6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

11111111111111111111111 Y 46 days ago

1111111111111111111111111111

కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ1 Y 80 days ago

గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కొద్దిరోజులుగా గోపీనాథ్ సైతం అధికార టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన సీఎంను కలవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే గోపీనాథ్, ఆయనతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీఆర్‌ఎస్ గూటికి చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం. పదిహేను మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన టీటీడీపీలో ప్రస్తుతం మిగిలింది కేవలం అయిదుగురు ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, ఆర్.కృష్ణయ్య  టీడీపీ శిబిరంలో ఉన్నారు. తాజాగా గోపీనాథ్ సీఎంతో భేటీ కావడంతో టీఆర్‌ఎస్‌లో ఆయన చేరిక కూడా దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. మరో ఎమ్మెల్యే గాంధీ సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది

‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి1 Y 80 days ago

 ప్రపంచ సమాచార గతిని మార్చిన ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త, ఎట్‌ ది రేట్‌ (@)ను అందించిన అమెరికా శాస్త్రవేత్త రే టామ్లినసన్(74) ఇకలేరు! ఆయన శనివారం మృతిచెందారు. అయితే ఆయన మరణించడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు! కాగా, సమాచారం పంపేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేని రోజుల్లో ఆయన సృష్టించిన ‘ఈ-మెయిల్‌’.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 1971లో ఆయన ’ఈ-మెయిల్‌’ను సృష్టించారు. అంతేగాక ఈ-మెయిల్‌లో ముఖ్యభాగమైన ఎట్‌ ది రేట్‌ను తొలిసారి టామ్లినసన ఉపయోగించారు. ఆయన బోస్టన్ లో ప్రోగ్రామర్‌గా చేస్తున్న సమయంలో తొలి ఈ-మెయిల్‌ను ఆర్ఫానెట్‌ అనే నెట్‌వర్క్‌ ద్వారా పంపించారు. 

800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం1 Y 80 days ago

మహా శివరాత్రి సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలోగల బౌరాపూర్‌ చెంచు పెంటలో సోమవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి 1200 ఏళ్ల చరిత్రగల బౌరాపూర్‌ ఆలయంలో 800 ఏళ్ల తర్వాత భ్రమరాంబ మల్లికార్జునుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీశైల మల్లికార్జునుడికన్నా 300 ఏళ్లు పురాతనమైన బౌరాపూర్‌ ఆలయ విశిష్టత ఇటీవలే సమాజానికి తెలిసింది. ఈ విషయాన్ని చెంచులోకం, వివిధ సేవాసంఘాలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా ఇక్కడ కల్యాణోత్సవ నిర్వహణకు రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఇక్కడ వేడుకలలో భాగంగా మూడు రోజులపాటు అధికారికంగా చెంచుల పండుగ నిర్వహించాలని తలపెట్టింది. ఈ మేరకు భ్రమరాంబ, మల్లికార్జునుల కల్యాణోత్సవం ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ ఆధ్వర్యాన మధ్యాహ్నం 1:30గంటలకు కనులపండువగా సాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి చెంచులు అధికసంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావటం గమనార్హం. అంచనాలకు మించి భక్తజనం పోటెత్తడంతో నిర్వాహకులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేతోపాటు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ లక్ష్మణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాంకిషన్‌ హాజరయ్యారు. 

గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత1 Y 80 days ago

గుంటూరులో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ప్రభల సాకుతో నిన్న రాత్రి నుంచి గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు తెల్లవారుజామున 5గంటలకు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. అయినా ఆర్టీసీ అధికారులు బస్సులను పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. 

పీఎస్‌ఎల్వీ సీ-32 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం1 Y 80 days ago

 పీఎస్‌ఎల్వీ సీ-32 రాకెట్‌ ప్రయోగానికి మంగళవారం  కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. శాస్త్రవేత్తలు ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 10న సాయంత్రం 4గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-32 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. 

10 వేల పోస్టులు.. 7 లక్షల దరఖాస్తులు1 Y 80 days ago

తెలంగాణ పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆనలైన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పలు విభాగాల్లో 10152 పోస్టు(ఎస్సై, కానిస్టేబుల్‌)లకు సోమవారం నాటికి 7 లక్షలకుపైగా అభ్యర్థులులు దరఖాస్తు చేసుకున్నారు

గ్రూప్‌-2లో 7628 దరఖాస్తుల తిరస్కరణ 1 Y 80 days ago

గ్రూప్‌-2లో 7628 దరఖాస్తు లు తిరస్కరించేందుకు ప్రతిపాదించినట్లు టీఎ్‌సపీఎస్సీ సోమవారం పేర్కొంది. దరఖాస్తుదారులు తప్పుడు వివరాలు, సంతకం చేయకపోవ టం, అభ్యర్థి ఫొటో కనిపించకుండా ఉండటం వంటి కారణాలతో దరఖాస్తులు తిరస్కరించనున్నట్లు సమాచారం. ఓటీఆర్‌ ద్వారా దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు మార్చి 12 వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్‌ క్యాంపు1 Y 80 days ago

