6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండెపోటు....2 Y 121 days ago

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స కోసం హైదర్ గూడ ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే రాజయ్యకు చికిత్సనందించిన డాక్టర్లు షుగర్  లెవల్స్, రక్తపోటు ,గుండె లెప్ట్ వాల్వ్ పనితీరులో తేడాను  గుర్తించారు. ఈ సందర్భంగా రాజయ్యను 24 గంటలపాటు ఐసీయూలో ఉంచాలని సూచించారు. 

వాఘా సరిహద్దులో అన్నదమ్ములు...2 Y 122 days ago

రిపబ్లిక్‌ డే సందర్భంగా..వాఘా సరిహద్దులో భారత్, పాక్‌ సైన్యం విన్యాసాలు అలరించాయి. ఈ సందర్భంగా పాక్‌ సైన్యానికి భారత దళాలు స్వీట్లు పంచిపెట్టాయి.

 

6టీ.వి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....2 Y 122 days ago

6టీ.వి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....

హైదరాబాద్ హౌస్ లో ఒబామా....2 Y 123 days ago

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామాపై మోడీ అవాజ్యమైన అభిమానం కురిపించారు.  హైదరాబాద్ హౌస్ లో ఒబామాతో కలిసి మోడీ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురు నేతలు వాక్ అండ్ టాక్ లో పాల్గొన్నారు. ఒబామాకు మోడీ స్వయంగా టీ కలిపి ఇచ్చారు. టీ తాగుతూ అగ్రనేతలు కీలకాంశాలపై చర్చించారు.  మోడీ ఆత్మీయ అతిథ్యానికి అగ్రరాజ్యాధినేత ముగ్దులయ్యారు.

 

మైనార్టీ నేతల్లారా భయం వద్దు...2 Y 123 days ago

ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో శాసన మడలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డితో కలసి ఆయన ముస్లిం నేతలతో భేటీ అయ్యారు. అక్రమణకు గురైన వక్ఫ్ భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ...ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు విషయంలో మైనార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న పల్లె..రాష్ట్రానికి నిధులు, పెట్టుబడులు సాధించేందుకే ఆపార్టీతో స్నేహం చేస్తున్నామని వివరించారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం రాజీనామా....2 Y 123 days ago

తెలంగాణ డిప్యూటీ సీఎం రాజీనామా చేశారు. వైద్యశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్య కొద్దిసేపటిక్రితమే రాజీనామా చేశారు.

రాష్ట్రపతి భవన్ లో పెద్దన్న....2 Y 123 days ago

అమెరికా అధ్యక్షుడు ఒబామా రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని స్వాగతం పలికారు.

భారత్ పర్యటనకు బయల్దేరిన ఒబామా...2 Y 124 days ago

గాలి విడుదల.....2 Y 124 days ago

ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం సాయంత్రం గాలి జనార్దనరెడ్డిని విడుదల చేశారు. జైలు నుంచి తన కాన్వాయ్ లో జనార్దనరెడ్డి చిరునవ్వుతో చేతులు ఊపుతూ వెళ్లారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011 సెప్టెంబర్ 5న సీబీఐ వర్గాలు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశాయి. శుక్రవారం విడుదల కావడంతో ఆయన మొత్తం 1,237 రోజులు వివిధ జైళ్లలో గడిపినట్లు అయ్యింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్‑లోని చంచల్‑గూడ జైల్లోనే చాలా కాలం ఉన్నారు. మధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దాంతో ఆయనను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ లో భూకంపం....2 Y 124 days ago

రాష్ర్ట రాజధానిలో అర్ధరాత్రి భూ ప్రకంపణలు భయాందోళనలు కల్గించాయి. శుక్రవారం అర్ధరాత్రి పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పాతబస్తీ పరిసరాలైన చార్మినార్, బహదూర్ పురా, హసన్ నగర్, కిషన్ బాగ్, కాటేదాన్, కాళీమందిర్, అత్తాపూర్, రాజేంద్రనగర్ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనాలు వచ్చాయి. అర్ధరాత్రి భూ ప్రకంపణలతో పాతబస్తీ ప్రజలు వణికిపోయారు. భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దశాబ్దాల తర్వాత భాగ్యనగరంలో భూమి కంపించటం గమనార్హం. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 1.8 గా నమోదు అయింది. -

 

