6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

ఫోన్ లక్కీ నంబరు పేరుతో..1 Y 83 days ago

 హలో సార్‌ నమస్కారం. మీ ఫోన్‌ నంబర్‌కు లక్కీ డ్రాలో మొదటి బహుమతి వచ్చింది. మీరు కొంత నగదు జమచేస్తే మీకు ప్రముఖ కంపెనీ సెల్‌ ఫోన్‌ పంపిస్తాం అంటూ నగరానికి చెందిన ఆటోడ్రైవర్‌కి ఫోన్ చేసి మోసం చేశారు. ఫిలింనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ రాజు ఠాకూర్‌కు ఇటీవల ఫోన్ వచ్చింది. మా కంపెనీ సిల్వర్‌జూబ్లీ సందర్భంగా తీసిన లక్కీడ్రా ద్వారా మీ ఫోన్‌ నెంబర్‌ ఎంపికైందని తెలిపారు. పార్శిల్‌ అందుకున్న తర్వాతే డబ్బు చెల్లించాలని కోరి అతడి నుంచి చిరునామా సేకరించారు. పోస్టాఫీసు నుంచి పార్శిల్‌ వచ్చిందని రాజుకు ఫోన రావడంతో అక్కడికి వెళ్లిన రాజుఠాకూర్‌ రూ.2500 చెల్లించి పార్శిల్‌ తీసుకున్నాడు. పార్శిల్‌ విప్పి చూడగాకోగా అందులో ఆయుర్వేదిక్‌ మందులు ఉండడంతో కంగు తిన్నాడు.

తుక్కుగా కొట్టి.. తుదిపోరుకు1 Y 83 days ago

 ప్రొ కబడ్డీలో పట్నా పైరేట్స్‌, యు ముంబా దుమ్ముదులిపాయి. సీజన్‌ ఆరంభం నుంచి తమ ఆధిపత్యం చాటుతూ వస్తున్న ఈ రెండు జట్లూ.. శుక్రవారం సెమీఫైనల్స్‌లోనూ జోరు కొనసాగించాయి. పట్నా 40-21తో పుణెరి పల్టాన్‌ను, ముంబా 41-29తో బంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసి తుదిపోరుకు సిద్ధమయ్యాయి. శనివారం ఫైనల్‌ జరుగుతుంది. లీగ్‌ దశలో పట్నా, పుణెరి తలపడిన రెండు మ్యాచ్‌లు టైగా ముగియడంతో.. సెమీస్‌లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదనే అనుకున్నారంతా. కానీ పుణెరి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెత్త ప్రదర్శన చేసింది. ఓవైపు పట్నా స్టార్‌ ఆటగాడు పర్దీప్‌సింగ్‌ (10) వరుసగా సఫల రైడ్లు చేస్తుంటే.. వచ్చిన రైడర్లను వచ్చినట్టే పట్టేశారు ఆ జట్టు డిఫెండర్లు. ఫలితంగా 8వ నిమిషానికే పుణెరి ఆలౌటై 3-11తో వెనుకబడింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే మరోసారి ఆ జట్టుకు దిమ్మదిరిగే షాకిచ్చాడు పర్దీప్‌. ఒకే రైడ్‌లో అతడు నలుగుర్ని ఔట్‌ చేసి పుణెరిని ఆలౌట్‌ చేయడంతో.. పట్నా ఏకంగా 20-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్లూ జోరు చూపించడంతో ప్రథమార్ధాన్ని 25-7తో ముగించింది. ఆ తర్వాత పుణెరి కెప్టెన్‌ మన్‌జీత్‌ (5) డిఫెన్స్‌లో, ఆల్‌రౌండర్‌ దీపక్‌నివాస్‌ (6) రైడింగ్‌లో రాణించి ఓ దశలో 18-29తో పాయింట్ల అంతరాన్ని కొద్దిగా తగ్గించారు. ఐతే పట్నా డిఫెండర్లు సందీప్‌ నర్వాల్‌ (5), వినోద్‌ కుమార్‌ (4).. పుణెరి రైడర్లను పట్టేస్తూ పుణెరికి అవకాశం లేకుండా చేశారు. ఇక యు ముంబా, బంగాల్‌ వారియర్స్‌ మధ్య సెమీఫైనల్‌ కూడా ఏకపక్షంగానే సాగింది. ముంబా స్టార్‌ రైడర్‌ రిషాంక్‌ దేవడిగ (13) మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

