6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు1 Y 101 days ago

అతనికిప్పుడు నాలుగేళ్లు.. కానీ, వందేళ్ల క్రితమే అతను చనిపోయాడు..  ఇప్పుడు సెకండ్‌లైఫ్ స్టార్ట్ చేశాడు... నిజం.. యూరప్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అతను రెండోసారి జీవిస్తున్నాడు. అతని పేరు ఎడ్వర్డ్..  తల్లి కడుపులో పుట్టడానికి ముందే అతను జీవించాడు. వందేళ్ల క్రితం వీరుడిగా బతికాడు. మొదటి ప్రపంచ సంగ్రామంలో ఫ్రెంచి సైన్యాలకు బాసటగా నిలిచి వీరమరణం పొందాడు. ఇప్పుడు మళ్లీ జీవిస్తున్నాడు. ఇదేమీ కట్టుకథ కాదు.. నిజం. నాలుగేళ్ల బాలుడు తన పూర్వ జన్మ గురించి చెప్తున్న వాస్తవం.. తల్లిదండ్రులకు.. వైద్యులకు సైతం విస్మయం కలిగించే విచిత్రకథ.
 

              ఎడ్వర్డ్ ఆస్ట్రియన్ అనే ఈ నాలుగేళ్ల  పిల్లాడికి గొంతులో ఏదో సమస్య రావటంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అతని గొంతులో ఒక గడ్డ ఉందని, దానిచుట్టూ టాన్సిల్స్ ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక తల్లి ప్యాట్రీషియా అతను అతి కష్టం మీద అన్న మాట.. ‘నాకు బుల్లెట్ తగిలింది’! అని.. మొదట ప్యాట్రీషియా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. డాక్టర్లు శస్త్రచికిత్స చేయడానికి తేదీ నిర్ణయించారు.

ముస్తాక్ కుటుంబానికి చెక్కు అందజేసిన కేఈ1 Y 101 days ago

 సియాచిన్లో మరణించిన ఆర్మీ జవాన్ ముస్తాక్ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పార్నపల్లెలో ముస్తాక్ భౌతికకాయాన్ని కేఈ సందర్శించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ముస్తాక్ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చెక్కును కేఈ కృష్ణమూర్తి అందజేశారు.

సీఎం సహాయ నిధికి ‘డీపీఎస్‌ ఇన్ఫోటెక్‌’ 25 లక్షల విరాళం 1 Y 101 days ago

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి డీపీఎస్‌ ఇన్ఫోటెక్‌ సంస్థ రూ.25 లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ డా.డీఎ్‌సఎన రాజు సోమవా రం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌కు చెక్కు అందజేశారు

నారాయణఖేడ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం 1 Y 101 days ago

నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. 8వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్ రెడ్డి 19,972 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ 34,646, కాంగ్రెస్‌ అభ్యర్థికి 14,674, టీడీపీ అభ్యర్థికి 7,463 ఓట్లు వచ్చాయి. 

11,565 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్1 Y 101 days ago

నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమైనట్లే. రౌండ్‌రౌండ్‌కు టీఆర్‌ఎస్సే ముందంజలో ఉంది. ఐదో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 11,565 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు దిగాలుగా ఉన్నాయి.
16

మూడో రౌండ్లో టీఆర్‌ఎస్ అధిక్యం 73021 Y 101 days ago

నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమే అనిపిస్తుంది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అధిక్యంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. మూడు రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 7302 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు 12,642 ఓట్లు పోలయ్యాయి.

నేడే ఖేడ్ ఉపఎన్నిక కౌంటింగ్1 Y 101 days ago

 నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ వీడనున్నది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలిపోనున్నది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 వరకు పూర్తి ఫలితాలు వెల్లడవనున్నాయి.

‘స్వచ్ఛ’ నగరాల్లో హైదరాబాద్‌కు 19వ స్థానం1 Y 101 days ago

స్వచ్ఛ నగరాల్లో హైదరాబాద్‌కు 19వ స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, మౌలిక వసతుల కల్పనలో నగరాల మధ్య పోటీ పెంచడానికి స్వచ్ఛ సర్వేక్షణ్-2016 పేరుతో 73 నగరాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం విడుదల చేశారు. దీనిలో మైసూరు(కర్ణాటక) ప్రథమ స్థానం దక్కించుకోగా.. ఆ తర్వాత వరుస స్థానాల్లో చంఢీగఢ్, తిరుచిరాపల్లి(తమిళనాడు), న్యూఢిల్లీ నిలిచాయి. తెలుగురాష్ట్రాల్లోని విశాఖపట్నం 5వ, హైదరాబాద్ 19, విజయవాడ 23, వరంగల్ 32వ స్థానం దక్కించుకున్నాయి.

