6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

మరి కాసేపట్లో ఏపీ బడ్జట్.....2 Y 77 days ago

 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం 12:15 గంటలకు 2015- 16 సంవత్సరానికిగాను బడ్జె్ట్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ పత్రాలతో మంత్రి యనమల అసెంబ్లీకి చేరుకున్నారు. ఏపీ బడ్జెట్ రూ.1.13 లక్ష కోట్లు అని అంచనాలొస్తున్నాయి. దాదాపు రూ. 35 వేల కోట్లు ప్రణాళిక వ్యయం, రూ. 80 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయం అని తెలుస్తోంది. ద్రవ్యలోటు కింద రూ.17,500 కోట్లు ఉంటుందని మరో అంచనా. ఇక రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కింద రూ.45 వేల కోట్లు, పన్నులు కాకుండా ఇతర ఆదాయం రూ.9,900 కోట్లు ఉంటుందని సమాచారం. కేంద్రం నుంచి రాష్ర్టానికి అందే పన్నుల వాటా రూ.22,600 కోట్లు, రెవెన్యూ లోటు రూపంలో రూ.6,600 కోట్లు వస్తాయని అధికారికవర్గాలు అంచనా వేస్తున్నాయి. మండలిలో మంత్రి నారాయణ ఈ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు.

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.....2 Y 77 days ago

ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. వైసీపీ అవీనీతి అంత ఇంత కాదని అచ్చంనాయుడు పేర్కోన్నారు.

రాష్ట్ర అభివృధిపై క్లియర్ విజన్....2 Y 78 days ago

రాష్ట్ర అభివృధిపై క్లియర్ విజన్ ఉంది. 2029 నాటికి ఏపీని టాప్ ప్లేస్ లో నిలబెడతామన్న చంద్రబాబు

పాకిస్తాన్ పై నిప్పులు చెరుగుతున్న భారత బౌలర్లు....2 Y 102 days ago

ప్రపంచకప్ లో భాగంగా ఆడిలైడ్ లో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు.  ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో 102 పరుగుల వద్ద షహజాద్ (47)వికెట్ కోల్పోగా ,వెను వెంటనే షోయబ్ ఉక్సాద్ (0)  అవుటవ్వగా ..జడేజా బౌలింగ్ లో అక్మల్(0) అయి పరుగులేమి చేయకుండా వెనుదిరిగారు. ప్రస్తుతం పాక్ స్కోర్  27 ఓవర్లలో 119 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం షాహీద్ అఫ్రిది, మిస్బాహుల్ లు కొనసాగుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలడు...2 Y 102 days ago

శ్రీకాకుళంలో భారీ పేలడు సంభవించింది. బాణా సంచాకేంద్రంలో పేలుడసంభవించి 8మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

 

పాకిస్థాన్ విజయ లక్ష్యం 301....2 Y 102 days ago

అడిలైడ్ వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పెవీలియన్ చేరినా.. మరో ఓపెనర్ శికర్ ధావన్ తో కలిసి కోహ్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు 129 పరుగులు జోడించాడు. 73 రన్స్ చేసిన ధావన్ రనౌట్ రూపంలో పెవీలియన్ చేరాడు. మిడిలార్డర్ ప్లేయర్ సురేష్ రైనాతో కలిసి విరాట్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇదే క్రమంలో కోహ్లీ కెరీర్ లో 22వ సెంచరీ కంప్లీట్ చేశాడు. రైనా కూడా మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయి డీలా పడినట్లు కనిపించినా... కెప్టెన్ ధోని తనదైన మార్క్ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

 

ధోనీ అవుట్...2 Y 102 days ago


సురేష్ రైనా అవుట్...2 Y 102 days ago

ప్రపంచకప్ -15 లో భాగంగా ఆడిలైడ్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 284 పరుగుల వద్ద సురేష్ రైనా (74) ఔట్ అయ్యాడు. 

విరాట్ కోహ్లీ అవుట్....2 Y 102 days ago

ప్రపంచకప్ -15 లో భాగంగా ఆడిలైడ్ వేదికగా భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 273 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (107) ఔట్ అయ్యారు.