నకిలీ పత్రాలతో 2.40 లక్షల మందికి బురిడీ1 Y 83 days ago

పాకిస్థాన్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దొంగ పట్టాలతో పలు దేశాల విద్యార్థుల్ని మోసం చేసిన వైనమిది. అమెరికా విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ డిగ్రీల్ని జారీ చేయడం ద్వారా వివిధ దేశాలకు చెందిన 2.40 లక్షలమంది విద్యార్థుల నుంచి రూ.14 వేల కోట్లు దండుకున్నారనే ఆరోపణలపై పాక్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో, మరో 18 మందిపై శుక్రవారం అభియోగాలు మోపారు. కరాచీలోని అక్సాక్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆన్‌లైన్‌ కోర్సుల పేరిట నకిలీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల డిగ్రీల్ని కట్టబెట్టడం ద్వారా కోట్ల రూపాయాల్ని సముపార్జించినట్లు తేలింది. సంస్థ సీఈవో షోయబ్‌ అహ్మద్‌ షేక్‌, మేనేజర్లు విఖాస్‌ అతిఖ్‌, జీషన్‌ అన్వర్‌, మొహ్మద్‌ సాబిర్‌, జీషన్‌ అహ్మద్‌ తదితర ఉద్యోగులపై గతంలోనే ఆరోపణలు మోపారు. కల్పిత విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ డిగ్రీలు, డిప్లొమాలు, అక్రెడిటేషన్‌ ధ్రువపత్రాలు రూపొందించి, అమ్మారనే ఆరోపణలు మోపినట్లు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వెల్లడించింది.కంపెనీ సీఈవో, ఇతర సీనియర్‌ అధికారులపై దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ సెషన్స్‌ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది.

సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు 1 Y 83 days ago

 సహకార బ్యాంకుల తరఫున 800 సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటుచేస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టీఎస్‌క్యాబ్‌) ఛైర్మన్‌ కె.రవీందర్‌రావు చెప్పారు. బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు పురోగతికి చేస్తున్న కృషిని వివరించారు. త్వరలో సహకారబ్యాంకు ఖాతాదారులకు ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు కల్పిస్తామన్నారు. వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, 6 నెలల వ్యవధిలో రూ.112 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు చెప్పారు. ఈఏడాది చివరిలోగా 35లక్షల మంది ఖాతాదారులకు రూపేకార్డులిస్తామన్నారు. తమ బ్యాంకులున్నచోట వంద ఏటీఎంలు, అవిలేని ప్రాంతాల్లో సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత 10 నెలల్లో అద్భుత ఫలితాలు సాధించామని, ఈఏడాది డివిడెండ్‌ కూడా ప్రకటించనున్నామని పేర్కొన్నారు. ఈఏడాది సహకార బ్యాంకుల వ్యాపార టర్నోవర్‌ రూ.5,800 కోట్లకు చేరిందని, రూ.4,553 కోట్ల రుణాలిచ్చినట్లు చెప్పారు. 