ఓ సైకోపాత్ వన్‌సైడ్ లవ్‌స్టోరీ.. సినిమా కాని సినిమా1 Y 101 days ago

స్నాప్‌డీల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే దీప్తీ సర్నాను(25) కిడ్నాప్ చేసేముందు 150 సార్లు రెక్కీ నిర్వహించినట్లు ప్రధాన నిందితుడు దేవేంద్ర అంగీకరించాడు. 2015 జనవరిలో దీప్తీని ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో తొలిసారి చూసినప్పటినుంచీ ప్రేమను పెంచుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో ఎంటెక్ చేస్తున్న దీప్తీ మెట్రో ద్వారా స్నేహితులతో కలిసి నిరంతరం ప్రయాణించేది. తనను తాను షారూఖ్ అభిమానిగా చెప్పుకున్న దేవేంద్ర ‘డర్’ సినిమాలో షారూఖ్ ఖాన్‌ సైకోపాత్‌ పాత్ర తనకు నచ్చిందన్నాడు. ఆ సినిమాలో షారూఖ్‌లాగే తాను కూడా దీప్తీని ప్రేమించానని చెప్పాడు. దీప్తీ లేనిదే తనకు జీవితంలో అంతా శూన్యమేననే మానసిక భావనకు వచ్చాడు. దీప్తీ స్నేహితుడితో మాట్లాడుతుంటే కూడా తాను తట్టుకోలేకపోయినట్లు చెప్పాడు.
 
దీప్తి కోసం ఏడాదిలో కనీసం 150 సార్లు రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించాడు. కిడ్నాప్ కోసం తీసుకున్న రెండు ఆటోలతో మెట్రో స్టేషన్ వద్ద వెయిట్ చేసినా ఏనాడూ తన ఆటో ఎక్కలేదని, మహిళా ప్యాసింజర్లు ఉన్న ఆటోలోనే ఆమె వెళ్లేదని దేవేంద్ర చెప్పాడు. తన నలుగురు స్నేహితులకు అబద్ధాలు చెప్పి కిడ్నాప్‌లో పాల్గొనేలా చేశానని వెల్లడించాడు.

మహిళా సంఘాల సభ్యులతో గవర్నర్‌ ముఖాముఖి1 Y 102 days ago

 శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా గవర్నరు నరసింహన్  సీతంపేట పీఎంఆర్‌సీలో స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌లను  సందర్శించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో గవర్నరు ముఖాముఖి జరిపారు. అంతకుముందు శ్రీకూర్మం కూర్మనాథస్వామిని గవర్నరు నరసింహన్  దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి గవర్నరు పూజలు చేశారు. 

నేరేడ్‌మెట్‌లో కల్తీపాల దందా1 Y 102 days ago

హైదరాబాద్‌లో కల్తీపాల దందా గుట్టురట్టయింది. నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడుకాకుండా పాలను కల్తీ చేస్తున్న ఇంటిపై స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు ఆకస్మికదాడులు జరిపి ఒకరిని అదుపులోకి తీసుకొన్నారు. ఇన్స్‌పెక్టర్ చంద్రబాబు కథనం ప్రకారం.. శ్రీసాయినగర్‌కు చెందిన అమృత్‌లాల్ (42) గత కొన్నేండ్లుగా హెరిటేజ్ కంపెనీ పాల డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 వందల లీటర్ల పాలను విక్రయిస్తుంటాడు. సునాయసంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో.. గత ఐదేండ్లుగా పాల కల్తీకి పాల్పడుతున్నాడు. 

మధ్యప్రదేశ్‌లో ఆరుగురు పోలీసులపై కేసు నమోదు1 Y 102 days ago

 మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేత అతిఖ్‌ అహ్మద్‌ పోలీసు కస్టడీలో ఉండగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులపై కేసు నమోదైంది. రేవా పోలీసుస్టేషన్‌ ఇన్‌ఛార్జిని సస్పెండ్‌ చేసి మేజిస్ట్రియల్‌ విచారణకు ఆదేశించారు. స్థానికులతో ఘర్షణ పడిన కేసులో భాజపా నేత అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న అహ్మద్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అహ్మద్‌ హృద్రోగంతో బాధపడుతున్నాడని, కస్టడీలో ఉండగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని రేవా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఘటనపై మేజిస్ట్రియల్‌ విచారణకు ఆదేశించామన్నారు.

మిర్చి బస్తాల దొంగకు చెప్పులదండేసి ఊరేగింపు1 Y 102 days ago

డొర్నకల్‌ మండలం రావిగూడెం శివారులోని ధన్యాతండాలో ఓ దొంగ మిర్చీ బస్తాలను అపహరించారు. దీంతో తండావాసులు దొంగకు చెప్పులదండ వేసి ఊరేగించారు.

