6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

తిరుపతిలో పోలీసుల కార్డన్ సర్చ...2 Y 51 days ago

తిరుపతి సివార్లలో పోలీసుల కార్డన్ సర్చ నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు విస్తృత స్ధాయి తనిఖీలు చేపట్టారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

సెక్రటేరియట్ కన్నా వీధుల్లోనే సౌకర్యం....2 Y 52 days ago

రేపు జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి అధిక్యం సాధించి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అస్థిరత నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కలగాలన్నారు. 49 రోజుల అప్ పాలన ఓ పీడకలలాంటిదన్న జైట్లీ.. సెక్రటేరియట్ కన్నా వీధుల్లోనే ఆప్ కి సౌకర్యంగా ఉంటుందన్నారు.

సర్వం సిద్ధం...2 Y 52 days ago

రేపు జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారు. డిల్లీ శాసనసభలోని 70 స్థానాలకు రేపు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12వేల 177 పోలింగ్ కేంద్రాలను ఎర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 95వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, 55వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నారు. 3వేల 9వందల సీసీ కెమెరాల సహాయంతో ఎన్నికలను పర్యవేక్షించనున్నట్టు ఢిల్లీ కమిషనర్ తెలిపారు.

ఎంగిలి మెతుకులా...2 Y 53 days ago

ఏపీకి 500కోట్లు కేటాయిస్తూ కేంద్రం చేసిన ప్రకటనను శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. విభజన సమయంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా ఎంగిలి మెతుకులు విసిరినట్టుగా 500కోట్లు కేటాయించడంపై మండిపడ్డారు. పార్లమెంటులో చేసిన చట్టాలను కూడా కేంద్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు రామచంద్రయ్య.

రెండో రాజధానికోసం డిమాండ్....2 Y 53 days ago

రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్ చేశారు. సమ్మర్ లేదా వింటర్ రాజధానిగా దాన్ని ప్రకటించాల్సిందిగా ఆయన కోరారు. రాజధాని కోసం కర్నూలు ప్రక్కన 30వేల ఎకరాల భూమి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గుడ్డిలోమెల్ల అన్న చందంగా ఉందని టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో మిగులు బడ్జెట్ లో ఉన్న టీఎస్ సర్కార్ ఏం చేస్తుందో తెలియడం లేదన్నారు.

పరామర్శయాత్రలో జగన్....2 Y 54 days ago

రాజమండ్రిలోని మోరంపూడి బస్సు ప్రమాద బాధితులను ఏపీ ప్రతిపక్షనేత జగన్ పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండపేటకు చెందిన శ్రీనివాస్ , విజయలక్షిలను కలిసి ఓదార్చారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన రాగి వెంకన్న కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. వాళ్లని కలిసేందుకు వెళ్లేప్పుడు మార్గమధ్యంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కారులో వెళుతూ పరిశీలించారు.

 

మౌనమేలనోయి..2 Y 54 days ago

ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం పాటిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సీ.రామచంద్రయ్య ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఓ పట్టుపట్టాల్సిన బాబు..  సొంత ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తే, ఏపీలో ప్రభుత్వాన్ని బీజేపీ.. పడగొడుతుందని సీఎంకు భయమేస్తుందేమోనని ఆరోపించారు. విభజన చట్టంలో ఏపీ ప్రత్యేక హోదాపై.. కాంగ్రెస్ ఎప్పుడో హామీ ఇచ్చినా.. బీజేపీ ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందన్నారు రామచంద్రయ్య.

 

తాత్కాలిక రాజధానిపై నిర్ణయం తీసుకుంటాం.....2 Y 54 days ago

ఏపీ తాత్కాలిక రాజధానిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. మంగళగిరి దగ్గర ఉన్న అమరావతీ టౌన్ ఫిప్ ను కానీ.. తుళ్ళూరును లో కానీ ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపారు. మంగళగిరి మండలం నవులూరు వద్ద ఉన్న 120 ఎకరాల అమరావతి టౌన్ షిప్పును పలిశీలించిన నారాయణ.. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రాజధాని ఎంపిక జరుగుతుందని చెప్పారు.