‘వీవీ ప్యాట్‌’తో మరింత పారదర్శక ఓటింగ్‌1 Y 83 days ago

ఎన్నికల ప్రక్రియలో ఓటరు నమ్మకాన్ని మరింత పెంచేందుకు ‘వీవీప్యాట్‌’ పరికరాన్ని ఈసీఐఎల్‌ రూపొందించింది. ఈ పరికరం ద్వారా ఓటరు తానెవరికి ఓటు వేశాననేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)లకు అనుబంధంగా నూతనంగా రూపొందించిన ‘ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌’(వీవీ ప్యాట్‌) పరికరాన్ని ఈసీఐఎల్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రదర్శించారు. ఈసీఐఎల్‌ సీఎండీ పి.సుధాకర్‌ ఈ పరికరం పనితీరును వివరిస్తూ.. ఓటు హక్కు వినియోగించుకున్నాక ఎవరికైతే ఓటు వేశారో ఆ అభ్యర్థి పేరు, గుర్తు పరికరంలో అమర్చిన అద్దంలో చీటీపై ముద్రితమై ఆరు క్షణాల పాటు కన్పిస్తుందని తెలిపారు. ఆ చీటీ తరువాత కట్‌ అయి పరికరంలోని డబ్బాలో నిక్షిప్తమవుతుందని వివరించారు. ఓటింగ్‌ యంత్రం చూపించిన ఓట్ల సంఖ్య, ముద్రితమైన చీటీల సంఖ్య ఒక్కటే ఉంటుందన్నారు. ఈ పరికరాన్ని ఈవీఎంలకు అనుసంధానం చేస్తారని చెప్పారు. ఈసీఐఎల్‌ శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పరికరం ట్యాపరింగ్‌ అయ్యే అవకాశమే లేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ వదంతుల్లో వాస్తవం లేదన్నారు. ఖమ్మంలో జరుగుతున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వీవీ ప్యాట్‌లను ఎన్నికల సంఘం వినియోగిస్తుందని, ఇందుకు 40 పరికరాలను పంపించినట్లు వివరించారు. ఎన్నికల సంఘం అనుమతితో 2019 ఎన్నికల్లో అన్ని ఈవీఎంలకు ‘వీవీప్యాట్‌’లను అమర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ధోని మాటలతో బిడియం ఎగిరిపోయింది1 Y 83 days ago

 ఆసియా కప్‌లో తొలి వికెట్‌ తీసినప్పుడు కెప్టెన్‌ ధోని దగ్గరకు వచ్చి ‘నువ్వు ఒత్తిడిలో బౌలింగ్‌ చేస్తున్నట్లు ఉన్నావ్‌.. ముందు దాన్ని వదిలి స్వేచ్ఛగా బౌలింగ్‌ చెయ్‌’ అని సలహా ఇచ్చినట్లు భారత ఆల్‌రౌండర్‌ పవన్‌ నేగి వెల్లడించాడు. యూఏఈతో గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌తో పవన్‌ నేగి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మొదటి సారి బౌలింగ్‌ కోసం బంతిని అందుకున్నప్పుడు బిడియంతో ఒత్తిడికి గురయ్యానని.. దీంతో కొన్ని బంతులు గతితప్పాయని వివరించిన పవన్‌ నేగి.. కెరీర్‌లో తొలి వికెట్‌ తీసిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు.

భారతీయుల నమ్మకం.. అమెజాన్‌పైనే.. 1 Y 83 days ago

భారతీయులు నమ్మకంగా షాపింగ్‌ చేస్తున్న ఆన్‌లైన్‌ స్టోర్లలో అమెజాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్డ్‌లు నిలిచాయి. భారతీయులు అత్యంత నమ్మకంగా షాపింగ్‌ చేస్తున్న వెబ్‌సైట్లపై ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ(టీర్‌ఏ) చేసిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 21-50 ఏళ్ల మధ్యగల 2,500 మందిపై 16 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. పై వెబ్‌సైట్ల తరువాత నాలుగు నుంచి పది స్థానాల్లో ఈబే, మింత్రా, యప్‌మీ, జబాంగ్‌, నాప్‌టాల్‌, షాప్‌క్లూస్‌, ఆస్క్‌మిబజార్‌లు ఉన్నాయి. ఈ విషయమై టీఆర్‌ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎన్‌. చంద్రమౌళి మీడియాతో మాట్లాడారు. సర్వేలో 36శాతం మంది అమెజాన్‌ ఇండియాకే ఓటు వేశారని చెప్పారు.