ఎఫ్‌బీ ఫ్రెండ్‌ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి!1 Y 102 days ago

ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితురాలితో ప్రేమికుల రోజును జరుపుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని నాలుగు అంతస్తుల బంగ్లా నుంచి తోసివేసి చంపేశారు. గుర్గావ్‌లోని సుశాంత్ లోక్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్య ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఈశ్వర్‌ అలియాస్‌ నిషాంత్ ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో ఏడు నెలలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా గుర్గావ్‌కు రావాలని ఆ యువతి నిషాంత్‌ను కోరింది. గుర్గావ్‌లోని హుడా సిటీ సెంటర్ వద్ద ఇద్దరు కలుసుకున్నారు. ఆ తర్వాత సుశాంత్ లోక్ ఏరియాలోని ఓ నాలుగంతస్తుల భవనంలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరిని చూసిన యువతి భావ రమేశ్‌ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే నిషాంత్‌పై వాళ్లు దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. ఆ తర్వాత అతన్ని బాల్కనీ నుంచి కిందకు తోసేసి చంపేశారు.

తెలంగాణలో టీటీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర1 Y 102 days ago

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో వివిధ పథకాల కింద పెండింగ్లోని ఇళ్ల నిర్మాణాలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పరిశీలన చేయనున్నారు. కాగా, ఇప్పటివరకూ డబ్బులు కట్టినా ఇళ్లు మంజూరు కానివారు, ఇల్లు పూర్తైనా బిల్లులు రానివారితో వారు మాట్లాడనున్నారు

నక్సలిజం వస్తే బాగుండును: రేవంత్‌రెడ్డి1 Y 102 days ago

తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు... ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. తెలంగాణ రాష్ట్రంలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలి. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నాను. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుండును. యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోంది.

శ్రీనగర్‌లో ఆందోళనకారులపై పోలీసు కాల్పులు1 Y 102 days ago

పుల్వామా జిల్లాలో ఉగ్రవాదిని హతమార్చినందుకు నిరసనగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ బాలికతో పాటు ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిని దినేష్‌, శహిస్టాగా గుర్తించారు. 

భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి1 Y 102 days ago

దేవీ విగ్రహ నిమజ్జనానికి వెళుతున్న భక్తులపైకి భారీ వాహనం దూసుకుపోవడంతో 10 మంది మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. సరస్వతి దేవీ విగ్రహ నిమజ్జనానికి భారీ సంఖ్యలో ప్రజలు గిరిదిహ్‌-బగోదర్‌ రహదారిపై ర్యాలీగా వెళుతున్నారు

నాచారంలో ఇద్దరు వ్యాపారుల మధ్య వివాదం...కత్తితో దాడి 1 Y 102 days ago

ఇద్దరు నగల వ్యాపారుల మధ్య రుణ వివాదం కత్తితో దాడికి దారితీసింది.   నాచారంలో నగల వ్యాపారి కుమార్‌ కత్తితో గిరి అనే వ్యాపారిపై దాడి చేశారు. కుమార్ అప్పు తీర్చలేదని నగల వ్యాపారి గిరిపై దాడి చేశారు. బాధితుడు గిరికి తీవ్ర గాయాలు అవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రూ.30 లక్షలు అప్పు ఇచ్చి రూ.కోటి చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

మూడేళ్ళు వెండితెరకు దూరం కానున్న ఎన్టీఆర్1 Y 102 days ago

టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ త్వరలో ‘జనతా గ్యారేజ్’ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని తెరమీద చూడాలాంటే మాత్రం మూడేళ్ళు ఆగాలట. దీనికి కారణం దర్శక ధీరుడు రాజమౌళే. యాక్షన్ కథల నుండి చారిత్రిక కథలవైపు మళ్ళిన రాజమౌళి ‘గరుడ’ అనే మరో భారీ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్‌తో చేయనున్నారట జక్కన్న. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ‘గరుడ’ సినిమా చేయాలంటే సమయం, సొమ్ము ‘బాహుబలి’ని మించి కావాలని గతంలో రాజమౌళి చెప్పారు. రాజమౌళితో సినిమా అంటే నిర్మాతలు తగ్గే ప్రసక్తే లేదు. అయితే హీరో కూడా సై అంటేనే మరో ప్రపంచ స్థాయి సినిమాని చూడొచ్చు. దీనికి ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పి మూడేళ్ళు ‘గరుడ’ సినిమాకి కేటాయించేందుకు సిద్ధమయ్యారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘బాహుబలి - ది కంక్లూజన్’ తర్వాత రాజమౌళి చేయనున్న చిత్రమిదే. 


Copyrights © 2014 6tvlive.com