 శాంతిభద్రతల పరిరక్షణలోనేకాక ప్రజాసేవలోనూ నగర పోలీస్‌ శాఖ ముందుంటోందని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షమ్స్‌ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో దక్షిణ మండలం పోలీసులు, అఫాక్‌ క్లినిక్‌ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్‌క్యాంపును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, కేర్‌ హాస్పిటల్‌, ఆషాక్‌ మల్టిస్పెషల్‌ హాస్పిటల్‌ సహకారంతో హెల్త్‌క్యాంపును నిర్వహించినట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌లో భాగంగా పాతబస్తీలో హెల్త్‌ క్యాంపులు, జాబ్‌మేళా, యువకుల కోసం క్రికెట్‌ పోటీలు నిర్వహించామన్నారు.

ప్రభుత్వం లీజుకు తీసుకున్న ప్రైవేటు భవనాల అద్దెల పెంపుదల1 Y 80 days ago

గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల పరిధిలో చ.అడుగు రూ.15గా నిర్ణయం. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తీరనున్న కొరత పభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తమ బిల్డింగ్‌లను అద్దెకు ఇచ్చేందుకు సంశయిస్తున్న భవన యజమానులకు మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలో చదరపు అడుగుకు కేవలం రూ.ఏడుగా ఉన్న అద్దెను ఒకేసారి రూ.15కు పెంచింది. అదనపు సౌకర్యాలుంటే రూ.18 చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. గుంటూరు, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ శాఖల రాష్ట్ర కార్యాలయాలన్నింటినీ సీఆర్‌డీఏ పరిధిలోకి తరలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కార్యాలయాల కోసం తక్కువ అద్దెకు భవనాలు లీజుకిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో పెరిగిన భవన నిర్మాణ ఖర్చులను పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం అద్దె పెంపు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలో చదరపు అడుగుకు కేవలం రూ.ఏడుగా ఉన్న అద్దెను ఒకేసారి రూ.15కు పెంచింది. ఇతర సౌకర్యాలుంటే రూ.18 చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. పెంచిన అద్దెకు సమ్మతించి తమ భవనాలను ప్రభుత్వానికి లీజుకు ఇచ్చేందుకు బిల్డర్లు క్యూ కడతారని అంచనా వేస్తున్నారు. 

వేధిస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య1 Y 80 days ago

 వేధింపులకు గురిచేస్తుడని భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించిందో భార్య. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీ్‌సస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ బీ కోటేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. అచ్చంపేట మండలంలోని అచ్చంపేట-వేల్పూరు మధ్య రహదారిపై సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ కొజ్జా నాగభూషణం గత నెలలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అచ్చంపేట ఎస్‌ఐ రాజేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో నాగభూషణాన్ని భార్య వాణి హత్య చేయించినట్లు వెల్లడైంది. వేధింపులకు గురిచేస్తున్నాడని, వాణి తమ బంధువైన అమరావతికి చెందిన స్వామికి విషయాన్ని తెలియజేసింది. రూ.5లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్సగా రూ.90వేలు ఇచ్చింది. ఫిబ్రవరి 17వతేదీన వాణి అచ్చంపేట మండలం తాళ్ల చెరువులోని బంధువుల ఇంటివద్ద ఉంది, తన భర్తను ఒంటరిగా రమ్మని చెప్పింది. ఈ విషయాన్ని కిరాయి హంత కులకు సమాచారాన్ని అందించింది. అమరావతికి చెందిన పల్లపు కొండలరావు, షేక్‌ నాగుల్‌మీరా, ఆకుల నాగబాబు, బత్తుల నారాయణ, కొజ్జా స్వామిలు కలిసి సత్తెనపల్లి నుంచి తాళ్ల చెరువుకు ఆటోలో బయలుదేరిన నాగభూషణంను వెంటాడి వేల్పూరు - అచ్చంపేట మధ్య దారుణంగా హత్య చేశారని సీఐ కోటేశ్వరరావు వివరించారు.