నేడు హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి రాక1 Y 83 days ago

ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. ఉప రాష్ట్రపతి మొదట రాజ్‌భవన్‌ నుంచి పాత నగరంలోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు విచ్చేస్తారు. అనంతరం శని, ఆదివారాల్లో నగరంలోని చార్మినార్‌, కుతుబ్‌ షాహీ సమాధులు తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్‌ శాఖ రాజ్‌భవన్‌ నుంచి 30కి పైగా వాహనాల శ్రేణితో తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకు అక్కడి నుంచి కుతుబ్‌షాహీ సమాధుల వరకు కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించింది.

ఐదు రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్న ఈసీ1 Y 84 days ago

 మరి కాసేపట్లో ఐదు రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) విడుదల చేయనుంది. పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ, తమిళనాడుతోపాటు కేంద్రపాలితమైన పాండిచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాష్ర్టాలలోని ప్రముఖ పార్టీలు ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టేందుకు కమ్యూనిస్టు పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అసోంలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరడంతోపాటు అక్కడ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీ నేతలు ముందంజలో ఉన్నారు.

వాచ్‌లు దొంగలించిన బీటెక్ విద్యార్థుల అరెస్ట్1 Y 84 days ago

విలాసాలకు అలవాటు పడి ఖరీదైన చేతి గడియారాలను దొంగలించిన ఇద్దరు బీటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన సహస్ చౌదరి, తేజ అనే విద్యార్థులు ఫిబ్రవరి 9న ఇనార్బిట్ మాల్‌లోని రాడో వాచ్ షోరూమ్‌లో షాపింగ్‌కు వెళ్లారు. రూ.1,21,000 విలువైన రెండు వాచ్‌లను కాజేశారు. ఆలస్యంగా గుర్తించిన షోరూమ్ నిర్వాహకులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు వీరిద్దరినీ గుర్తించారు. అయితే ఫుటేజ్‌లో వారి ముఖాలు సరిగా కనిపించలేదు.

బాలుడి కిడ్నాప్‌.. హత్య.. ఆపై డబ్బు డిమాండ్‌1 Y 84 days ago

మహారాష్ట్రలోని ముంబయిలో ఎనిమిదేళ్ల బాలుడిని అపహరించి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ముంబయి శివారులోని కల్యాణ్‌ ప్రాంతంలో మార్చి 1న నయన్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడు పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా అపహరణకు గురయ్యాడు. అయితే బాలుడిని హత్య చేసి ఆ తర్వాత కిడ్నాపర్లు బాలుడి తండ్రి నుంచి రూ.15లక్షలు వసూలు చేశారు. నయన్‌ స్కూలు బస్సు దిగగానే ఇంట్లో పనిచేసే వ్యక్తే బాబును తీసుకువెళ్లినట్లు సమాచారం. తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి డబ్బు కోసం డిమాండ్‌ చేశారు. దీంతో అతడి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజీల ద్వారా ముగ్గురు కిడ్నాపర్లను గుర్తించారు. అయితే బాబుకు హాని చేస్తారేమోనన్న భయంతో నయన్‌ తండ్రి కిడ్నాపర్లు డిమాండ్‌ చేసిన రూ.15లక్షలు వారు చెప్పిన రైల్వే స్టేషన్‌ వద్ద బ్యాగ్‌లో పెట్టి ఇచ్చారు. వారు డబ్బు తీసుకొని పారిపోతుండగా పోలీసులు దాదాపు 20కి.మీ. వెంటాడి పట్టుకున్నారు. దుండగులను నిలదీయగా అప్పటికే బాబును హత్య చేసినట్లు చెప్పారు. 

