6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

రిహార్సల్ సమయంలో పొట్టలోకి కత్తి దిగి నటుడు మృతి1 Y 99 days ago

సినిమాలోని సన్నివేశాల ఆధారంగా కొందరు నటీ నటులు అద్భుతమైన ఫీట్స్‌తో ప్రేక్షకులును అలరించేందుకు సిద్దమవుతుంటారు. ఈ నేపధ్యంలో కొందరు తమ ప్రాణాలను కూడా కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి సంఘటన ఒకటి టోక్యో నగరంలో జరగగా, ఆ నటుడి అభిమానులు శోక సంద్రంలో మునిగినట్టు తెలుస్తోంది. జపనీస్ నాటకంలో భాగంగా టోక్యోలోని స్టూడియోలో యుద్ద సన్ని వేశాలకోసం జపాన్ నటుడు డిగో కాసినో (33) రిహార్సల్స్ చేస్తుండగా, ఆయన పొట్టలోకి కత్తి దూసుకువెళ్ళింది.

13 పాత్రలలో కనిపించనున్న ధనరాజ్1 Y 99 days ago

ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న ’పనిలేని పులిరాజు‘ చిత్రానికి దర్శకుడు చాచా. పాలేపు మీడియా ప్రై.లి పతాకంపై పి.వి. నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ ’ధన్ రాజ్ సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఫుల్ లెన్త్ కామెడీతో ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రాచీ సిన్హా తో పాటు మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రఘుబాబు, ధన్ రాజ్ కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుంది‘ అన్నారు. 

మిలియన్‌కు చేరిన దేవీశ్రీప్రసాద్ ఫాలోవర్స్1 Y 99 days ago

హుషారైన సాంగ్స్‌ను కంపోజ్ చేసి సినిమా సినిమాకు వైరైటీ మ్యూజిక్ నందిస్తాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్ల సంఖ్య 10లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా దేవీ శ్రీప్రసాద్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం బుర్జ్ ఖలీఫాను సందర్శించాడు.  

ఇండియా-2016 పుస్తకాన్ని ఆవిష్కరించిన అరుణ్ జైట్లీ1 Y 99 days ago

 ఇండియా-2016 పుస్తకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ రిలీజ్ చేశారు. పబ్లికేషన్స్ డివిజన్ ఆ పుస్తకాన్ని ప్రచురించింది. ఇండియా-2016 పుస్తకం జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు ఉపయోగకరంగా ఉంటుందని జైట్లీ అన్నారు. పార్లమెంట్ ఎంపీలకు కావాల్సినంత సమాచారం కూడా ఉందన్నారు. ఇండియా-2016 పుస్తకానికి సంబంధించిన ఈ-వర్షన్‌ను కూడా ఆవిష్కరించారు. ప్రజలపై టెక్నాలజీ ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

నూతన దంపతులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం1 Y 99 days ago

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు.  పర్యటనలో భాగంగా  ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్‌ కుమార్తె దంపతులను ఆశీర్వదించారు.
సిరిపురం వీఐపీ రోడ్‌లో ఉన్న రాజశేఖర్‌ నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు....ఆయన కుటుంబసభ్యులు,అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

నాచారం పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం 1 Y 99 days ago

నగరంలోని నాచారంలో గురువారం  అగ్నిప్రమాదం జరిగింది. మ్యాట్రక్స్‌ పరుపుల కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. నాలుగు ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలేమిటో తెలియరాలేదు.

ప్రశాంతంగా ఏపీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్1 Y 99 days ago

ఏపీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా సాగుతుంది.126 డిపోల్లో 56వేల మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్‌ఎంయూ-ఈయూ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. కృష్ణా జిల్లాలో ఆర్టీసీ కార్మికసంఘం ఎన్నికల పోలింగ్ లో  ఉదయం 5 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు బారులు తీరారు. పోలింగ్ సందర్భంగా  పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

వైకల్యాన్ని జయించి.. విధికి తలవంచి..1 Y 99 days ago

పుట్టుకతోనే ఓ చేయి లేదు.. అయినా అధైర్యపడలేదు. వైకల్యాన్ని నిందిస్తూ కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో కఠోర సాధన చేశాడు.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికే వన్నె తెచ్చిన పారా స్విమ్మర్‌గా ఎదిగాడు. కానీ కడు పేదరికం అతడి ప్రతిభకు గ్రహణంలా పట్టింది. నేడు రోజు గడవడానికి కార్లు తుడవాల్సిన దుస్థితి దాపురించింది. చేయిలేకపోయినా ఎప్పుడూ చింతించలేదు. సాయం చేసే చేతుల కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు. ఆదుకుంటే ప్రపంచ స్థాయి పతకాలను మరిన్ని దేశానికి అందిస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అతనే హర్యానాకు చెందిన భరత కుమార్‌. అంతర్జాతీయస్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన పారా ఒలింపిక్‌ స్విమ్మర్‌ భరత 2005 జూనియర్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌, 2009 వరల్డ్‌ గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించాడు. 2010 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. సహజంగా అంతర్జాతీయ పతకం సాధించిన తర్వాత ఆ క్రీడాకారుడి జీవితమే మారిపోతుంది. కానీ భరత కుమార్‌ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రోజు గడవడానికి కార్లను తుడిచి రూపాయి.. రూపాయి సంపాదించాల్సి వస్తోంది.