సన్నగా వీచే గాలిలోనే...మొబైల్‌ సాధనాలకు రీఛార్జి1 Y 80 days ago

అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కరించే స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్లు లాంటి ఖరీదైన మొబైల్‌ సాధనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటి బ్యాటరీలను తరచూ రీఛార్జి చేసుకోవడం వినియోగదారులకు పెద్ద సమస్యగా మారుతోంది. మన నిత్యజీవితానికి ఉపయోగపడే అనేక మొబైల్‌ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునేవారు ఎక్కువవడంతో బ్యాటరీ త్వరగానే ఛార్జింగ్‌ తగ్గిపోవడం నిరంతర సమస్యగా మారుతోంది. ఛార్జింగ్‌ డౌన్‌ అయిన వెంటనే ప్లగ్‌ పాయింట్ల కోసం వెతుకులాడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కంపెనీలు పవర్‌బ్యాంకుల వంటి సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ, వాటి ఉపయోగం పట్ల కూడా వినియోగదారులు సంతృప్తిగా లేరు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి బ్యాటరీలు, పవర్‌ సప్లై అవసరం లేకుండా మొబైల్‌ సాధనాలను రీఛార్జి చేయడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మద్రాసు ఐఐటీ పట్టభద్రుడు శ్యామ్‌నాథ్‌ గొల్లకోట ఆవిష్కరించారు. మొబైల్‌ టెలిఫోన్‌ ప్రపంచంలో విప్లవాన్ని సృష్టించగలదని చెబుతున్న ఈ విధానంలో ఏదో మూలలో వైర్‌లెస్‌ యాంటెనా టవర్లను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. యాంటెనాలకు కూడా భారీ బ్యాటరీలు లాంటివాటి అవసరమేమీ ఉండదు. వాటి నుంచి బ్రాడ్‌కాస్ట్‌ టీవీ సిగ్నల్స్‌ తరహాలో సన్నటి గాలి నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను తీసుకుని, పని చేస్తుంది. ఈ యాంటెనా టవర్ల ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్‌ ఫోన్లను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఆ తరంగాలతో ఛార్జింగ్‌ చేయడం కోసం ఆయన క్రెడిట్‌ కార్డు రూపంలో ఓ చిన్న సాధనాన్ని తయారు చేశారు.

హిజ్రాల కోసం వెళ్తే.. సాఫ్ట్ వేర్‌లు దొరికారు..!1 Y 83 days ago

అర్థరాత్రి రోడ్ల పక్కన నిలబడి వాహనదారులను, పాదచారులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న హిజ్రాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదు మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోలీసులకు చిక్కారు. వీరంతా హిజ్రాల కోసం వచ్చి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5 లోని అన్నపూర్ణ స్టూడియో, ఏడెకరాల మధ్య ఉన్న రోడ్డులో ఈ కార్యకలాపాలు జరుగుతుండటంతో పాటు గొడవలు నిత్యకృత్యంగా మారాయి.� ఇందిరానగర్ - శ్రీకృష్ణానగర్ గడ్డ మీది నుంచి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయం మీదుగా జూబ్లీహిల్స్‌వైపు వెళ్లే రోడ్డులో నిత్యం హిజ్రాలు మాటువేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖలో తెలంగాణ సంఘం ఏర్పాటును అడ్డుకున్న ఏపీ కళాకారులు1 Y 83 days ago

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జూనియర్ సినీ కళాకారుల మధ్య విశాఖలో వివాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన కొంతమంది కళాకారులు అక్కయ్యపాలెం హైవే పక్కనే జూనియర్ కళాకారుల సంఘం కార్యాలయ ఏర్పాటుకు యత్నించారు. వీరిని ఏపీ కళాకారులు అడ్డుకున్నారు. కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులను పీకేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

రజనీ డైలాగుతో సూర్య ఎన్నికల ప్రచారం1 Y 83 days ago

వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాలకూ తగిన సమయాన్ని కేటాయిస్తున్నారు సూర్య. పేద విద్యార్థుల కోసం ‘అగరం’ ద్వారా విద్యాసేవ చేస్తున్న ఆయన తాజాగా ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి మేరకు ఓటరు అవగాహన ప్రచారంలో పాలుపంచుకున్నారు. ప్రత్యక్షంగా ప్రజల ముందుకు రానప్పటికీ, ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా డైలాగును అనుకరిస్తూ సూర్య తనదైన శైలిలో ఓటు హక్కుపై ప్రజలకు చక్కని సందేశానిచ్చారు. ఆ సినిమాలో సన్యాసి పాత్రలో రజనీ చెప్పిన ఓ డైలాగ్‌ని చెబుతూ ‘ఈ డైలాగ్‌కి వాయిస్‌ ఎవరిది ఉండాలో వారిదే ఉండాలని చెప్పిన సూర్య, ఇప్పుడు మీ వాయిస్ ఏంటన్నది చెప్పాల్సిన టైం వచ్చిందంటూ’ తమిళనాట జరుగనున్న ఎన్నికలపై ఓటర్లకు పిలుపునిస్తూ విడుదల చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఖమ్మంలో టీఆర్ఎస్ తీర్థం తీసుకున్న వైసీపీ,టీడీపీ అభ్యర్ధులు1 Y 83 days ago

ఖమ్మం నగరంలో కార్పొరేటర్ల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొని అధికార టీఆర్ఎస్ కు మద్ధతు ప్రకటించారు.  38వ డివిజన్‌ వైసీపీ అభ్యర్థి ప్రియాంక పోటీ నుంచి తప్పుకొని రాష్ట్రమంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 43వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి మల్లీశ్వరి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్ధతు తెలిపారు. 

