6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

బిట్స్‌పిలానీ ఫేజ్-2కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన1 Y 97 days ago

శామీర్‌పేట బిట్స్‌పిలానీ క్యాంపస్‌లో ఫేజ్-2 నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ నేడు భూమి పూజ చేశారు. అదేవిధంగా క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సైక్లింగ్ క్లబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శామీర్‌పేటను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తమని తెలిపారు

పాలిటెక్నిక్‌ విద్యార్థుల మృతిపై అనుమానాలు! 1 Y 97 days ago

రొయ్యల చెరువులో పాలిటెక్నిక్‌ విద్యార్థుల మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన తుమ్మల సాయికృష్ణ, గుమ్మడి రమేశ్‌ల భౌతిక కాయాలను సందర్శించేందుకు శుక్రవారం గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రానికి చేరారు. రొయ్యల చెరువుకు నలుగురు విద్యార్థులు వెళ్లగా అందులో ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల స్నేహితులైన ప్రవీణ్‌కుమార్‌ ఏసయ్యలను రమేశ్‌, సాయికృష్ణ కుటుంబ సభ్యులు బంధువులు నిలదీశారు. మేత వేసి వచ్చేలోపు గల్లంతయ్యారు : తాము వేరే చెరువులో మేతవేసి వచ్చేందుకు వెళ్లి తిరిగి వచ్చేలోపు రమేశ్‌, సాయికృష్ణ కన్పించకుండా పోయారని ప్రవీణ్‌కుమార్‌, ఏసయ్య (బాబీ)లు తెలిపారు

అగ్నిమాపకశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం1 Y 97 days ago

అగ్నిమాపకశాఖ ఉద్యోగి అనిల్‌కుమార్‌ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. కాని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని అనిల్‌కుమార్ సూసైడ్‌నోట్‌ రాశారు.

ఎమ్మెల్యే ముందే ప్రభుత్వ అధికారిపై దాడి1 Y 97 days ago

అచ్చంపేటలో ఫారెస్ట్‌ రేంజర్‌ రామేశ్వర్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడిచేశారు. ఫారెస్ట్‌ అతిథిగృహం ఇచ్చేందుకు రేంజర్‌ రామేశ్వర్‌రెడ్డి నిరాకరించడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు రామేశ్వర్‌పై దాడికి దిగారు. ఈ తతంగమంతా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముందే జరిగినా ఆయన అడ్డు చెప్పకపోవడంతో ఫారెస్ట్ అధికారులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ పై దాడి1 Y 97 days ago

పన్ను వసూలుకు వెళ్లిన ప్రభుత్వాధికారిపై ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.  పట్టణంలోని రిక్షా కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ కానిస్టేబుల్ బరిదాస్‌సింగ్ రాథోడ్.. మునిసిపాలిటీకి రూ.8వేల బకాయి పడ్డాడు. దీంతో రెడ్ నోటీసు జారీ అయింది. ఈ కమ్రంలో పన్ను వసూలు కోసం అసిస్టెంట్ కమిషనర్ రవిబాబు, సీనియర్ అసిస్టెంట్ యాదవకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ శుక్రవారం రిక్షా కాలనీలోని రాథోడ్ ఇంటికి వెళ్లాడు. తన దగ్గర కట్టడానికి ప్రస్తుతం డబ్బులు లేవని రాథోడ్ చెప్పగా... వస్తువులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడు దాడికి పాల్పడ్డాడు. 

ఎల్బీనగర్లో స్కూల్ బస్సు బీభత్సం1 Y 97 days ago

ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలో శనివారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. శాంతినికేతన్ స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బీభత్సం సృష్టించింది. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై కేకలు వేశారు

పురపాలక ఎన్నికల్లో ఓటింగ్‌ యంత్రాల్లో ‘నోటా’1 Y 97 days ago

తెలంగాణలో ఇకపై జరగబోయే పురపాలక ఎన్నికల్లో ఓటింగ్‌ యంత్రాల్లో నోటాకు చోటు దక్కనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక చట్టానికి సవరణలు చేశారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లోనే నోటా పెట్టాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. తాజాగా పురపాలక శాఖ జీవో 51 జారీ చేసింది. దీని ప్రకారం ఇక పురపాలక/నగరపాలక సంస్థల ఎన్నికల్లోను నోటాకు ఓటు వేసే అవకాశం ఉంటుంది.