సురేష్ రైనా అర్థసెంచరీ.... 2 Y 102 days ago

ప్రపంచకప్ భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ సురేష్ రైనా అర్థసెంచరీ  సాధించాడు. టీమిండియా 43 ఓవర్లలో 245/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. కోహ్లి 102, రైనా 50 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

కోహ్లీ సెంచరీ....2 Y 102 days ago

అడిలైడ్ వన్డే టీమిండియా భారీ స్కోర్ ధిశగా సాగుతొంది. టాప్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఆకాశమే హద్దులా చెలరేగుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ  దూకుడుగా ఆడుతూ కెరీర్ లో 22వ సెంచరీ సెంచరీ నమోదు చేశాడు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఫస్ట్ సెంచరీ కొట్టాడు. మిడిలార్డర్ ప్లేయర్ సురేష్ రైనా కూడా పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 40 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసిన రైనా.. ధాటిగా బ్యాటింగ్ చేశాడు

శిఖర్ ధావన్ అవుట్...2 Y 102 days ago

పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ రనౌట్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ అర్థసెంచరీ....2 Y 102 days ago

 ప్రపంచకప్ లో భాగంగా ఆడిలైడ్ లో  దాయాది దేశం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ చేశాడు.

శిఖర్ ధావన్ అర్థసెంచరీ ...2 Y 102 days ago

 ప్రపంచకప్-15 లో భాగంగా ఆడిలైడ్ లో భారత్-పాకిస్తాన్ ల మధ్య జరగుతున్న మ్యాచ్ లో శిఖర్ ధావన్ ఆఫ్ సెంచరీ చేశారు.

జల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ భేటి.....2 Y 103 days ago

జల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ తో భేటీ అయ్యారు. నాగర్జునసాగర్ జలలాపై చర్చ జరుపుతున్నారు. ఈ భేటికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు,విద్యాసాగర్ రావు తదితరులు హాజరయ్యారు

చేష్టలుడిగి చూస్తున్న సర్కార్...2 Y 104 days ago

సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఎన్నికల హామీనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. మెదక్ జిల్లాలోనే 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ... సర్కార్ చేష్టలుడిగి చూస్తుందని మండిపడ్డారు.

రేవ్ పార్టీలో 72మంది అరెస్ట్...2 Y 104 days ago

బార్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఓ హోటల్లో అర్ధరాత్రి దాటాకా లిక్కర్, బెట్టింగులతో రేవ్ పార్టీ చేసుకుంటున్న యువతీ, యువకులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పార్థ్ ఇన్ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై రైడ్ చేసి 72 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ఆరుగురు యువతులు వున్నారు. ఇదే రేవ్ పార్టీలో పట్టుబడిన 66 మంది బెట్టింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడులు జరిగిన సమయంలో అక్కడున్నవారంతా అభ్యంతరకర రీతిలో వుండటం, బార్ లైసెన్స్ లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా హోటల్లో లిక్కర్ సర్వ్ చేయడం, బెట్టింగులు వంటివి నేరం అని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు

బాంబు పేలుడు ధాటికి 22మంది మృతి....2 Y 104 days ago

పాకిస్థాన్ లో తీవ్రవాదులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. పెషావర్ లోని ఓ ప్రార్థనామందిరం వద్ద జరిగిన పేలుడులో 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. హయతాబాద్ లోని ఓ మసీదులోకి ప్రవేశించిన తీవ్రవాదులు.. ప్రార్థనలు చేస్తున్న వారిపై గ్రనేడ్లతో దాడి చేశారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రవాదులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగినట్టు సమాచారం. పేలుడులో గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

  

నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత....2 Y 104 days ago

నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కుడికాల్వ ద్వారా 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయంత్నం చేసింది. అయితే నీటిని విడుదల చేయకుండా తెలంగాణ నీటిపారుదల అధికారులు అడ్డుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పటు చేశారు. అయితే సమాచారం అందుకున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి డ్యామ్ వద్దకు చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు.

పట్టాలుతప్పిన ఇంటర్ సిటీ ..10మంది మృతి....2 Y 104 days ago

కర్ణాటక హోసూరు వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.   ఈ దుర్ఘటనలో 10మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరో వందమందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది


Copyrights © 2014 6tvlive.com