6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

సీఎం కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లేఖ...2 Y 105 days ago

సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లేఖ రాశారు. రాజీవ్ రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డవారికి.. తిరిగి పనులు అప్పగించడం సరికాదన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడ ఏపీ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించడమేంటని ప్రశ్నించారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అల్వాల్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు జీవన్ రెడ్డి.

ఇద్దరు చంద్రన్నలు ప్రజల్ని మోసం చేస్తున్నారు.... 2 Y 105 days ago

అమలు కానీ హామీలతో ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ. ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటేనే.. రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 

మీ పాకులాట మానుకోండి...2 Y 105 days ago

టీఆర్ఎస్, టీడీపీ లపై పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నీటివాటాలపై పోరాడడం మాని ... సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతుందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ... రాష్ట్రానికి ఇవ్వాల్సిన సాగునీరిచ్చి ... పర్యటించాలని హితవు పలికారు.

ముగ్గురు కోసమే చంద్రబాబు పర్యటన....2 Y 105 days ago

ముగ్గురు నాయకుల కోసమే చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నాడని ఆరోపించారు ఎంపీ కవిత. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత.. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. బొగ్గు కార్మికుల ఐటి మినహాయింపు కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు కవిత.

టీడీపీ అరిగిపోయిన పార్టీ...2 Y 105 days ago

ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ముసుగులో టీఆర్ఎస్ నేతలే టీడీపీ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఖండించారు. తాము చంద్రబాబు సభను అడ్డుకోవట్లేదని....తాము అడ్డుకోవాలని భావిస్తే ఎలా ఉంటుందో చరిత్రను గుర్తు చేసుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. టీడీపీ అరిగిపోయిన, పారిపోయిన పార్టీ అని...దాన్ని ప్రజలు పట్టించుకోవటం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందని ఆయన అన్నారు.

సీఎం ఆంధ్రోళ్లను అవమానిస్తున్నారు...2 Y 105 days ago

వరంగల్ చంద్రబాబు సభలో టీఆర్ఎస్ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి మాటల తూటాలు పేల్చారు. టీడీపీ పార్టీలో పుట్టి పెరిగి పదవులు అనుభవించి తెలగుదేశం పార్టీనే విమర్శిచడం సబబు కాదన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ  అని ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నరన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి విషయంలో ఆంద్రోళ్లను అవమాన పరుస్తున్నరన్నారు. కేటీఆర్ కు ఉన్న ఆంద్ర పేరును తొలగిస్తావా అంటూ సవాలు విసిరారు.

 

స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం...ఏజీఎం మృతి....2 Y 105 days ago

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ మిషన్ లో పడి కంపెనీ ఏజీఎం అరవింద్ మృతి చెందారు. ఉద్యోగుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.  

16ఏళ్లుగా జరుగుతుంది....2 Y 106 days ago

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకల వేట కేసులో ఈ నెల 25న తుది తీర్పు వెలువడనుంది. 16 ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించిన విచారణ జోధ్ పూర్ కోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తుది తీర్పును ఫిబ్రవరి 25న వెలువరించనున్నారని కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంఖ్లా వెల్లడించారు.

కోరలు చాచిన మహమ్మారి...2 Y 106 days ago

గుంటూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ మహమ్మారి కోరలు చాస్తోంది. వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వినుకొండకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతిచెందాడు. జిల్లాలో మరో ముగ్గురికి ఈ వ్యాధి నిర్థారణ అయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్ ఫ్లూ బాధితుల కోసం ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

కిలాడీ జాయింట్ కలెక్టర్....2 Y 106 days ago

జాయింట్ కలెక్టర్ అవతారమెత్తి.. పలువుర్ని మోసగించిన మాయలేడీ గుట్టురట్టైంది. ఉద్యోగాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించిన కిలాడీ శైలు అలియాస్ హైమ అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్ జాయింట్ కలెక్టరని చెప్పుకుంటూ.. పలువురి దగ్గర ముప్పై నుంచి యాభై వేల వరకు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో SR NAGAR పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేశారు. విషయం తెలియడంతో సనత్ నగర్, S.R NAGAR, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లకు బాధితులు తరలివచ్చారు. గతంలోనూ కిలాడీ.. పెళ్లి పేరుతో చాలామందిని మోసం చేసినట్లు తెలుస్తోంది.

అమ్మే హత్యచేసింది....2 Y 106 days ago

విజయనగరంజిల్లా చీపురుపల్లి అన్నపూర్ణ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పొత్తిళ్లలో నవమాసాలు మోసిన కన్న తల్లే..పసి పాపను పొట్టన పెట్టుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బావిలో పడేసింది.  భర్త వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె దారుణానికి ఒడిగట్టింది.

అల్లుడే హంతకుడా...?2 Y 106 days ago

నెల్లూరు జిల్లాకు చెందిన సాయిసింధు అనే మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఉదయ్ కుమార్ తో ఆమెకు వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడే బాధ్యుడని సాయి సింధు తల్లిదండ్రులు చెబుతున్నారు.