పోలీసుశాఖ నుంచి మరో ఉద్యోగ ప్రకటన1 Y 97 days ago

 పోలీసుశాఖలో ఉద్యోగ నియామక పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకూ కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు ప్రకటనలు జారీ చేయగా తాజాగా పోలీసు సమాచార విభాగంలో 332 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 25 నుంచి వచ్చేనెల 15వ తేదీ అర్ధరాత్రి వరకూ www.tslprb.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2016 జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండి, 22 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. తెలంగాణ ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపును ఇస్తున్న దృష్ట్యా 25 సంవత్సరాల లోబడి వయసున్న వారు కూడా అర్హులవుతారు. ఈ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, ఐటీఐలో ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ సిస్టం మెయింటినెన్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, మెకానిక్‌ కంజ్యూమర్‌ ఎలక్ట్రీషియన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాలతోపాటు ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులో ఈఈటీ, ఈటీ, వంటి కోర్సులు చేసిన వారు అర్హులు.

వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రంపై ఏసీబీ దాడులు1 Y 97 days ago

చిత్తూరు జిల్లాలోని చిత్తూరు-గుడియాత్తం అతర్రాష్ట్ర రహదారిలో జోడిచింతల వద్ద ఉన్న యాదమరి వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు చేశారు. తనిఖీ కేంద్రంలో రికార్డుల్లో లేని రూ.20,620 నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వాహనాల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.

పాక్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా రిచర్డ్స్‌! 1 Y 98 days ago

: వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వివియన్‌ రిచర్డ్స్‌ వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టుకు సేవలందించే అవకాశాలున్నాయి. ఈ టోర్నీ వరకు రిచర్డ్స్‌ను బ్యాటింగ్‌ సలహాదారుగా నియమించుకోవడానికి పాకిస్థాన్‌ బోర్డు చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం రిచర్డ్స్‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ టోర్నీలో క్వెటా గ్లాడియేటర్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

చనిపోయిందనుకుంటే...లేచికూర్చుంది..!1 Y 98 days ago

ఆ వృద్ధురాలు చనిపోయిందనుకుని చితిమీద పడుకోబెట్టి నిప్పంటించబోయారు కుటుంబసభ్యులు. అంతలోనే ఆమె లేచికూర్చున్న చిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. కుమ్‌హర్‌ మొహల్లా ప్రాంతానికి చెందిన హీరాబాయ్‌(95)అనే వృద్ధురాలు చనిపోయిందనుకుని కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చితికి నిప్పంటించబోతుండగా ఆమె ఉన్నట్టుండి ఆమె లేచి కూర్చుంది. ఈ హఠాత్‌ పరిణామానికి అక్కడి వారంతా నివ్వెరబోయారు. ఆమెకు ఏమీకాలేదు అదే చాలనుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన కొద్దిసేపటికే తనకు అస్వస్థతగా ఉందంటూ ఆమె అక్కడే చనిపోయింది.

సూసైడ్ నోట్‌ రాసి విద్యార్థి అదృశ్యం1 Y 98 days ago

జిల్లాలోని హుసూర్‌నగర్‌లో ఓ స్కూల్ విద్యార్థి సూసైడ్ ‌నోట్ రాసి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి నాగార్జునరెడ్డి తనను తోటి విద్యార్థులు వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి హాస్టల్ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కార్పొరేట్ కళాశాల వేధింపులకు విద్యార్థి బలి1 Y 98 days ago

 కార్పొరేట్ కళాశాల వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సూరజ్ మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ యాజమాన్యం వేధించటంతో సూరజ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. జనవరి 28వ తేదీన కాలేజీ భవనంపై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలైన సూరజ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 14న సూరజ్ మృతి చెందాడు. అయితే కాలేజ్ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు.

రూ. 13,600 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ1 Y 98 days ago

ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 13,643.51 కోట్ల మేర రుణభారం ఉన్న 190 ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించింది. వీటిలో చాలా మటుకు ఖాతాదారులు రూ.25 కోట్ల పైగా రుణాలు పొందినట్లు ఆర్థిక పనితీరు నివేదికలో బ్యాంకు గురువారం వెల్లడించింది.  రూ. 1 కోటి మించి.. రూ. 25 కోట్ల కన్నా తక్కువ రుణాలు ఉన్న ఖాతాల సంఖ్య 48 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 378 కోట్లుగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. రూ. 1 కోటి కన్నా తక్కువ రుణ భారం ఉన్న ఖాతాలు 53 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 19.51 కోట్లని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 691 కోట్ల మేర రుణాలు నిరర్థకంగా (ఎన్‌పీఏ) మారాయని బ్యాంకు తెలిపింది. విలువ, పరిమాణంపరంగా పరిశ్రమలకిచ్చిన రుణాలు అత్యధికంగా (90 ఖాతాలు.. రూ. 12,368 కోట్లు) పునర్‌వ్యవస్థీకరించినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది.