వాట్సప్ తో తల్లి దగ్గరకు చేరుకున్నాడు....2 Y 124 days ago

ఫేస్ బుక్, వాట్సప్ పోలీసులకు ఎంతో తోడ్పడుతున్నాయి. నేరాల అదుపులోనే కాదు.. తప్పిపోయిన చిన్నారులను తిరిగి వారి తలిదండ్రులవద్దకు చేర్చేందుకు కూడా వాళ్ళు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌ని ఉపయోగించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..జార్ఖండ్‌కు చెందిన రూపేష్ అనే బాలుడు తన తల్లితో కలిసి గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జగన్నాధ స్వామి ఆలయానికి వచ్చాడు. అయితే అక్కడ తప్పిపోయి కేబీఆర్ పార్కు వద్ద తిరుగుతూ పోలీసుల కంటబడ్డాడు. బేలగా, భయంగా చూస్తున్న అతని వివరాలు తెలుసుకునేందుకు ఖాకీలు ప్రయత్నించినప్పటికీ భాష సమస్య కారణంగా రూపేష్ సరిగా చెప్పలేకపోయాడు. అయితే అతను తప్పిపోయాడన్న విషయం మాత్రం వారికి స్పష్టమైంది. అటు-తన కొడుకు కనిపించడం లేదని రూపేష్ తల్లి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు రూపేష్‌కు సంబంధించిన సమాచారాన్ని అతని ఫోటోతో సహా అన్ని పోలీసుస్టేషన్లకూ పంపారు. అలాగే బంజారాహిల్స్ పీఎస్ ఫేస్‌బుక్‌లోనూ అతని ఫోటోలు ఉంచారు. ఈ విషయాన్ని తిరుమలగిరి ఖాకీలు తెలుసుకుని రూపేష్ తల్లి తమకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలియజేశారు.దీంతో బంజారాహిల్స్ పోలీసు సిబ్బంది ఆ కుర్రాడిని తీసుకెళ్ళి అతడి తల్లికి అప్పగించారు. మొత్తానికి కథ సుఖాంతమైంది.           

 

చిన్నారి ప్రాణం తీసిన మూఢనమ్మకం.....2 Y 125 days ago

రంగారెడ్డి జిల్లాలో మూఢనమ్మకాలకు పదినెలల పసిపాప బలైపోయింది. జిల్లాలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం పూజ అనే చిన్నారిని కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మైలాల నర్సింహులు ఓ ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ అనే మహిళను తాడుతో బంధించి, ఆమె పది నెలల వయసు ఉన్న కూతుర్ని హత్య చేసినట్లు తెలుస్తుంది. నర్సింహులు గతంలోనూ క్షుద్రపూజలు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి పూజ మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కుర్చీ కోసం తెలుగు తమ్ముళ్ల తన్నులాట.....2 Y 127 days ago

కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికోసం తెలుగుతమ్ముళ్లు బాహాబాహికి దిగారు.  చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశంలో.. రెండు వర్గాలుగా చీలిన కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ వర్గానికే పదవి దక్కాలని ఒకరు, తమ నేతకే చైర్మన్ కుర్చీ ఇవ్వాలని మరొకవర్గం  పట్టుబట్టారు. గొడవ పెరగడంతో కుర్చీలతో దాడులు చేసుకున్నారు.

కూతురిపై తండ్రి అత్యాచారం...ఆపై హత్య.....2 Y 128 days ago

బాపట్ల మార్కెట్ యార్డులో విద్యార్థిని శవం శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థి ప్రత్యుష కేసు మలుపు తిరిగింది. పెంపుడు తండ్రి మురళి అత్యాచారం చేసి...విద్యార్థిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. శవం దొరికిన పర్సు ఆధారంగా తండ్రే హంతకుడని నిర్థారణకు వచ్చిన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మనం పోస్తే ఇంత..వాళ్లు పోస్తే అంత....2 Y 128 days ago