పెయింట్‌ డబ్బా పేలింది!1 Y 99 days ago

పెయింట్‌ డబ్బా పేలుతుందా? పేలినా.. మనిషిని తునాతునకలు చేసే తీవ్రత ఉంటుందా? మంచిరేవుల గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న అనుమానాస్పద పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం అవుననే అంటున్నారు. గ్రామంలోని ఓ పాత ఇనుప సామాగ్రి దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. మంచిరేవులకు చెందిన పీసరి కుమార్‌ (43) జులాయిగా తిరుగుతుంటాడు. పలుచోట్ల సేకరించిన ఇనుప తుక్కు, ప్లాస్టిక్‌ సామాగ్రిని సేకరించి అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలోని రాములు అనే వ్యక్తి నిర్వహిస్తున్న దుకాణానికి వచ్చాడు. తాను తెచ్చిన సామాన్లలోని ఓ డబ్బాలో పెయింట్‌ నిండుగా ఉండటంతో కుమార్‌ ఆ బాక్సును కాళ్లమధ్యలో పెట్టుకొనిసుత్తితో పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఆ ధాటికి కుమార్‌ శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు.

అవినీతి పోలీస్‌ 1 Y 99 days ago

భార్య పేరిట స్థలం... కొడుకు పేరిట స్థలం... బినామీ పేర్లతో భూములు... పొరుగు రాష్ట్రంలోనూ బ్యాంకు ఖాతా! ఇలా పలు రూపాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టన పోలీస్‌ సీఐను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో మొత్తం రూ.2 కోట్లకుపైగా విలువైన ఆస్తులను గుర్తించామని, మార్కెట్‌లో వీటి విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టు సమాచారం అందడంతో విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మెరైన్‌ సీఐగా పనిచేస్తున్న షేక్‌ హుస్సేన్‌ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. నగరంలోని సీఐ నివాసంతోపాటు బెంగళూరులోని కుమార్తె నివాసం, రాజమండ్రిలోని సోదరుడు, వియ్యంకుడి ఇళ్లలో, విశాఖ నగరంలోని ఆంథోనినగర్‌లో నివాసముంటున్న అతని స్నేహితురాలు అనిత, విశాలాక్షి నగర్‌లో ఆమె సోదరికి చెందిన ఇళ్లలో, హుస్సేన కార్యాలయం, సీతమ్మధారలో అతని స్నేహితుడు శ్రీనివాస్‌ నివాసం, విజయనగరం జిల్లా కోడూరులోని అతని తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు, రాజాంలోని మామ, బావమరుదుల ఇళ్లతోసహా 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు

నకిలీ కొబ్బరి నూనె తయారుచేస్తున్నఇద్దరి అరెస్టు 18-02-2016 07:29:201 Y 99 days ago

  • 2 లక్షల విలువైన నూనె, ముడిసరుకు, డబ్బాలు స్వాధీనం 

 కొబ్బరి నూనె తయారుచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌వోటీ, మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన నకిలీ కొబ్బరినూనెతో పాటు ముడిసరుకు, డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారానికి చెందిన ఇందిరా అగర్వాల్‌, పంకజ అగర్వాల్‌ మియాపూర్‌ జేపీఎన్‌నగర్‌లో ఇల్లు అద్దెకుతీసుకొని పామాయిల్‌, కొన్ని రకాల కెమికల్స్‌ కలిపి నకిలీ కొబ్బరి నూనె తయారు చేస్తున్నారు. 

నేటి నుంచి కేడీసీఏ స్కూల్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ1 Y 99 days ago

జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ నుంచి నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాల మైదానంలో నోరి శివరామకృష్ణ స్మారక కేడీసీఏ స్కూల్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి ఎ.యల్లారావు తెలిపారు. ఈ టోర్నీలో 15 జట్లు తలపడుతుండగా.. నాలుగు పూల్స్‌గా విభజించామన్నారు. టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్లోరా ఇంగ్లిషు మీడియం స్కూల్‌ (ఉయ్యూరు), రన్నరప్‌ నలంద విద్యానికేతన్‌ జట్లు పోటీకి సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. పోటీలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గోకరాజు గంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు 1 Y 99 days ago

అంగన్‌వాడి కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి బుధవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూల కథ ప్రహసనంగా మారింది. సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులకు సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమయ్యారు. వచ్చిన అభ్యర్థులకు కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయని పరిస్థితుల్లో అభ్యర్థులు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం పంచన నేలపైనే కూర్చున్నారు. టెంట్‌ వేసిన అధికారులు దానిలో కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అదేమంటే ఐసీడీఎస్‌ ఉద్యోగులు తమ కార్యాలయం వద్ద 200 కుర్చీలు ఏర్పాటు చేశామని చెప్పడం గమనార్హం.