రూ.251 ఫోను.. రెండువేల లొసుగులు!!1 Y 98 days ago

అత్యాధునిక ఫీచర్లున్న త్రీజీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.251కే విక్రయిస్తానని చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ తొలిరోజే చేతులెత్తేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచీ తన వెబ్‌సైట్లో వీటిని బుక్ చేసుకోవచ్చని సంస్థ చెప్పటంతో... ఫోనొస్తుందో రాదో అని అనుమానాలున్నా... పోనీ రూ.251 మాత్రమేగా!! అనుకుంటూ లక్షల మంది బుక్ చేయటానికి ప్రయత్నించారు. కాకపోతే మొదట పేరు, చిరునామా వివరాలు నింపిన తరవాత... చివరగా పేమెంట్ బటన్ దగ్గర ప్రెస్ చేయగా... మళ్లీ వివరాలు నింపాలంటూ రావటం అందరికీ పట్టలేని చిరాకు తెప్పించింది.

‘‘నేను 251 సార్లు నా వివరాలు నింపా... 251 సార్లు సబ్మిట్ చేశా. 251 సార్లు పేమెంట్ బటన్ నొక్కా... అయినా బుకింగ్ కాలేదు’’ అని ఒకరు... ‘‘బుక్ చేశా... వీకెండ్‌కు రైలు టికెట్‌ని’’ అని మరొకరు... ఇలా ట్విటర్‌లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఇక రింగింగ్‌బెల్స్ సంస్థ మాత్రం... 30వేల బుకింగ్‌లు తీసుకున్నామని, దేశీ యంగా తయారీకి ప్లాంటు పెడతామని, తయారు చేసిన అనంత రం వీరికి డెలివరీ చేస్తామని చెప్పింది

కర్నూలులో అగ్నిప్రమాదం...చిన్నారి సజీవదహనం1 Y 98 days ago

నంద్యాల హరిజనవాడలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి శ్రీవాణి సజీవదహనం అయ్యింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న బ్రహ్మయ్య ఇంట్లో అర్థరాత్రి మంటలు చెలరేగడంతో భయంతో పరుగులు తీశారు. ఆ క్షణంలో చిన్నారి శ్రీవాణిని బయటకు తీసుకురాలేకపోయారు. ఇళ్లంతా కాలిబూడిదైంది. కళ్ల ముందే కాలిపోయిన చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు

నడకతో స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌! 1 Y 98 days ago

పరుగెత్తడం... జాగింగ్‌ చేయడం ద్వారా శరీరం ఫిట్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. రన్నింగ్‌ చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోనును ఛార్జ్‌ చేసుకునేందుకు అవసరమయ్యే విద్యుత్తునూ ఉత్పత్తి చేసుకోవచ్చని తాజాగా వెల్లడించారుఅమెరికాకు చెందిన పరిశోధకులు. ఇటీవల అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా.. పరుగెడుతూ ఫోన్లను ఛార్జింగ్‌ చేసుకోచవ్చట.

దిల్లీకి బయలుదేరిన మంత్రి ఈటల1 Y 98 days ago

 తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని దిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

భారత ఇంజినీర్‌కు పాక్‌లో జైలుశిక్ష1 Y 98 days ago

గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ భారతీయ ఇంజినీర్‌కు పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై స్పందించిన భారత్‌ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని పాకిస్థాన్‌ను కోరింది. అంతర్జాలంలో పరిచయమైన యువతి కోసం ముంబయికి చెందిన 31 ఏళ్ల హమిద్‌ నెహాల్‌ అన్సారీ.. అఫ్గానిస్థాన్‌ నుంచి అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి సుమారు మూడేళ్ల పాటు పాకిస్థాన్‌లో ఆయన జాడ తెలియలేదు.

వార్న్‌ను అనకొండ కాటేసింది 1 Y 98 days ago

అవును.. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ను అనకొండ కాటేసింది. ఐతే ఇదేమీ అడవుల్లో అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ఓ టీవీ రియాల్టీ షోలో భాగంగా తనకు తానుగా అనకొండ ఉన్న పెట్టెలో తలపెట్టాడు వార్న్‌.కొన్ని రోజులుగా షేన్‌ ‘ఐయామ్‌ ఎ సెలబ్రెటీ.. గెట్‌ మి ఔట్‌ ఆఫ్‌ హియర్‌’ అనే టీవీ షోలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా అతను అనేక సాహస కృత్యాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఎలుకలు, తేళ్లు, కప్పలు, బొద్దింకలున్న డబ్బాల్లో తలపెట్టడంతో పాటు అనకొండతోనూ ఆటలాడాడు. అన్నింట్లోకి ఒళ్లు గగుర్పొడిచేది అనకొండ ఉన్న పెట్టెలో తలపెట్టడమే. ఆ సందర్భంగా అది వార్న్‌ను కాటేసింది కూడా. ఆ అనకొండ విషపూరితం కాకపోయినప్పటికీ.. వార్న్‌ చేసిన సాహసం చిన్నదేమీ కాదు కదా!

్కదత్ంవదవతంవ


Copyrights © 2014 6tvlive.com