టూరిస్టులకు తమ దేశం స్వర్గ ధామమని పుంఖానుపుంకాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నా.. యధేచ్ఛగా పర్యాటకులు మాత్రం దోపిడికి గురవుతున్నారు. ఇప్పటికే ఆటోడ్రైవర్ల, హోటల్స్ ఇలా ఒకటేమిటి అందినకాడికి విదేశీ టూరిస్టుల నుంచి దోచుకుంటున్నారనే వార్తలు బలంగా వెలువడుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని కుంబల్‌ఘర్ ఫోర్టులో విచిత్రమైన విషయం వెలుగుచూసింది. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మూత్ర విసర్జనకు వెళ్లేందుకు ఇండియా టూరిస్టులకైతే ఐదు రూపాయలు, విదేశీ పర్యాటకులకైతే 100 రూపాయలు. ఈ మేరకు ఇక్కడో రేట్ కార్డు కూడా! ఇది చూసిన కొందరు ఔత్సాహికులు ఆ బోర్డుని ఫోటో తీసి సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పెట్టేశారు. ఇంకేముంది.. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి ఆస్ర్టేలియా, యూకె, యూఎస్ టూరిస్టుల వ్యవహారంలో ఇండియాలో వివక్ష కొనసాగుతోందంటూ మరోవైపు కామెంట్లు పడిపోతున్నాయి. ఈ తరహా విధానం ఇండియన్ పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా మరికొందరు వర్ణిస్తున్నారు. ఏదైతేనేంఈ వ్యవహారం సోషల్ నెట్‌వర్క్ సైట్లలో తీవ్ర దుమారం రేపుతోంది.

లోయలో పడిన ఆర్టీసీ బస్సు ...ఏడుగురు మృతి....2 Y 128 days ago

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి 100 అడుగుల లోతులో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన మరో 37 మందిని ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోగెనక్కల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. బస్సు లోయలో పడిపోవడం వల్ల సహాయక చర్యలకు కాస్త ఇబ్బందిగా మారింది. ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా వుండటం ఒకటైతే, మలుపు తిరిగే సమయంలో బస్సు వేగంగా వెళ్లడం మరొక కారణంగా క్షతగాత్రులు చెబుతున్నారు. ముమ్మాటికీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీన్నే నోటి దూలంటారు....2 Y 129 days ago

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బు తీసుకున్నా ఆప్ అభ్యర్థులకే ఓటేయాలని కోరారు. ఢిల్లీలో అవినీతి రహిత పాలన అందాలంటే ఆప్ కు ఓటేయడమే మార్గమని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండి పడింది. కేజ్రీవాల్ పై పుస్తకాన్ని రిలీజ్ చేసిన కాంగ్రెస్.. ఢిల్లీ ఓటర్లను కేజ్రీవాల్ అవమానించారని ఆరోపించింది. డబ్బులు తీసుకోమనడం క్రిమినల్ చర్య అని కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తూ ఆప్ ప్రజలను మోసగిస్తున్నారని తెలిపింది.

 

8 ఎఫ్ జీవోను తక్షణమే ఉప సంహరించుకోవాలి....2 Y 129 days ago

రాష్ట్ర విభజన నేపథ్యంలో కమల్ నాథన్ కమిటీ ఏర్పాటు చేసిన 8 ఎఫ్ జీవోను తక్షణమే ఉప సంహరించుకోవాలని  తెలంగాణ ప్రభుత్వ వైధ్యుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఈ జీవో వల్ల తెలంగాణ డాక్టర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని  ఆందోళన వ్యక్తం చేశారు.  తెలంగాణలో పని చేస్తున్న డాక్టర్లకు ప్రమోషన్ రాకుండా తీవ్ర నష్టం జరుగుతుందని ... వెంటనే జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

సిటీ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం....2 Y 129 days ago

సిటీ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. హైదరాబాద్ రోడ్ల స్థితి గతులపై సచివాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఆర్ అండ్ బీ... జీహెచ్‌ఎంసీ అధికారులు  ముఖ్యమైన కూడళ్లను గుర్తించారని .... రెండు నెలల్లో టెండర్లు పిలిచి రోడ్లను ఆధునీకరిస్తామని చెప్పారు

సీఎం పూటకోమాట మారుస్తున్నారు....2 Y 129 days ago

సీఎం కేసీఆర్ పూటకోమాట మారుస్తున్నారని సీపీఎం పార్టీ నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులు పర్యటించిన సీఎం ఇక్కడి బస్తీ వాసులకు రెండంతస్తుల బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి.. పాలమూరు టూర్ లో మాట మార్చారని ఆపార్టీ నేత శ్రీనివాస్ అన్నారు. మురికివాడల్లో ఇళ్ల నిర్మాణంపై పలు అనుమానాలున్నాయన్న ఆయన.. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


Copyrights © 2014 6tvlive.com