టీ20 ప్రపంచకప్‌లో రహానెకు లేదా చోటు?1 Y 99 days ago

గత రెండేళ్లలో టీమ్‌ఇండియా తరఫున అత్యంత నిలకడగా ఆడిన బ్యాట్స్‌మన్‌ ఎవరు..? విరాట్‌ కోహ్లి కాదు.. మహేంద్రసింగ్‌ ధోని కాదు.. శిఖర్‌ ధావనూ కాదు.. అజింక్య రహానె! ఏ ఫార్మాట్లో అయినా.. ఏ పరిస్థితుల్లోనైనా.. ఏ స్థానంలో అయినా.. తనకు తిరుగులేదని చాటుకున్న ఈ ప్రతిభావంతుడు.. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో మైదానంలో దిగకపోతే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో రహానెకు తుది జట్టులో చోటివ్వడం కష్టమేనని తేల్చేశాడు కెప్టెన్‌ ధోని.

c1001 Y 100 days ago

డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌ ఆకస్మిక తనిఖీలు1 Y 101 days ago

 ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ ఆఫీసులో డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌ ఆకస్మిక తనిఖీలు జరిపారు. జీహెచ్‌ఎంసీలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషిచేస్తాంమని ఫసియుద్దీన్ చెప్పారు.  పెండింగ్‌ సమస్యలపై చర్యలు తీసుకుంటామని, తక్షణమే ప్రజాసమస్యలపై అధికారులు స్పందించాలని డిప్యూటీ మేయరు  ఫసీయుద్దీన్‌ కోరారు. 

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు1 Y 101 days ago

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన(జీడబ్ల్ఎంసీ), ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన పాలక మండళ్ల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ రెండుచోట్లా రిజర్వేషనల కోటాను ఖరారు చేయడంతో వార్డుల వారీగా రిజర్వేషనలను ప్రకటించారు. వరంగల్‌లోని 58 వార్డులు, ఖమ్మంలోని 50 వార్డులకు రిజర్వేషనలు కేటాయిస్తూ మునిసిపల్‌ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తయినట్లే. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. ఈ నెల 19 లేదా 20న షెడ్యూల్‌ వెలువ రించడంతో పాటు వెంటనే నోటిఫికేషనను కూడా జారీ చేయనున్నారు. మార్చి 5 నుంచి 10 లోగానే పోలింగ్‌, కౌంటింగ్‌ జరగనున్నట్లు సమాచారం. వ రంగల్‌ మేయర్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. 

హరీష్కు అభినందనలు తెలిపిన కేటీఆర్1 Y 101 days ago

 తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్రావుకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ టీడీపీ డిపాజిట్ గల్లంతు అయింది. అయితే నారాయణఖేడ్ ఉప ఎన్నికకు మంత్రి హరీష్ రావు ఇంఛార్జ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ట్విట్టర్లో ట్విట్ చేశారు.

ఖేడ్లో టీఆర్ఎస్ విజయ భేరి1 Y 101 days ago

నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. తొలి రౌండ్ నుంచే స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయింది. వరంగల్, గ్రేటర్ లో వెలుగుచేసిన ఫలితాల సరళే నారాయణఖేడ్ లోనూ కొనసాగింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53,625 ఓట్లతో ఘనవిజయం సాధించారు.టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డికు 93,076 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డికి 39,451 ఓట్లు దక్కాయి. టీడీపీ నుంచి పోటీలోఉన్న విజయపాల్ రెడ్డికి కేవలం 14,787 ఓట్లు, నోటాకు 853 ఓట్లు పడ్డాయి.


త్వరలో రికార్డు సృష్టించబోతున్న ఢిల్లీ సచివాలయం 1 Y 101 days ago

సంపూర్ణంగా పునరుద్ధరణీయ, సౌర ఇంధనాన్ని ఉపయోగించే తొలి సచివాలయంగా ఢిల్లీ రాష్ట్ర సచివాలయం రికార్డు సృష్టించబోతోంది. అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. దేశ రాజధాని నగరాన్ని సౌర నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ముందుగా ఢిల్లీ రాష్ట్ర సచివాలయం నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వ శాఖ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం ఇంద్రప్రస్థ పవర్ స్టేషన్‌కు చెందిన భూమిలోని ఖాళీ స్థలంలో 3 మె.వా. సామర్థ్యంగల సౌర విద్యుత్తు కేంద్రాన్నినిర్మిస్తోంది.


Copyrights © 2014 6tvlive.com