ఫేస్‌బుక్‌ పోస్టుకు 13 ఏళ్ల జైలుశిక్ష1 Y 84 days ago

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు చేసినందుకు పాకిస్థాన్‌ కోర్టు ఓ వ్యక్తికి 13ఏళ్ల జైలు శిక్ష విధించింది. రిజ్వాన్‌ హైదర్‌(25) అనే వ్యక్తికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ శిక్ష విధించింది. అలాగే 2,40,000 పాకిస్థాన్‌ రూపాయలు(సుమారు రూ.1,68,000) జరిమానా కూడా విధించింది. షియా ముస్లిం అయిన రిజ్వాన్‌ ఈ ఏడాది జనవరిలో చేసిన ఫేస్‌బుక్‌ పోస్టు ఈ శిక్షకు కారణమైంది. సున్నీ ముస్లింల నమ్మకాలను ఆ పోస్టు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ, అలాంటి అభ్యంతరకర పోస్టు చేసినందుకు రిజ్వాన్‌పై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అతడి లాయర్‌ మాత్రం రిజ్వాన్‌ కేవలం పోస్టును లైక్‌ చేశాడని, స్వయంగా పోస్ట్‌ చేయలేదని, తమకు అప్పీల్‌ చేసుకునే హక్కు ఉందని వాదిస్తున్నారు.

శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు1 Y 84 days ago

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగం వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజైన నేడు స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివపార్వతులను దర్శించుకునేందుకు తరలివస్తున్న వేలాది మంది భక్తులతో మల్లన్న ఆలయం కిటకిటలాడుతోంది. ఈరోజు రాత్రి ఆది దంపతులు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తరపున ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈరోజు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

వయసు77.. 47వసారి పదో తరగతి పరీక్షకు..1 Y 84 days ago

 రాజస్థాన్‌కి చెందిన శివచరణ్‌ యాదవ్‌ వయసు 77 ఏళ్లు. ఇప్పటివరకు 46 సార్లు పదో తరగతి పరీక్ష రాశాడు. అయినా పాసవ్వలేకపోయాడు. ఇంతటి అపజయాన్ని ఎవరు మాత్రం చూడాలనుకుంటారు చెప్పండి..! అందుకే పదో తరగతి పాసయ్యేంతవరకు పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు 47వ సారి పరీక్షలకు హాజరుకానున్నాడు. ఇందుకు రాజస్థాన్‌ బోర్డ్‌ కూడా అంగీకరించింది. 1968లో శివరాజ్‌ మొదటిసారిగా పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అప్పుడు పాసవ్వలేదు. అప్పట్నుంచి 1994 వరకు ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిలవుతూనే ఉన్నాడు. 1995లో మొదటిసారి అన్ని దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఒక్క గణితంలో తప్ప. ఇలా ఏదో ఒక సబ్జెక్టులో తప్పడం.. వచ్చే ఏడాది పరీక్షలకు హాజరుకావడం. ఇలా ఒంటరిగా ఉంటూ ఏళ్లు గడిపేశాడు. ప్రభుత్వం తరఫున వచ్చే పింఛను, గుడిలో పెట్టే ప్రసాదంతో బతికేస్తున్నాడు.

సుజనా గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు1 Y 84 days ago

సుజనా గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిసస్‌ బ్యాంకుకు బకాయి ఉన్న రూ.100 కోట్లను చెల్లించాల్సిందేనని సుజనా గ్రూపును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుజనా గ్రూపు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఉపశమనం ఇవ్వాల్సింది దొంగలకు కాదు.. ఉద్యోగులకు1 Y 84 days ago

ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ‘నల్లధనంపై బడ్జెట్లో ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పథకం ప్రవేశపెట్టి దొంగలకు ఉపశమనం కల్పిస్తున్నారు. నిజానికి అలాంటి ఉపశమనాన్ని ఉద్యోగులకు ఇవ్వాలి. ఈపీఎఫ్‌ అనేది ఉద్యోగులకు రక్షణ కవచం. దానిపై పన్ను విధించడం తప్పు. పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని కోరుతున్నా’నని ఆయన చెప్పారు. గురువారం పార్లమెంటు భవన సముదాయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