హైదరాబాద్ సైదాబాద్ లో పోలీసుల కార్డన్ సెర్చ్.....2 Y 106 days ago

హైదరాబాద్ సైదాబాద్ లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సింగరేణి కాలనీలో 350 మంది పోలీసులతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 18 మందిని అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11వేల గుడుంబా ప్యాకెట్లు,170 గ్యాస్ సిలిండెర్లు,18 గ్యాస్ ఫిల్లింగ్ మిషన్లు స్వాధీన పరుచుకున్నారు.

మొరగొద్దంటూ ఆదేశాలు జారీ చేసిన కోర్టు....2 Y 107 days ago

మొరగటమే ఆ కుక్క పాలిట నేరంగా మారింది. ఇకపై నిర్దేశించిన సమయాల్లోనే మొరగాలని ఆ శునకాన్ని కోర్టు ఆదేశించిన విచిత్ర సంఘటన క్రొయేషియాలో జరిగింది. క్రొయేషియా దేశంలోని పెరెజ్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో ఆంటన్ సిమునోవిక్‌కు ఓ కుక్క ఉంది. దాని పేరు మెడో(3).
అది రాత్రి వేళల్లో అకారణంగా మొరుగుతుండటంతో విసిగిపోయిన పొరుగింటాయన... సిమునోవిక్‌కు మొరపెట్టుకున్నాడు. కుక్క గోల కారణంగా నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన  ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయమూర్తి...బోనెక్కిన ఆ కుక్కను.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తన గదిలోనే ఉండాలని, ఆరు బయట తిరగరాదని ఆదేశించారు. లేకుంటే సదరు యజమాని జరిమానాగా మూడు వేల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు....2 Y 107 days ago

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. తెలంగాణ డిస్కంలు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి. వినయోగదారులపై వెయ్యి 88వేల కోట్ల ఛార్జీలు పెంచుతామని ప్రతిపాదించాయి.. 2015-16 సంవత్సరంలో విద్యుత్ ఆదాయ అవసరం 26వేల 473 కోట్లు కాగా ప్రస్తుత ఛార్జీలతో వస్తున్న ఆదాయం 18వేల 903 కోట్లని డిస్కంలు తెలిపాయి. ఇక వంద యూనిట్ల లోపు గృహ వినియోగదారులను పెంపు నుంచి మినహాయించినట్లు డిస్కంలు తెలిపాయి.

ఇద్దరు చిన్నారులను చంపిన కసాయి తల్లి....2 Y 107 days ago

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ చంద్రపురికాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులు కసాయి తల్లి నీటి సంపులో ముంచి చంపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘట స్థలానికి చేరుకోని కుటుంబ కలహాలే కారణమంటూ కేసు నమోదు చేసుకున్నారు.

ఢిల్లీ పోరులో ఆమ్ ఆద్మి విజయం.....2 Y 107 days ago

ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మి పార్టీ విజయం సాధించింది. 63 స్ధానాల్లో ఆప్ గెలుపోందింది. బీజెపీ మాత్రం కేవలం 7 స్ధానాలతో సరిపెట్టుకుంది. ఈ గెలుపుతో ఢిల్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. ఆమ్ ఆద్మి పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఒటమి దిశగా కిరణ బేడి....2 Y 107 days ago

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అనేక స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి దిశగా పయనిస్తున్నారు. తాను పోటీలో నిలిచిన కృష్ణానగర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో కొనసాగినా, ఆ తర్వాత వెనుకబడ్డారు. ఈ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎస్.కె.భగ్గా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే సదర్ బజార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థి అజయ్ మాకెన్ వెనుకంజలో వున్నారు. ఆయన మీద ఆప్ అభ్యర్థి సోమ్ దత్ ముందంజలో వున్నారు. ఉదయం 9.30 సమయంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 51 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. భారతీయ జనతా పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ 1 స్థానంలో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు.   

విజయం దిశగా ఆమ్ ఆద్మి.....2 Y 107 days ago

మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆమ్ ఆద్మి పార్టి. ఇప్పటికి మెజరిటీ సీట్లతో దూసుకుపోతున్న ఆప్. సంబరాలో ఆప్ కార్యకర్తలు  

రోడ్డుప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం....2 Y 109 days ago

పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం పాలయ్యారు. చెట్టును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో బద్రి మృతి చెందగా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి.  అయితే ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు కూడా మృతి చెందాడు.  ప్రస్తుతం ఆయన భార్య, చిన్న కుమారుడు పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు నుంచి విజయవాడకు తరలించేందుకు యత్నిస్తున్నారు. ఆయన ఛాతికి స్టీరింగ్ బలంగా నొక్కుకోవడం వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.  ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ రీడర్ గా కొనసాగుతున్న ఆయన మృతి ఆకస్మిక పట్ల 6TV  మీడియా గ్రూపు నివాళులర్పిస్తుంది.


Copyrights © 2014 6tvlive.com