పెళ్లింట విషాదం ...2 Y 54 days ago

విజయవాడ తొట్లవల్లూరు లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వల్లూరివారి పాలెం వద్ద కేసీబీ కెనాల్ లోకి పెళ్లిబృందం కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెళ్లి కూతురు తో పాటు, ఒకరు మృతి చెందగా మరోకరు గల్లంతయ్యారు. గాయపడిన వారిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

కూలిన మరో విమానం.....2 Y 54 days ago

విమాన ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్ రాజధానిలో ఓ విమానం నదిలో కుప్పకూలింది. ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన  విమానం తైవాన్ నదిలో కూలింది.  ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానంలో 58మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా విమానంలో చిక్కుకున్నవారిలో పదిమందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదానికి ముందు విమానం ఒక రోడ్డు బ్రిడ్జ్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. దాంతో విమానం అదుపు తప్పి నదిలో కూలింది. కాగా  విమానం దాదాపు నదిలో మునిగిపోయే దృశ్యాన్ని  తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చిత్రీకరించింది.  గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు...2 Y 55 days ago

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటర్ పెట్రోల్  ధర రూ. 3.00 , డీజిల్ రూ.2.75 పైసలు తగ్గింది. అయితే కొత్తగా  వచ్చిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి  అమల్లోకి వస్తాయి.

వెంటనే ఎన్నికలను నిర్వహించండి....2 Y 56 days ago

హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ ఎంసీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే జీహెచ్ ఎంసీ ఎన్నికలను జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య సమంగా ఉండేలా చూడాలని తెలిపారు

 

సిరీస్ ను కైవసం చేసుకున్న ఆసిస్.... 2 Y 57 days ago

ముక్కోణపు సిరీస్ ను ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 278 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 39.1 ఓవర్లో 166 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

జనంపైకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు....2 Y 57 days ago

రాజమండ్రి మైరం పూడివద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు కారునుఢీకొని జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగుమృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఏపీను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ.....2 Y 58 days ago

విజయనగరం జిల్లాలో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు. విశాఖ కేజీహెచ్ కి తరలింపు.ఇప్పటికీ అందుబాటులో లేని ఎన్ 95 మాస్క్ లు. విశాఖకు బయల్దేరిన మంత్రులు పల్లే,గంటా.ఒంగోలులో స్వైన్ ఫ్లూ లక్షణాలతో మహిళ మృతి 

వైట్ హౌస్ లోనే మీ తల తీసేస్తాం....2 Y 60 days ago

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడొకరు హెచ్చరికాలు జారీ చేశారు. వైట్ హౌస్ లోనే  బబమా తల తీసేస్తామని , అమెరికాను ముస్లిం దేశంగా మార్చేస్తామని కూడా అన్నాడు. కుర్దిష్ సైనికుడిని అత్యంత క్రూరంగా చంపిన వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యానాలు చేశాడు.

గూగుల్, యాహూపై సుప్రీం కోర్టు ఆగ్రహం...2 Y 61 days ago

గూగుల్ ఇండియా, యాహూ వెబ్ సైట్లలో లింగనిర్ధారణ పరీక్షలకు సంబంధించి అడ్వర్టైజ్ మెంట్లు రావడంపై సుప్రీం కోర్టు మండిపడింది. తక్షణమే అలాంటి ప్రకటనలు తొలగించాలని గూగుల్, యాహూ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. లింగనిర్ధారణ పరీక్షలు భారతదేశంలో చట్ట వ్యతిరేకమని సుప్రీం పేర్కొంది.

ఇస్లామిక్ తీవ్రవాదుల చర్యలపై ప్రధాని ఆగ్రహం...2 Y 61 days ago

ఇస్లామిక్ తీవ్రవాదుల చర్యలపై జపాన్ ప్రధాని శింజో అబే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదులో ఒక జపాన్ దేశీయుడ్ని మరో జోర్డాన్ పైలెట్ ను బందీలుగా చేసుకుని చంపబోతున్నట్లు ఓ వీడియో పంపారు. 24 గంటల్లో 200 మిలియన్ డాలర్లు ఇవ్వాలనే లేకుండా బందీలను చంపేస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన జపాన్ పీఎం దీనిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. బందీలను క్షేమంగా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

సమస్యలు కొనితెచ్చుకోవడం అంటే ఇదే....2 Y 61 days ago

వివాదాస్పద వ్యాఖ్యలతో ఆప్ అధినేత కేజ్రీవాల్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చే డబ్బు తీసుకుని ఆప్ కు ఓటేయాలని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఈసీ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆయన మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించింది.

జబర్ధస్త్ వేణు అరెస్ట్.... 2 Y 62 days ago

కమెడియన్ జబర్థస్త్ వేణును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ కార్యక్రమంలో ఓ సామాజిక వర్గాన్ని దూషించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. 


Copyrights © 2014 6tvlive.com