో తెలియక లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమీషనర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యాటనలో ఉండటంతో వృద్దులు ఆందోళనకు దిగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

చేపల పంపకం కోసం రూ.11కోట్లు....2 Y 79 days ago

రాష్ట్రవ్యాప్తంగా 78 రిజర్వాయిర్లలో చేపలు పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం 11 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు. మత్స్యశాఖ అధికారులతో మంత్రులు పోచారం, హరీష్ రావు రివ్వ్యూ నిర్వహించచారు. జూన్‌ నాటికి రూ.200 కోట్ల చేప పిల్లలను పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. చేపల పెంపకంపై మత్స్యకారులకు 50శాతం సబ్సిటీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం...2 Y 79 days ago

స్వైన్  ఫ్లూ కారణం ఓ వ్యక్తి మృతు చెందాడు. చికిత్స కోసం హైదరాబాద్ కు తరలివస్తుండగా మార్గం మద్యలో  మృతి చెందాడు. కాగా మృతుడి స్వస్థలం పంగులూరు మండలం జాగర్లముడివారి పాలెంగా గుర్తించారు.

గోపాల గోపాల సినిమాపై కేసు నమోదు...2 Y 79 days ago

గోపాల గోపాల సినిమాపై ఓ వ్యక్తి  ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఓ వ్యక్తి సైఫదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  

డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్ట్....2 Y 79 days ago

టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది.  ఈ ఆఖరి మ్యాచ్ పై ఇరు జట్లు మ్యాచ్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నాచివరకు డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు

అబద్ధపు చంద్రబాబు...2 Y 80 days ago

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రోజుకో అబద్ధం చెబుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. కర్నూలు లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన జగన్ ..తానూ చంద్రబాబులా  అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే ఎన్నికల్లో గెలిచి ఉండేవాడినని అన్నారు.  ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు పాలించాలన్నది తన లక్ష్యమన్నారు జగన్

మెదక్ జిల్లాలో వింత సంఘటన...2 Y 80 days ago

మెదక్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట గ్రామ శివారులో ఉన్న పుట్ట పై ఓ నాగు పాము పడగ విప్పి 24 గంటలుగా నాట్యం చేస్తుంది. దీంతో నాగదేవతే ప్రత్యక్షంగా దర్శనమిస్తుందంటూ భక్తులు పాముకు పూజలు చేస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పామును చూడడానికి ప్రజలు తాండోపతండాలుగా వస్తున్నారు.


Copyrights © 2014 6tvlive.com