తెదేపాలో చేరిన పాతపట్నం ఎమ్మెల్యే1 Y 84 days ago

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తెదేపాలోకి వైకాపా ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ(వైకాపా) ఈరోజు తెదేపాలో చేరారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన వెంకటరమణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితయ్యే పార్టీలో చేరినట్లు వెంకటరమణ చెప్పారు. తాను తెదేపాలో చేరుతున్నట్లు కొద్దిరోజుల క్రితమే వెంకటరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటరమణ చేరికతో వైకాపా నుంచి తెదేపాలోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.

చెత్త నుంచి పుట్టింది... ఈ యువ వ్యాపారవేత్తల ఐడియా!1 Y 84 days ago

వ్యాపారం ప్రారంభించాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదు. కాస్త వినూత్నంగా.. నలుగురికి ఉపయోగపడే ఆలోచన ఉంటే చాలు’ ఈ మాటలు కోల్‌కతాకు చెందిన అంకిత్‌ అగర్వాల్‌.. జోయ్‌ పన్సారీలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పరిశుభ్ర భారత్‌ కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛభారత్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని.. కోల్‌కతాలో వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ యువకులు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో వినూత్నంగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసి.. వాటిపై ప్రకటనలను ప్రచురిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఓ వైపు పరిశుభ్ర భారత్‌ కల సాకారానికి కృషి చేస్తూ.. మరోవైపు వ్యాపార జిమ్మిక్కుతో దూసుకెళ్తున్న ఆ యువ ఔత్సాహికుల గురించి తెలుసుకుందాం. జోయ్‌ పన్సారీ చదివింది ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌.. అంకిత్‌ అగర్వాల్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌. వారు ఎంచుకున్న వ్యాపార మార్గం మరొకటి. రోడ్లన్నీ చెత్తతో నిండిపోతుండటాన్ని చూసి విసుగు చెందిన జోయ్‌.. నగరంలో అన్ని చోట్లా చెత్తబుట్టలు ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించాడు. అలా చెత్తబుట్టలను ఏర్పాటు చేసి వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది..? అని ఆలోచించాడు. తన ఆలోచనను స్నేహితుడు అంకిత్‌కు వివరించాడు. ఇద్దరూ కలిసి ‘గ్రీన్‌ మీడియా వర్క్స్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. వీధుల్లో.. నివాస సముదాయాల వద్ద చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు. 

900 ఏళ్లలో ఇంత కరవు ఏర్పడలేదు...1 Y 84 days ago

 సిరియా, ఇజ్రాయెల్‌, లెబనాన్‌, టర్కీ, సైప్రస్‌, పాలస్తీనా... తదితర దేశాలను కరవు వణికిస్తోంది. 900 ఏళ్లలో ఇంత దుర్భిక్షం ఏర్పడటం ఇదే మొదటిసారని నాసా వెల్లడించింది. 2008 నుంచి కరవు ఈ ప్రాంతంలో తరచుగా ఏర్పడుతోందని నాసా పరిశోధనలు వెల్లడించాయి. సిరియాలో అంతర్యుద్దం ఏర్పడటానికి కరవు కూడా ఒక కారణమని తెలుస్తోంది. కరవు కారణంగా సిరియాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది నగరబాట పట్టారు. అక్కడ సరైన వసతులు లేకపోవడం, ఆహారం అందక పోవడం... తదితర సమస్యలతో అనేకమంది తిరుగుబాటులో పాల్గొన్నారు.

వరంగల్‌లో తెరాస విజయం ఖాయం: కేటీఆర్‌1 Y 84 days ago

 గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈరోజు వరంగల్‌లో రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. పాపయ్యపేట చమన్‌ ఆయనకు స్థానిక మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరంగల్‌ కార్పోరేషన్‌పై తెరాస జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయన్నారు.


Copyrights © 2014 6tvlive.com