సాలూరులో రూ.1.80కోట్ల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం 1 Y 83 days ago

సాలూరులోని బీఎంపీఎస్‌ పార్శిల్‌ గోడౌన్‌ నుంచి రూ.1.80కోట్లు విలువచేసే గుట్కా ప్యాకెట్ల ను స్పెషల్‌ బ్రాంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 273 మందికి జైలు శిక్ష1 Y 83 days ago

 డ్రంకెన డ్రైవ్‌లో పట్టుబడిన 273 మందిని ఎర్రమంజిల్‌ 3వ, 4వ మెట్రోపాలిటన మెజిసే్ట్రట్‌ కోర్టులో శుక్రవారం ప్రవేశ పెట్టారు. వీరందరికీ కోర్టు శిక్ష విధించింది. వీరిలో ఇద్దరికి 15, మరో ఇద్దరికి 10, 18 మందికి వారం, ఆరుగురికి 5, 11 మందికి 3, 42 మందికి 2, 15 మందికి ఒకరోజు, మిగిలిన వారికి పనివేళలు ముగిసే వరకు కోర్టు ఆవరణలో ఉండమని న్యాయమూర్తి ఆదేశించారు.

బ్యుటీషియన్‌ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం 1 Y 83 days ago

ఉద్యోగం కోసం నెట్‌లో సెర్చ్‌ చేసిన యువతిని నైజీరియన్లు నిలువునా మోసం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన యువతి డిగ్రీ చదివి డిప్లొమా ఇన కాస్మెటాలజీ కోర్సు చేసింది. ఉద్యోగ వేటలో నగరానికి వచ్చి అమీర్‌పేటలో ఉమెన్స హాస్టల్‌లో ఉంటోంది. నెట్‌లో యూకే వీసా ఫ్రీ జాబ్స్‌ డాట్‌ కాం వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసింది. అందులో ఐదారు మెయిల్స్‌ కనిపించాయి. ఓ మెయిల్‌లో విలియమ్స్‌ పేరు, ఫోన నంబరు ఉండడంతో అతడిని సంప్రదించింది. అతడు మరో రెండు వెబ్‌సైట్ల చిరునామా ఇచ్చాడు. ఆ నంబర్లలో ఆమె సంప్రదించింది. యూకేలో ఉద్యోగం కావాలంటే ఇంటర్నేషనల్‌ ఇంగ్లిషు లాంగ్వేజ్‌ టెస్ట్‌ (ఐఈఎల్‌టీ) పాస్‌ కావాలని చెప్పారు. ఆమెకు ఆ సర్టిఫికెట్‌ లేనందున ఉత్తీర్ణత సాధించినట్టు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి మొదట రూ.19,500 వసూలు చేశారు. ఆ తర్వాత వీసా ప్రాసెసింగ్‌ ఫీజు, లేటైనందున వీసా రీ-యాక్టివ్‌, స్టాంపింగ్‌, ఇమ్మిగ్రేషన, క్యాష్‌ అండ్‌ ట్రాన్సిట్‌, యాంటీ టెర్రరిజం, డ్రగ్‌ ఫీజు రూపంలో పలు దఫాలుగా మొత్తం రూ.5.86 లక్షలు వసూలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బెన్ కార్సన్1 Y 83 days ago

 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి మాజీ న్యూరో సర్జన్ బెన్ కార్సన్ వైదొలగారు. తన ప్రచారానికి రాజకీయ మనుగడ కనిపించడంలేదని ఆయన కొద్ది రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పోటీ నుంచి తాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దేశ రక్షణలో తాను మరింత ఎక్కువగా పాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు. దేశంపై రుణ భారం పెరుగుతుండటంపై హెచ్చరించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మితిమీరిపోయాయని, నైతిక విలువలకు విఘాతం కలుగుతోందని ఆరోపించారు. విశ్వాసం, కుటుంబం మన బలానికి మూల స్తంభాలని, అవి క్రమంగా నశిస్తున్నాయని చెప్పారు. మన దేశానికి ఏమవుతోందో చూడండని పిలుపునిచ్చారు. ‘‘మై ఫెయిత్ ఓట్స్’’ అనే నిష్పాక్షిక సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ క్రిస్టియన్లను ఓటు వేయమంటూ ప్రోత్సహిస్తుంది.


Copyrights © 2014 6tvlive.com